HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Heavy Rain Warning For Ap

Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

  • Author : Vamsi Chowdary Korata Date : 09-07-2026 - 9:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heavy rain warning for AP...
Heavy rain warning for AP...

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఐదు రోజులపాటు నైరుతి గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. రైతులు, కూలీలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో నిలబడకూడదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌పై ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోంది. కొద్దిరోజులుగా తేలికపాటి వర్షాలు మినహా పెద్దగా ఎక్కడా వర్షాలు లేవు. నైరుతి రుతుపవనాలు విస్తరించినా ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. వానలు పడకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.. ఖరీఫ్ పంటలపై ప్రభావం కనిపిస్తోందంటున్నారు. ఈ ఏడాది ఇదే పరిస్థితి కొనసాగితే నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీపై ఎల్‌నినో ప్రభావం ఉంటుందనే ముందస్తు అంచనాలతో ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ పంటలను సూచించింది. ఈ మేరకు రైతులకు అవగాహన కూడా కల్పించారు.

ఆంధ్రప్రదేశ్ హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత APSDMA (విపత్తుల నిర్వహణ సంస్థ) కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో నైరుతి రుతుపవనాలు, ఎల్-నినో ప్రభావంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. విపత్తుల వల్ల ఏ ఒక్క ప్రాణనష్టం జరగకుండా చూడటమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని ఆమె ఆదేశించారు. ముఖ్యంగా ఎల్-నినో ప్రభావం ఎక్కువగా ఉన్న రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వర్షభావ పరిస్థితులపై దృష్టి సారించి, కరవు ముప్పు ఉన్న మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అదే సమయంలో, వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపునకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, పునరావాస కేంద్రాలలో వసతులు కల్పించాలని మరియు పోలీస్, ఫైర్, NDRF, APSDRF బృందాలు అత్యవసర స్పందనకు సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh heavy rains
  • AP Rain Alert
  • AP Weather Report
  • heavy rains
  • Heavy Rains Alert
  • heavy rains Andhra Pradesh
  • Heavy rains in AP
  • weather report

Related News

Heavy rains in Telangana

Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్ ప్రారంభమై దాదాపు 38 రోజులు గడుస్తున్నా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, మిగిలిన 17 జిల్లాల్లో కేవలం సాధారణ వర్షపాతమే నమోదైనట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ వానాకాలం సీజన్ సాగు పరిస్థితులపై వ్యవసాయశాఖ బుధవారం ప్రభుత్వాన

  • Landslides triggered by heavy rains in Wayanad...

    Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

  • Rains inundating Mumbai

    Heavy Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

  • Heavy rains in Telangana

    Rain Alert: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

  • Heavy rain warning for AP...

    Weather Report: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాల

Latest News

  • Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

  • Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

  • TTD VIP Break Darshan: జూలై నుండి సెప్టంబ‌ర్ వ‌ర‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల ర‌ద్దు

  • ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd