HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Do You Know What Signs Appear Before Goddess Lakshmi Enters The House

Spirituality: లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మీకు తెలుసా?

  • Author : Vamsi Chowdary Korata Date : 04-07-2026 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Do you know what signs appear before Goddess Lakshmi enters the house?
Do you know what signs appear before Goddess Lakshmi enters the house?

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉండడం అనేది కామన్. అయితే కష్టాల నుంచి గట్టెక్కాలి అంటే ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉండకూడదు. ఆర్థిక సమస్యలు ఉండకూడదు అంటే లక్ష్మి అనుగ్రహం కలగడం తప్పనిసరి. మరి లక్ష్మి అనుగ్రహం కోసం ఎన్నెన్నో పూజలు, వ్రతాలు, నోములు, దానధర్మాలు వంటివి చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. అయితే అంతా బాగానే ఉంది కానీ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఆ విషయాన్ని ఎలా తెలుసుకోవచ్చు అనే వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి స్వరూపమైన కోతి అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చి దేవుడి పటం దగ్గర పెట్టిన నైవేధ్యాన్ని లేదా కొబ్బరి చిప్పనో లేదా అరటిపండునో తీసుకెళ్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కాలుపెట్టబోతుందని అర్థం.

అలాగే నిద్రిస్తున్నప్పుడు కలలో తెల్లని గుర్రం లేదా ఏనుగులు కనబడితే త్వరలో ఆ వ్యక్తి కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుందని అర్థం. కలలో ఎవరో మీ చెయ్యి పట్టుకొని నడిపించుకొని తీసుకెళ్తున్నట్లు కనబడితే భగవంతుడి అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోతున్నాయని అర్థం. మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఆడవాళ్లలో ఎవరైనా మీ ఇంటికొచ్చి ‘ఆకలేస్తుంది, ఏదైనా పెట్టండి’ అని అడిగితే, మీ పంట పండినట్లే అని, వారికి తీపి పదార్థాలు పెట్టడం ద్వారా మీ ఇంట్లోని దరిద్రమంతా తొలగిపోతుందని, తద్వారా లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఎవరికైతే బ్రహ్మ ముహూర్తంలో అకస్మాత్తుగా మెలుకువ వచ్చి గంటల మోత వినబడి, వాళ్ల మనస్సులో వాళ్లకు తెలియకుండా ‘ఓం నమః శివాయ’ అనే శివ పంచాక్షరీ మంత్రాన్ని లేదా ‘ఓం నమో నారాయణాయ’ అనే విష్ణు అష్ఠాక్షరీ మంత్రాన్ని జపిస్తారో, వాళ్లకి అతి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం.

పురుషులకు అస్తమానం కుడికన్ను అదురుతున్నా, కుడి చెయ్యి అదురుతున్నా; అదేవిధంగా స్త్రీలకు అయితే ఎడమకన్ను, ఎడమ చెయ్యి అదురుతుంటే వాళ్లకు తొందర్లోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. సకల దేవతా స్వరూపి అయిన గోమాత శుక్రవారం లేదా మంగళవారం రోజు అనుకోకుండా మీ ఇంట్లోకి వచ్చినా లేదా ఇంటి ముందుకొచ్చి ఆహారాన్ని స్వీకరించినా, మూత్రం పోసినా, పేడ వేసినా మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి త్వరలోనే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం. ఇంట్లో పూజ చేసిన సమయంలో దేవుడికి మంగళ హారతి ఇచ్చేటప్పుడు దేవుడి పటంపై లేదా విగ్రహంపై ఉన్న పువ్వు అకస్మాత్తుగా జారిపడితే వారికి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని పండితులు అంటున్నారు. అలాగే ఇంట్లోకి అకస్మాత్తుగా రామ చిలుక వస్తే ఆ ఇంట్లోని వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. చిలుక మన్మథుడి వాహనం. మన్మథుడు లక్ష్మీదేవి కుమారుడు. కుబేరుడికి, చిలుకకి కూడా గొప్ప సంబంధం ఉందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • goddess Lakshmi Devi
  • lakshmi anugraham

Related News

    Latest News

    • Spirituality: లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మీకు తెలుసా?

    • ప్రాణం తీసిన కొబ్బరి బొండం

    • Relationship: శృంగారం చేసిన తర్వాత పురుషులు ఏమనుకుంటారో తెలుసా?

    • Owaisi college: ఒవైసీ విద్యాసంస్థపై హైకోర్టు సీరియస్!

    • Prakash Raj: రావణ్ మళ్ళీ మళ్ళీ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

    Trending News

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd