HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kavitha Warns The Congress Government

Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

  • Author : Vamsi Chowdary Korata Date : 11-07-2026 - 11:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha warns the Congress government.
Kavitha warns the Congress government.

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ (JVR OC) గని వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన సింగరేణి ‘బాయిబాట’ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఈ హైడ్రామా చోటుచేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా కవితను గని లోపలికి అనుమతించలేమంటూ సింగరేణి అధికారులు, పోలీసులు ఆమెను గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత, తన పార్టీ శ్రేణులతో కలిసి పోలీసుల బారికేడ్లను, గేట్లను నెట్టుకుంటూ లోపలికి దూసుకెళ్లారు. గని ప్రాంగణంలోనే కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులను సింగరేణి భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో అక్కడ కాసేపు నెట్టులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు భారీగా మోహరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్మిక సదస్సులో కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా కేవలం వెయ్యి రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. సింగరేణి కార్మికుల చిరకాల డిమాండ్ అయిన డిపెండెంట్ ఉద్యోగాల (కారుణ్య నియామకాలు) భర్తీపై ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే తన స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ సర్కార్ ఈ విషయమై స్పందించకపోతే, కార్మికుల హక్కుల సాధన కోసం ఈ నెల 20వ తేదీన హెచ్‌ఎంఎస్ (HMS) కార్మిక సంఘం ఆధ్వర్యంలో తానే స్వయంగా సింగరేణి ప్రాంతంలో నిరాహార దీక్షకు కూర్చుంటానని కవిత డెడ్‌లైన్ విధించారు. కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • congress party
  • kalvakuntla kavitha
  • telangana government
  • telangana politics
  • trs party

Related News

CM Revanth Reddy issues a strong warning to KTR.

Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఖమ్మం జిల్లాలో జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ (రైతు ఆశీర్వాద సభ) వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) లక్ష్యంగా అత్యంత ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇటీవల కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రాంతాన్ని సందర్శించి, మేడిగడ్డ బ్యారేజీలో తక్షణమే నీటిని నింపాలని చేసిన వ్యాఖ్యలపై సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంజనీరింగ్ లోపాలతో ఇ

  • Massive arrangements for the Farmers' Blessing Meeting

    Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

  • Green signal for Musi rejuvenation; government approves ₹7,000 crore project.

    Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Kalvakuntla Kavitha lashes out at KTR.

    kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

  • Good news for unemployed youth in Telangana: Green signal for RTC conductor posts.

    Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

Latest News

  • Home Loan Rates: ఇల్లు కొనాలనుకుంటున్నారా? జూలై నెలలో హోంలోన్లపై రుణ వడ్డీ రేట్లు ఎంత ఉందంటే?

  • Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

  • Nara Brahmani: నారా బ్రాహ్మణికి ‘ఫార్చ్యూన్‌ ఇండియా’ జాబితాలో చోటు.. నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్

  • Tirumala: అలిపిరి మెట్ల మార్గంలో చిరుత హల్ చల్

  • US-Iran War: అమెరికా,ఇరాన్ చర్చలు.. కానీ సీజ్‌ఫైర్ మాత్రం క్లోజ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd