Dileep Raj: కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ గుండెపోటుతో మృతి
కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన ఆకస్మిక మృతితో శాండల్‌వుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం దిలీప్ రాజ్‌కు తీవ్రమైన గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయనను బతికించలేకపోయామని వైద్యులు ప్రకటించారు. పునీత్ రాజ్‌కుమార్‌తో కలిసి నటించిన ‘మిలనా’ (2007) చిత్రంతో దిలీప్ […]
