HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >If You Want Radiant Skin And Thick Hair You Simply Must Use That Oil

Almond Oil: ప్రకాశవంతమైన చర్మం, ఒత్తైన జుట్టు మీ సొంతం కావాలంటే ఆ నూనె ఉపయోగించాల్సిందే!

  • Author : Vamsi Chowdary Korata Date : 03-07-2026 - 4:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
If you want radiant skin and thick hair, you simply must use that oil!
If you want radiant skin and thick hair, you simply must use that oil!

మామూలుగా ప్రతి ఒక్కరూ మెరిసే చర్మం అలాగే ఒత్తైన, పొడవాటి జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఎన్నో వంటింటి చిట్కాలను ఉపయోగించడంతో పాటు రకరకాల బ్యూటీ ప్రోడక్టులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితాలు లభించలేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో కాలుష్యం, దుమ్ము, ధూళి ఇలా అనేక రకాల కారణాల వల్ల చాలామంది చర్మం అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఆ కారణాల వల్ల చర్మం, జుట్టు నిస్తేజంగా, నిర్జీవంగా మారుతాయి. ఈ సమస్యలను నివారించి, అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి బాదం నూనె సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

మరి బాదం నూనెతో జుట్టు, చర్మ సమస్యలను ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చర్మంపై అప్లై చేసుకోవడానికి స్వీట్ బాదం నూనె మాత్రమే వాడాలి. స్వీట్ బాదం నూనెలో హైపో అలెర్జెనిక్ గుణాలు ఉంటాయి. బాదం నూనెలో ఉండే విటమిన్ ఇ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది స్కిన్ ఇన్ఫ్లమేషన్, వాపు, చికాకు, దురద వంటి చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మానికి రోజూ బాదం నూనె అప్లై చేసుకోవడం వల్ల ప్రకాశవంతమైన, మృదువైన చర్మాన్ని పొందవచ్చు. దీనిలో మెండుగా ఉండే విటమిన్ ఇ చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది. దీన్ని తరచూ చర్మానికి అప్లై చేసుకుంటే చర్మ ఛాయ కూడా మెరుగుపడుతుంది.

చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు ఇబ్బంది పెట్టే వారికి బాదం నూనె మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు యాంటీ ఏజింగ్ కారకాలుగా పనిచేస్తాయి. దీన్ని తరచూ రాసుకోవడం వల్ల ముడతలు కూడా తగ్గుతాయి. ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య డార్క్ సర్కిల్స్. రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల బాదం నూనెను కళ్ల కింద అప్లై చేసి మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. కాలుష్యం, దుమ్ము, ధూళి వంటివి చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయి. మీ చర్మాన్ని ఫ్రెష్‌గా ఉంచుకోవాలంటే రెండు చెంచాల పెసరపిండిలో సరిపడా బాదం నూనె కలుపుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని చర్మానికి నలుగులా రాసుకుంటే మృతకణాలు తొలగిపోతాయి, చర్మం తాజాగా మారుతుంది. సూర్య కిరణాలు, కాలుష్యం కారణంగా జుట్టు చివర్లు చిట్లడం, పొడిబారడం వంటి సమస్యలు కొందరిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు బాదం నూనె, ఆముదం, ఆలివ్ నూనెలను సమంగా తీసుకొని మిక్స్ చేయండి. ఈ నూనెతో కుదుళ్లను మర్దన చేసుకోవాలి. ఇలా కనీసం వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. బాదం నూనె హెయిర్ గ్రోత్‌కు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా కేశాలకు కాంతిని అందిస్తూ మృదువుగా మారుస్తుంది. వారానికి కనీసం రెండు సార్లు ఈ నూనెతో తల మర్దన చేసుకుని తలస్నానం చేస్తే ఒత్తైన జుట్టు సొంతం చేసుకోవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Almond Oil
  • Almond Oil benefits
  • almond oil for skin
  • glowing skin tips
  • hair tips

Related News

Simply applying this to your hair every day is enough—your hair is guaranteed to grow thick and lush!

Hair Tips: ప్రతిరోజు దీన్ని తలకు పట్టించుకుంటే చాలు.. జుట్టు గడ్డిలా గుబురుగా పెరగడం ఖాయం!

ప్రస్తుత రోజుల్లో స్త్రీ, పురుషులు చాలామంది జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. హెయిర్ ఫాల్, బట్టతల రావడం, జుట్టు చిట్లిపోవడం, చుండ్రు లాంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్య ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ హెయిర్ ఫాల్ సమస్య ఆగిపోయి జుట్టు మునుపటిలాగే పెరగడం కోసం చాలామంది ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ ఉప

    Latest News

    • Almond Oil: ప్రకాశవంతమైన చర్మం, ఒత్తైన జుట్టు మీ సొంతం కావాలంటే ఆ నూనె ఉపయోగించాల్సిందే!

    • Ayatollah Ali Khamenei: ఖమేనీ అంత్యక్రియలు మోసల్లా మసీదుకు తరలింపు

    • Vijayasai Reddy: అమరావతి రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హైకోర్టులో పిటిషన్

    • Bhatti Vikramarka: తెలంగాణ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

    • Weight Loss: బరువు పెరుగుతున్నారా? అయితే ఆలస్యం చేయకుండా వీటిని ప్రయత్నించండి..!

    Trending News

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd