News
-
Tesla Car : భారత్‌లో తొలి టెస్లా కారు.. కొన్న మొదటి వ్యక్తి ఎవరో తెలుసా?
ఈ కారు మోడల్ వై (Tesla Model Y), తెలుపు రంగులో ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించిన తాళాలను సంస్థ ప్రతినిధులు స్వయంగా మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలో మొట్టమొదటి టెస్లా వాహనాన్ని పొందడం నా జీవితంలో ఒక గౌరవకరమైన సందర్భం. పర్యావరణహిత, శక్తి సామర్థ్యం కలిగిన వాహనాలను ప్రోత్సహించేందుకు ఇది ఒక ముఖ్యమైన అడుగు.అని పేర్కొన్నారు.
Published Date - 12:48 PM, Fri - 5 September 25 -
Donald Trump: వైట్‌హౌస్‌లో ట్రంప్ విందు.. టెక్ దిగ్గజాలతో ఏఐ చర్చలు
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్నాలజీ ప్రపంచ దిగ్గజాలకు వైట్‌హౌస్‌లో ఘన విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సహా పలువురు టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగ నాయకులు హాజరయ్యారు.
Published Date - 12:37 PM, Fri - 5 September 25 -
Visakhapatnam : న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది : సీఎం చంద్రబాబు
న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకమే ప్రజలు కోర్టులను ఆశ్రయించడానికి కారణమని అన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించడానికి ‘మధ్యవర్తిత్వం’ (Mediation) ఒక సమర్థవంతమైన మార్గమని పేర్కొన్నారు. వివాదాలను న్యాయపరంగానే కాక, సామరస్యపూరితంగా పరిష్కరించేందుకు ఇది ఉత్తమమని అభిప్రాయపడ్డారు.
Published Date - 12:29 PM, Fri - 5 September 25 -
CM Chandrababu : సీఎం చంద్రబాబుకు కొత్త ఎయిర్‌బస్ H160 హెలికాప్టర్
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటనల్లో మరింత భద్రత, వేగం కోసం అత్యాధునిక ఎయిర్‌బస్ H160 హెలికాప్టర్ ను వినియోగంలోకి తీసుకొచ్చారు.
Published Date - 12:15 PM, Fri - 5 September 25 -
Anil Ambani : అనిల్ అంబానీకి మరో షాక్.. సీబీఐ కేసు నమోదు
ఎస్బీఐ అందించిన సమాచారం మేరకు, అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్) సంస్థ, దాని అనుబంధ కంపెనీలు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నాయి. ప్రత్యేకంగా, రూ.2,929.05 కోట్ల రుణం మోసపూరితంగా పొందినట్లు గుర్తించిన సీబీఐ, ముంబైలో ఆర్‌కామ్, అనిల్ అంబానీ సహా ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Published Date - 12:06 PM, Fri - 5 September 25 -
HYDRA : హైడ్రా చర్యతో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదానికి తెర
HYDRA : రంగారెడ్డి జిల్లా, బండ్లగూడ జాగీర్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూకబ్జాకు ముగింపు పలికింది. అత్యంత విలువైన పార్కు స్థలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకుని యథేచ్ఛగా వినియోగిస్తున్న పరిస్థితి ఇటీవల వరకు కొనసాగింది.
Published Date - 11:50 AM, Fri - 5 September 25 -
Gaza : గాజాలో 64వేలు దాటిన మరణాలు
Gaza : ఈ యుద్ధం వల్ల గాజా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, నీరు, వైద్య సదుపాయాలు లేకుండా నిరాశ్రయులయ్యారు. లక్షలాది మంది ప్రజలు భయం, ఆందోళనతో గడుపుతున్నారు
Published Date - 11:50 AM, Fri - 5 September 25 -
Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్
సోషల్ మీడియాలో ఫేక్ హ్యాండిల్స్‌ను ఉపయోగించి అసత్య ప్రచారాలు చేయడం ద్వారా టీచర్లపై అపవాదులు మోపడం దారుణమని, ఇలాంటి చర్యలు అత్యంత ఖండనీయమని వ్యాఖ్యానించారు. వైసీపీకి చెందిన ఓ ఫేక్ సోషల్ మీడియా హ్యాండిల్ ఒక ఫోటోను పోస్ట్ చేసింది.
Published Date - 11:28 AM, Fri - 5 September 25 -
Telangana: హైకోర్టులో సంచలనం.. పిటిషనర్ ప్రవర్తనతో విచారణ నుంచి తప్పుకున్న జడ్జి
Telangana: తెలంగాణ హైకోర్టులో అరుదైన సంఘటన వెలుగుచూసింది. ఓ సివిల్ కేసు పిటిషనర్ న్యాయపరమైన హద్దులు దాటిపోతూ నేరుగా న్యాయమూర్తి చాంబర్లోకి ప్రవేశించి తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని ఒత్తిడి చేయడం చట్టపరమైన వర్గాలను కుదిపేసింది.
Published Date - 11:25 AM, Fri - 5 September 25 -
Wonderful : 5.2 కేజీలతో బాలభీముడు పుట్టాడు..ఎక్కడో తెలుసా..?
Wonderful : జబల్పూర్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో 34 ఏళ్ల మహిళ(Shubhangi)కు డెలివరీ జరిగింది. సాధారణ ప్రసవం సాధ్యం కాకపోవడంతో, వైద్యులు సిజేరియన్ ద్వారా శిశువును బయటకు తీశారు
Published Date - 11:15 AM, Fri - 5 September 25 -
Trump : జపాన్ పై సుంకం 25 నుంచి 15 శాతానికి తగ్గింపు
Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక ఆర్థిక నిర్ణయం తీసుకున్నారు. జపాన్‌తో నెలల తరబడి సాగిన వాణిజ్య చర్చలకు తెరదిస్తూ, ఇరు దేశాల మధ్య కొత్త ఒప్పందం అమలు దిశగా ముందడుగు వేశారు.
Published Date - 11:01 AM, Fri - 5 September 25 -
Ajit Pawar : వివాదంలో అజిత్ పవార్.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు
సోలాపుర్ జిల్లాలోని కుర్దూ గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయనే ఫిర్యాదులు మహిళా ఐపీఎస్ అధికారి అంజనా కృష్ణకు అందాయి. వెంటనే స్పందించిన ఆమె రెండు రోజుల క్రితం అక్కడికి వెళ్లి స్వయంగా తనిఖీలు చేపట్టారు.
Published Date - 10:51 AM, Fri - 5 September 25 -
DJ Sound : DJ సౌండ్ తో ప్రాణాలు పోతాయా?
DJ Sound : డీజే శబ్దాలు కేవలం పెద్దలకే కాకుండా, గర్భిణీ స్త్రీలకు కూడా అత్యంత ప్రమాదకరమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా గర్భం దాల్చిన నాలుగో నెల నుండి, డీజే శబ్దాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు
Published Date - 10:50 AM, Fri - 5 September 25 -
Accident : శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి
Accident : శ్రీలంకలో ఒక పెద్ద విషాదం చోటుచేసుకుంది. ఎల్లా–వెల్లవాయ ప్రధాన రహదారి సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 15 మంది మున్సిపల్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 10:38 AM, Fri - 5 September 25 -
CBN New Helicopter – సీఎం చంద్రబాబుకు కొత్త హెలికాప్టర్..ప్రత్యేకతలు ఇవే..!
CBN New Helicopter : దీనిలో ఉన్న అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థ, మెరుగైన భద్రతా ఫీచర్లు, తక్కువ శబ్దం చేయడం దీని ముఖ్య లక్షణాలు. ఇది ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా చేస్తుంది
Published Date - 10:38 AM, Fri - 5 September 25 -
CM Stalin New Look : సీఎం స్టాలిన్ స్టైలిష్ లుక్
CM Stalin New Look : తాజాగా యూకే పర్యటనకు వెళ్ళి అందరి దృష్టిని ఆకర్షించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఆయన పర్యటన చేపట్టారు. అయితే, ఈ పర్యటనలో ఆయన అనుసరించిన స్టైల్ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది
Published Date - 10:30 AM, Fri - 5 September 25 -
AP : దేవాదాయ శాఖలో వివాదం..అసిస్టెంట్ కమిషనర్ పై వేటుకు రంగం సిద్ధం!
గత నెల 16న దేవాదాయ శాఖ కమిషనర్ కె. శాంతికి షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటీసుకు ఆమె ఇటీవలే సమాధానమిచ్చారు. అయితే, ఆమె సమర్పించిన వివరణలు శాఖను తృప్తిపరచలేకపోయాయని సమాచారం.
Published Date - 10:27 AM, Fri - 5 September 25 -
HYD Real Estate : హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది – హరీష్ రావు
HYD Real Estate : హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాయి
Published Date - 10:12 AM, Fri - 5 September 25 -
Harish Rao : రేపు KCRతో హరీశ్ భేటీ..ఏంచెప్పబోతున్నాడో..!!
Harish Rao : ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లి పార్టీ అధినేతతో సమావేశమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది, ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె కవిత చేసిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది
Published Date - 09:39 AM, Fri - 5 September 25 -
Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ
Lokesh : మొత్తంగా, నాలుగు నెలల వ్యవధిలో లోకేశ్ రెండోసారి ప్రధాని మోదీని కలుసుకోవడం విశేషం. ఈ భేటీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, కేంద్ర-రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం ఏర్పడటానికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు
Published Date - 09:00 AM, Fri - 5 September 25 -
Universal Health Policy : యూనివర్సల్ హెల్త్ పాలసీ పూర్తి వివరాలు!
Universal Health Policy : ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రజలకు హెల్త్ పాలసీ అందించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పాలసీ కింద ఎంపిక చేసిన కుటుంబాలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజ్ లభిస్తుంది
Published Date - 08:15 AM, Fri - 5 September 25 -
Trump Tariffs : టారిప్స్ పై ఆందోళన అవసరం లేదు – పీయూష్
Trump Tariffs : భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని, వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు చేస్తుందని ఆయన నొక్కి చెప్పారు
Published Date - 07:45 AM, Fri - 5 September 25 -
Anushka Ghaati Talk : అనుష్క ‘ఘాటీ” మూవీ పబ్లిక్ టాక్
Anushka Ghaati Talk : సినిమా ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల నుంచి సోషల్ మీడియాలో ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తోంది
Published Date - 07:24 AM, Fri - 5 September 25 -
Ghati : అనుష్క ‘ఘాటి’ సినిమాకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఈగల్ టీమ్
Ghati : ఈ చిత్రంలో గంజాయి అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, అవి సమాజానికి తప్పుడు సందేశం ఇస్తాయని వారు పేర్కొన్నారు.
Published Date - 10:16 PM, Thu - 4 September 25 -
Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
Amit Shah : సెప్టెంబర్ 6వ తేదీన ఆయన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉంది
Published Date - 10:11 PM, Thu - 4 September 25 -
Nails : గోర్లు కొరికేవారికి షాకింగ్ న్యూస్.. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే చాన్స్
Nails : గోర్లు కొరకడం అనేది చాలామందిలో కనిపించే అలవాటు. ఇది సాధారణంగా ఒత్తిడి, ఆందోళన లేదా బోర్ అనిపించినప్పుడు చేస్తుంటారు.
Published Date - 10:00 PM, Thu - 4 September 25 -
Pova Mobiles : POVA స్లిమ్ 5G నుంచి స్లిమెస్ట్ ఫోన్.. ధర ఎంత తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Pova Mobiles : ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ అంటూ టెక్నో కంపెనీ POVA స్లిమ్ 5G ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
Published Date - 09:30 PM, Thu - 4 September 25 -
IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!
ప్రభుత్వం జీఎస్టీలో చేసిన సంస్కరణల వల్ల అంతర్జాతీయ మ్యాచ్‌ల టికెట్లు చౌకగా మారాయి. ఇంతకుముందు అంతర్జాతీయ మ్యాచ్‌ల టికెట్లపై 28 శాతం జీఎస్టీ ఉండేది.
Published Date - 09:00 PM, Thu - 4 September 25 -
New GST: జీఎస్టీలో కీలక మార్పులు.. రూ. 48,000 కోట్లు నష్టం?!
ప్రభుత్వ అంచనాల ప్రకారం 2023-24 నాటి వినియోగ నమూనాల ఆధారంగా ఈ మార్పుల వల్ల ఏటా సుమారు రూ. 48,000 కోట్ల ఆదాయ నష్టం సంభవించవచ్చు. ఈ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాల్సి రావచ్చని రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ వార్తా సంస్థ ఐఏఎన్ఎస్కు తెలిపారు.
Published Date - 08:30 PM, Thu - 4 September 25 -
Nara Lokesh : ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న నారా లోకేశ్
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
Published Date - 08:21 PM, Thu - 4 September 25 -
Amit Mishra: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మరో టీమిండియా క్రికెటర్!
ఏఎన్ఐతో మాట్లాడిన అమిత్ మిశ్రా.. "నా కెరీర్లో నేను అరంగేట్రం చేసిన తర్వాత ఐదేళ్ల గ్యాప్ వచ్చింది. నాకు ఈ ఒక్క విషయంపై మాత్రమే బాధ ఉంది" అని అన్నారు.
Published Date - 07:55 PM, Thu - 4 September 25 -
Good News: గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం.. మరో హామీ అమలు!
ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ లక్ష్యం, వైద్య ఖర్చుల వల్ల ఏ ఒక్క కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా చూడటమే. ఈ కొత్త విధానం పాత ఆరోగ్య పథకాలలో ఉన్న లోపాలను సరిచేస్తుంది.
Published Date - 07:14 PM, Thu - 4 September 25 -
Tablighi Jamaat: తబ్లిగి జమాత్ చీఫ్ మౌలానా సాద్‌కు ఊరట.. ఐదేళ్ల తర్వాత క్లీన్ చిట్!
ఈ కేసులో గత నెలలోనే ఢిల్లీ హైకోర్టు కూడా ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైన సమయంలో నిజాముద్దీన్ మర్కజ్లో నివసిస్తున్న ప్రజలు, ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించలేదని కోర్టు పేర్కొంది.
Published Date - 07:01 PM, Thu - 4 September 25 -
Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 5వేల మంది ఎంపిక!
మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ, సర్వే విభాగాలకు అవినాభావ సంబంధం ఉందని, సర్వే విభాగాన్ని బలోపేతం చేస్తేనే రెవెన్యూ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించగలమని అన్నారు.
Published Date - 06:50 PM, Thu - 4 September 25 -
Amazon Paisa Vasool : అమెజాన్ నుండి బంపర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్.. ‘పైసా వసూల్’ డీల్
Amazon Paisa Vasool : అమెజాన్ ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు బంపర్ ఆఫర్లతో ముందుకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు, 'పైసా వసూల్' అనే కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టి, కస్టమర్లను ఆకర్షిస్తోంది.
Published Date - 06:30 PM, Thu - 4 September 25 -
CM Revanth Reddy: తెలంగాణలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదలపై స్పందించిన తీరు, సమయానుసారం చేపట్టిన సహాయక చర్యలను ప్రశంసించారు.
Published Date - 06:15 PM, Thu - 4 September 25 -
Military Equipment: కేంద్రం కీలక నిర్ణయం.. ఆయుధాలు, సైనిక విమానాలపై జీఎస్టీ రద్దు!
సాఫ్ట్‌వేర్‌తో నడిచే రేడియో కమ్యూనికేషన్ పరికరాలపై గతంలో 18-28 శాతం జీఎస్టీ ఉండేది. ఇప్పుడు దానిని కేవలం 5 శాతానికి తగ్గించారు. అలాగే వాకీ-టాకీ ట్యాంకులు, ఆర్మర్డ్ వెహికిల్స్‌పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
Published Date - 05:55 PM, Thu - 4 September 25 -
Chandra Grahanam: చంద్రగ్రహణం రోజు సత్యనారాయణ వ్రతం చేయొచ్చా?
సెప్టెంబర్ 7 రాత్రి పౌర్ణమి, సెప్టెంబర్ 8 నుండి పితృ పక్షం ప్రారంభమవుతుంది. ఈ కలయిక చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే పౌర్ణమి నాడు విష్ణువు పూజ, సత్యనారాయణ కథ చేయడం వల్ల పితృదేవతలు కూడా సంతృప్తి చెందుతారు.
Published Date - 05:20 PM, Thu - 4 September 25 -
GST Reforms: జీఎస్టీ 2.0.. ఏ వాహనాలు చౌకగా మారనున్నాయి?
ప్రభుత్వం 350 సీసీ వరకు ఉన్న బైక్‌లు, స్కూటర్లపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించింది. ఈ విభాగంలో దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ పల్సర్, టీవీఎస్ అపాచీ, కేటీఎం డ్యూక్ వంటి బైక్‌లు ఉన్నాయి.
Published Date - 04:50 PM, Thu - 4 September 25 -
Gold Rates : జీఎస్టీ రేట్ల సవరణతో బంగారం ప్రియులకు శుభవార్త..ఎంతవరకు తగ్గే చాన్స్ అంటే?
Gold Rates : బంగారంపై వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) రేట్లలో కేంద్రం సవరణలు చేయడంతో బంగారం ధరలు తగ్గుతాయని టాక్ వినిపిస్తోంది.
Published Date - 04:37 PM, Thu - 4 September 25 -
Nirmala Sitharaman : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ
Nirmala Sitharaman : పంట పొలాలు దెబ్బతిన్నాయి. రోడ్లు, ఇతర మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. ఈ నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి ఒక నివేదిక కూడా సమర్పించారు
Published Date - 04:28 PM, Thu - 4 September 25 -
Shashi Tharoor : సుంకాల యుద్ధం ఆపండి.. ట్రంప్‌కు శశిథరూర్ హెచ్చరిక
ఇప్పుడు అదే పరిస్థితి భారత్ విషయంలో తలెత్తకుండా చూసుకోవాలి. భారత్‌ను దూరం చేయడం అమెరికాకు భవిష్యత్తులో చేటు చేస్తుంది అని థరూర్ హెచ్చరించారు. అమెరికా ఇటీవల భారత్ దిగుమతులపై సుమారు 50 శాతం వరకు భారీ సుంకాలు విధించింది.
Published Date - 04:26 PM, Thu - 4 September 25 -
GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్.. ఎందుకంటే?
జీఎస్టీ తగ్గుదల వల్ల బ్యూటీ ఉత్పత్తులు, కాస్మెటిక్స్ కోసం డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ట్యాక్స్ తగ్గడంతో సెలూన్లకు వెళ్లడం, హెల్త్ సర్వీస్‌లను పొందడం ప్రజలకు మరింత చౌకగా ఉంటుంది.
Published Date - 04:25 PM, Thu - 4 September 25 -
BCCI Sponsorship: స్పాన్సర్షిప్ బేస్ ధరను పెంచిన బీసీసీఐ..!
సెప్టెంబర్ 2న భారత జట్టు లీడ్ స్పాన్సర్ హక్కుల కోసం బీసీసీఐ ఆసక్తి వ్యక్తీకరణ (EOI)ను జారీ చేసింది. దీని ప్రకారం.. గేమింగ్, బెట్టింగ్, క్రిప్టో, పొగాకు కంపెనీలు బిడ్డింగ్‌లో పాల్గొనలేవు.
Published Date - 04:09 PM, Thu - 4 September 25 -
Delhi Flood Situation : ఢిల్లీని ముంచెత్తిన వరదలు
Delhi Flood Situation : ప్రభుత్వం, సహాయక బృందాలు వరద బాధితులను ఆదుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు
Published Date - 03:58 PM, Thu - 4 September 25 -
Red Color Radish : ఆరోగ్య రహస్యాల పూట..ఎరుపు ముల్లంగి ఆరోగ్యానికి ఎనలేని మేలు చేస్తుందని మీకు తెలుసా?
ఇదే అంశం ఎరుపు ముల్లంగికి కూడా వర్తిస్తుంది. ఇందులో ఆంథోసయనిన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ ముప్పు నుండి రక్షిస్తాయి. ఇది కేవలం చర్మానికి కాంతినే కాదు, ఆరోగ్యకరమైన హృదయాన్ని, క్యాన్సర్‌లాంటి తీవ్రమైన వ్యాధుల నుండి రక్షణను కూడా ఇస్తుంది.
Published Date - 03:54 PM, Thu - 4 September 25 -
Ganesh Immersion : హుస్సేన్‌సాగర్ వద్ద కోలాహలం
Ganesh Immersion : హుస్సేన్‌సాగర్ వద్ద నిమజ్జనాల కోసం 20 క్రేన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు
Published Date - 03:53 PM, Thu - 4 September 25 -
Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త కారుపై జీఎస్టీ ఎత్తివేత.. ఎందుకంటే?
ఈ కార్ ధర సుమారు రూ.3.66 కోట్లు కాగా, అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసే కారుపై సాధారణంగా విధించే 28 శాతం ఐజీఎస్టీతో పాటు, కస్టమ్స్ సుంకాలు మరియు కాంపెన్సేషన్ సెస్సును తొలగించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై పెనుభారం తప్పింది.
Published Date - 03:16 PM, Thu - 4 September 25 -
Ganesh : రాయదుర్గంలో భారీ ధర పలికిన గణేశ్ లడ్డూ
ఇటీవల రాయదుర్గంలోని మైహోమ్ భుజా అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమానికి ముందు, అక్కడి గణేశుడికి సమర్పించిన ప్రసాద లడ్డూ ఏకంగా రూ. 51,77,777కు వేలం పాటలో అమ్ముడైంది. ఈ విపరీతమైన ధరతో రాయదుర్గం లడ్డూ ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
Published Date - 02:52 PM, Thu - 4 September 25 -
AP Cabinet : యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం..ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య సేవలు
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా అందించే దిశగా ప్రభుత్వం దీన్ని అమలు చేయనుంది. ఈ కొత్త ఆరోగ్య విధానాన్ని ఆయుష్మాన్ భారత్–ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ఆధారంగా రూపొందించారు. తాజా నిర్ణయం ప్రకారం, ప్రతి కుటుంబానికి ఏడాదికి ₹25 లక్షల వరకు ఉచిత వైద్యచికిత్సలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
Published Date - 02:40 PM, Thu - 4 September 25 -
Viral Video : పాఠశాలలో టీచర్ నిర్వాకం..మద్యం మత్తులో క్లాస్ రూంలోనే నిద్ర
సుకుత్పల్లి గ్రామంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో (AHS) SGTగా పనిచేస్తున్న జే. విలాస్ అనే ఉపాధ్యాయుడు ఇటీవల మద్యం సేవించి పాఠశాలకు హాజరైనట్లు తెలుస్తోంది. క్లాస్ గదిలో విద్యార్థుల మధ్యలోనే నిద్రలోకి జారుకున్న ఆయన ప్రవర్తన విద్యార్థుల మనోభావాలను కించపరచడమే కాకుండా, ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చేలా మారింది.
Published Date - 02:10 PM, Thu - 4 September 25 -
Vijayawada : విజయవాడ, బెంగళూరు విమానానికి తప్పిన పెను ప్రమాదం
విమానంలో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం రన్‌వేపై నుంచి గాల్లోకి లేవగానే ఒక్కసారిగా ఓ పెద్ద పక్షి విమాన రెక్కను బలంగా ఢీకొంది. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో విమానంలో సుదీర్ఘ శబ్దం వినిపించడంతో ప్రయాణికులందరూ ఉలిక్కిపడ్డారు.
Published Date - 01:53 PM, Thu - 4 September 25 -
Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !
పండుగలు ఎలా జరుపుకోవాలో చెప్పడానికి మీరెవరు? అంటూ పోలీస్ కమిషనర్, డీజీపీని ఆయన కఠినంగా ప్రశ్నించారు.
Published Date - 01:09 PM, Thu - 4 September 25 -
Flood : ఢిల్లీలో వరద విలయం.. డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తున్న యమున
మయూర్ విహార్ ఫేజ్-1 ప్రాంతం పూర్తిగా జలమయంగా మారిపోయింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం 7 గంటల సమయంలో పాత రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో యమునా నది నీటిమట్టం 207.48 మీటర్లకు చేరింది.
Published Date - 12:58 PM, Thu - 4 September 25 -
Nandamuri Balakrishna : ఈ విజయాలన్నీ నా తల్లిదండ్రులకు.. అంకితం చేస్తున్నా
Nandamuri Balakrishna : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ప్రత్యేక సందడి చేశారు. తాజాగా సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకుని, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న అనంతరం తొలిసారి ఆయన గ్రామానికి చేరుకోవడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది.
Published Date - 12:46 PM, Thu - 4 September 25 -
Shikhar Dhawan : బెట్టింగ్ యాప్స్ కేసు.. ఈడీ విచారణకు శిఖర్ ధావన్ !
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ విచారణ కోసం ఈడీ ఎదుట హాజరైనట్లు విశ్వసనీయ సమాచారం. తాజా సమాచారం ప్రకారం, ధావన్‌కు పీఎంఎల్ఏ (Prevention of Money Laundering Act) చట్టం కింద విచారణ నోటీసులు జారీ చేయబడటంతో ఆయన ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు.
Published Date - 12:38 PM, Thu - 4 September 25 -
Kannappa : ఓటీటీలోకి వచ్చిన మంచు విష్ణు ‘కన్నప్ప’..
Kannappa : నటుడు మంచు విష్ణు చాలా కాలంగా తన హృదయానికి దగ్గరైన ఒక కలల ప్రాజెక్ట్‌పై పనిచేశారు. అదే ‘కన్నప్ప’. భక్తిరసంతో కూడిన ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించి, భారీ తారాగణంతో పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేశారు.
Published Date - 12:23 PM, Thu - 4 September 25 -
Chidambaram : ఎనిమిదేళ్ల ఆలస్యం ఎందుకు? ..కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గింపు పై చిదంబరం స్పందన..
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం సరికొత్త మార్గాన్ని చూపిస్తున్నప్పటికీ, దీని అవసరం 2017లోనే ఉన్నది. అప్పటినుంచి జీఎస్టీ డిజైన్, రేట్లు ప్రజా ప్రయోజనానికి విరుద్ధంగా ఉన్నాయని మేము అనేకసార్లు హెచ్చరించాం.
Published Date - 12:22 PM, Thu - 4 September 25 -
Northern Turkey : జలప్రవేశం చేసిన కొన్ని నిమిషాల్లోనే మునిగిన లగ్జరీ నౌక: తుర్కియేలో ఉద్రిక్తత
ఈ లగ్జరీ నౌక నిర్మాణానికి అక్షరాలా 1 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.8.74 కోట్లకు పైగా వ్యయం చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో ముస్తాబైన ఈ నౌకను ప్రారంభించేందుకు యజమాని అతని బంధుమిత్రులతో కలిసి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాడు.
Published Date - 12:05 PM, Thu - 4 September 25 -
CM Chandrababu : నేడు ఏపీ కేబినెట్ భేటీ .. చర్చించే కీలక అంశాలు ఇవే..!
ఈ రోజు కేబినెట్లో మొత్తం రూ.53,922 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలపబోతున్నట్లు సమాచారం. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో సుమారు 83,437 మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Published Date - 11:35 AM, Thu - 4 September 25 -
Vladimir Putin: అమెరికా సుంకాలపై పుతిన్ ఆగ్రహం
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా వాణిజ్య విధానాలపై ఘాటైన విమర్శలు చేశారు. భారత్, చైనా వంటి వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలను అమెరికా భారీ సుంకాల రూపంలో ఆర్థిక ఒత్తిడికి గురి చేయాలని ప్రయత్నించడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు.
Published Date - 11:34 AM, Thu - 4 September 25 -
Health Insurance : ఏపీ, తెలంగాణలో బెస్ట్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్స్ ఇవే..!
Health Insurance : ఈ రోజుల్లో ఆరోగ్య బీమా ఒక అవసరం మాత్రమే కాదు, తప్పనిసరి కూడా అయింది. వైద్య ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నివసించే కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ మరింత అవసరం అవుతోంది.
Published Date - 11:28 AM, Thu - 4 September 25 -
Stock Market : జీఎస్టీ ఊరటతో స్టాక్ మార్కెట్‌కు బూస్ట్..
Stock Market : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక రంగానికే కాకుండా స్టాక్ మార్కెట్లకు కూడా కొత్త ఊపుని ఇచ్చాయి. సామాన్యుడి జీవితంలో ఉపశమనం కలిగించేలా పన్ను శ్లాబ్‌లను సవరించడంపై తీసుకున్న ఈ నిర్ణయం గురువారం మార్కెట్లలో స్పష్టంగా ప్రతిబింబించింది.
Published Date - 11:02 AM, Thu - 4 September 25 -
GST Rates: జీఎస్టీ 2.0.. ఏయే వస్తువులు తక్కువ ధరకు లభిస్తాయి?
లక్ట్రానిక్ రంగం విషయానికొస్తే ఇప్పుడు ఎయిర్ కండిషనర్లు 32 అంగుళాల కంటే ఎక్కువ ఉన్న LED-LCD, మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషర్లను కొనుగోలు చేయడానికి 18 శాతం GST చెల్లించాలి.
Published Date - 11:00 AM, Thu - 4 September 25 -
Ration: రేపు తెలంగాణలో రేషన్ డీలర్ల బంద్..రేషన్ పంపిణీ అస్తవ్యస్తం కానుందా..?!
రాష్ట్రవ్యాప్తంగా కార్యకలాపాలను నిలిపివేసేలా రేషన్ డీలర్లు ఒకరోజు బంద్‌కు పిలుపునివ్వడం గమనార్హం. ఈ బంద్‌ను తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నిర్వహిస్తోంది. బంద్ కారణంగా లక్షలాది మంది లబ్దిదారులు రేపు రేషన్ సరుకులు పొందలేని పరిస్థితి ఏర్పడనుంది.
Published Date - 10:52 AM, Thu - 4 September 25 -
Pawan Kalyan : జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇలా..!
Pawan Kalyan : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పన్ను భారాన్ని తగ్గించే దిశగా తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వకంగా స్వాగతించారు.
Published Date - 10:31 AM, Thu - 4 September 25 -
BCCI President: బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ఉన్నది వీరేనా?
సెప్టెంబర్‌లో జరిగే ఏజీఎంలో కొన్ని పదవులకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఎన్నికలు బీసీసీఐ సొంత నియమాల ప్రకారం జరుగుతాయి.
Published Date - 10:30 AM, Thu - 4 September 25 -
AP : ఏపీలో 3 నెలల ముందే స్థానిక ఎన్నికలు..సన్నాహకాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం!
చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం, ఐదేళ్ల పదవీకాలం ముగిసే ముందు మూడునెలలకే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు లేఖలు పంపారు.
Published Date - 10:16 AM, Thu - 4 September 25 -
Bigg Boss: బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్ల జాబితా లీక్.? సోషల్ మీడియాలో చర్చ హీట్..!
Biggboss: తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ సీజన్ 9 ముస్తాబైంది. ఇకమరి మూడు రోజుల్లో, ఈనెల 7న గ్రాండ్‌గా కొత్త సీజన్ ప్రారంభం కానుంది.
Published Date - 10:00 AM, Thu - 4 September 25 -
GST 2.0: 40 శాతం జీఎస్టీతో భారమేనా? సిగరెట్ ప్రియుల జేబుకు చిల్లు తప్పదా?
GST వ్యవస్థ అమలులోకి వచ్చినప్పుడు రాష్ట్రాల ఆదాయానికి నష్టం వాటిల్లుతుంది. ఆ నష్టాన్ని పూరించడానికి 2017లో దీన్ని ప్రారంభించారు. మొదట దీన్ని 2022 వరకు మాత్రమే అమలు చేయాలని యోచించారు.
Published Date - 09:57 AM, Thu - 4 September 25 -
GST 2.0 : రైతులకు కేంద్రం శుభవార్త
GST 2.0 : రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు
Published Date - 09:30 AM, Thu - 4 September 25 -
GST 2.0 : మిడ్ రేంజ్ కార్ల ధరలకు రెక్కలు
GST 2.0 : ఈ నియమం స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (SUV), మల్టీ యుటిలిటీ వెహికల్స్ (MUV), మల్టీ పర్పస్ వెహికల్స్ (MPV) మరియు క్రాస్ ఓవర్ యుటిలిటీ వెహికల్స్ (XUV) వంటి అన్ని మోడళ్లకు వర్తిస్తుంది
Published Date - 09:00 AM, Thu - 4 September 25 -
GST 2.0 – Nirmala Sitharaman : లగ్జరీ వస్తువులపై 40 శాతం పన్ను
GST 2.0 - Nirmala Sitharaman : సామాన్యులకు ఉపశమనం కల్పించేలా నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తగ్గించినప్పటికీ, కొన్ని నిర్దిష్ట వస్తువులపై పన్నును భారీగా పెంచనున్నారు
Published Date - 08:30 AM, Thu - 4 September 25 -
GST 2.0 : సామాన్యులకు భారీ ఊరట.. 18% జీఎస్టీలోకి వచ్చేవి ఇవే..!!
GST 2.0 : 'GST 2.0' పేరుతో ప్రకటించిన ఈ మార్పులలో, టీవీలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం ఒక ప్రధాన నిర్ణయం. ఈ నిర్ణయం ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే టెలివిజన్లు, ఏసీలు వంటివి నేడు విలాస వస్తువులు కాకుండా నిత్యావసరాలుగా మారాయి
Published Date - 08:00 AM, Thu - 4 September 25 -
GST 2.0 : ధరలు తగ్గే వస్తువులివే..!!
GST 2.0 : సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్‌లు, టాయిలెట్ సోప్, షేవింగ్ క్రీమ్, హెయిర్ ఆయిల్, సైకిళ్లు
Published Date - 07:27 AM, Thu - 4 September 25 -
AI Steth : గుండె జబ్బులను కనిపెట్టే కొత్త ఏఐ స్టెత్.. కేవలం సెకన్లలోనే ఖచ్చితమైన ఫలితాలు!
AI Steth :ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. వైద్య రంగంలో కూడా దీని ప్రభావం చాలా ఉంది. ముఖ్యంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది వైద్య పరిశోధనలో కొత్త మార్పులు తీసుకొస్తోంది.
Published Date - 05:00 AM, Thu - 4 September 25 -
GST Council : సంచలన నిర్ణయం.. వాటిపై జీఎస్టీ రద్దు
GST Council : పండగ సీజన్ దగ్గరపడుతున్న వేళ, దేశ ప్రజలకు నిజంగా బంపర్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా జీఎస్టీ కౌన్సిల్ భారీ నిర్ణయాలు తీసుకుంది.
Published Date - 11:27 PM, Wed - 3 September 25 -
Realme P4 vs Pro : రియల్ మీ నుంచి రెండు బ్రాండ్ న్యూ ఫోన్స్.. అదిరిపోయే ఫీచర్స్ వీటి సొంతం
Realme P4 vs Pro : రియల్ మీ..యువతను లక్ష్యంగా చేసుకొని నాణ్యత గల ఫీచర్లను అందుబాటు ధరలలో అందిస్తోంది. రియల్ మీ ఫోన్లు వాటి స్టైలిష్ డిజైన్,
Published Date - 09:38 PM, Wed - 3 September 25 -
Sleep: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి!
పడుకునే ముందు యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ఇది మనసును శాంతపరిచి ఒత్తిడిని తగ్గిస్తుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం కూడా మంచి నిద్రకు సహాయపడుతుంది.
Published Date - 09:30 PM, Wed - 3 September 25 -
SIP : సిప్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి షాకింగ్..మీ డబ్బు సేఫేనా?
SIP : మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా? ఇది చాలా మందికి ఉన్న ప్రశ్న.స్టాక్ మార్కెట్‌తో దీనికి సంబంధం ఉన్నప్పటికీ, అది నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టినంత ప్రమాదకరం కాదు.
Published Date - 09:00 PM, Wed - 3 September 25 -
Cricketers Retired: 2025లో ఇప్పటివరకు 19 మంది స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్!
ఈ సంవత్సరంలో ODI ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న ముగ్గురు క్రికెటర్లు ఆస్ట్రేలియాకు చెందినవారు. స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్ ODI క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు.
Published Date - 08:50 PM, Wed - 3 September 25 -
Sugar Control : మెడిసిన్ వాడుతున్న షుగర్ కంట్రోల్ అవ్వడం లేదా? ఈ ఆకును ఒక నెల తింటే చాలు!
Sugar control : భారతీయ సంస్కృతిలో, తమలపాకు (Betel leaf) కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది కేవలం శుభకార్యాల్లోనే కాకుండా, ఆయుర్వేద వైద్యంలో కూడా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
Published Date - 08:33 PM, Wed - 3 September 25 -
Kavitha : కవిత నువ్వు ప్రజాశాంతి పార్టీలోకి రా – KA పాల్
Kavitha : కవిత బీసీల కోసం పోరాడాలన్నా, ప్రజల్లో ఆమెపై నమ్మకం పెరగాలన్నా ప్రజాశాంతి పార్టీలో చేరడం ఉత్తమమని సలహా ఇచ్చారు. గతంలో గద్దర్ లాంటి ప్రజా గాయకుడు కూడా తమ పార్టీలో చేరారని గుర్తు చేశారు
Published Date - 08:30 PM, Wed - 3 September 25 -
Parivartini Ekadashi 2025: రేపే పరివర్తిని ఏకాదశి వ్రత పారన.. మనం ఏం చేయాలంటే?
సూర్యోదయం ముందు ఏకాదశి వ్రత పారనకు ఎటువంటి నియమాలు, పద్ధతులు లేవు. అయితే ద్వాదశి తిథి ముగిసేలోపు దీనిని పారన చేయాలి. అంతేకాకుండా మీరు ద్వాదశి నాడు అన్నం తిని పారన చేయాలి.
Published Date - 08:20 PM, Wed - 3 September 25 -
Revanth Counter : మీ పంపకాల పంచాయతీలో మమ్మల్ని లాగకండి – కవిత కు రేవంత్ కౌంటర్
Revanth Counter : బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలను ఉద్దేశించి మాట్లాడుతూ.."మీ పంపకాల పంచాయతీలో మమ్మల్ని లాగకండి" అని రేవంత్ రెడ్డి అన్నారు
Published Date - 07:51 PM, Wed - 3 September 25 -
Putin- Kim Jong: పుతిన్‌తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ.. ఆసక్తికర వీడియో వెలుగులోకి!
మరోవైపు చైనా నిఘా నుంచి తప్పించుకోవడానికి కిమ్ ఈ చర్యలు తీసుకున్నారని కూడా భావిస్తున్నారు. కిమ్‌కు సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ మిగలకుండా ఉండేందుకు ఈ ప్రయత్నాలు చేశారని నివేదికలు చెబుతున్నాయి.
Published Date - 07:45 PM, Wed - 3 September 25 -
Yamuna River Levels: ఢిల్లీలో హై అలర్ట్.. 207 మీటర్ల మార్కు దాటిన యమునా నది నీటిమట్టం!
యమునా నదిలో పెరిగిన నీటిమట్టంతో వరద నీరు ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలకు చేరింది. ఢిల్లీలోని పురాతన శ్మశాన వాటిక అయిన నిగంబోధ్ ఘాట్‌లోకి కూడా వరద నీరు ప్రవేశించింది.
Published Date - 07:14 PM, Wed - 3 September 25 -
AI Training For Journalists: తెలంగాణలో జర్నలిస్టులకు తొలి ఏఐ శిక్షణ!
చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, నోట్‌బుక్ ఎల్ఎం, గూగుల్ జెమినీ, మిడ్ జర్నీ, సోరా, వీఈఓ3 వంటి ఏఐ టూల్స్‌ను ఎలా ఉపయోగించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
Published Date - 06:47 PM, Wed - 3 September 25 -
Hema Malini: బాలీవుడ్ నటి గ్యారేజీలో కొత్త లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
ఎంజి సంస్థ ఈ కారుకు ప్రత్యేక వారంటీని అందిస్తోంది. మొదటి యజమానికి హై-వోల్టేజ్ బ్యాటరీపై లైఫ్‌టైమ్ వారంటీ లభిస్తుంది. అలాగే మొత్తం కారుపై 3 సంవత్సరాలు/అపరిమిత కిలోమీటర్ల వారంటీ కూడా లభిస్తుంది.
Published Date - 06:39 PM, Wed - 3 September 25 -
Job Market: భారతదేశంలో ఈ ఉద్యోగాలకు భారీగా డిమాండ్!
బీమా రంగంలో ఉద్యోగ నియామకాలు ఏకంగా 24% పెరిగాయి. కోల్‌కతాలో 36%, ఢిల్లీ-ఎన్సీఆర్లో 30% వృద్ధి నమోదైంది. ఈ రంగంలో మధ్యస్థ స్థాయి నిపుణులకు (4-7 సంవత్సరాల అనుభవం) 34% అధిక డిమాండ్ కనిపించింది.
Published Date - 05:15 PM, Wed - 3 September 25 -
GST Council : పండుగల సీజన్లో వినియోగదారులకు గిఫ్ట్.?
GST Council : దేశవ్యాప్తంగా పండగ వాతావరణం దగ్గరపడుతున్న ఈ సమయంలో, వినియోగదారులు, వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
Published Date - 04:59 PM, Wed - 3 September 25 -
Hyderabad : గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు..29 వేల మంది సిబ్బంది మోహరింపు
ఈ భారీ కార్యాచరణలో భాగంగా సుమారు 29 వేల మంది పోలీసు సిబ్బందిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గడిచిన నెల రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లు సాగుతున్నాయని సీపీ వివరించారు.
Published Date - 04:39 PM, Wed - 3 September 25 -
Minister Seethakka: సకల సౌకర్యాలతో మహా మేడారం జాతర: మంత్రి సీతక్క
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూజారుల అభిప్రాయం మేరకు ఆధునికీకరణ పనులు చేపట్టాలని సూచించారు.
Published Date - 04:30 PM, Wed - 3 September 25 -
Tomatoes : టమాటాలు రోజూ తింటే ఆరోగ్యానికి మంచిదేనా?..మరి రోజుకు ఎన్నితినాలి..?
టమాటాల్లో పొటాషియం, విటమిన్ C, విటమిన్ K వంటి ముఖ్యమైన పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. పొటాషియం బీపీని నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. లైకోపీన్ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కలిసి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
Published Date - 04:26 PM, Wed - 3 September 25 -
Raghunandan Rao : రేవంత్-హరీశ్ కుమ్మక్కు.. బీఆర్ఎస్ అవినీతి పునాదుల మీద నిలిచింది
Raghunandan Rao : తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
Published Date - 03:59 PM, Wed - 3 September 25 -
Fitness Test: కేఎల్ రాహుల్ సహా కొంతమంది ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై సస్పెన్స్?!
విరాట్ కోహ్లీ తన ఫిట్నెస్ టెస్ట్‌ను ఇంగ్లాండ్‌లో పూర్తి చేసుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. కోహ్లీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉన్నారు.
Published Date - 03:55 PM, Wed - 3 September 25 -
Malla Reddy : కేసీఆర్‌కు కుటుంబం కన్నా పార్టీ మిన్న.. కవిత సస్పెన్షన్‌పై మల్లారెడ్డి స్పందన
కుటుంబ బంధాలను పక్కన పెట్టి పార్టీ పట్ల విధేయత చూపడమే నిజమైన నాయకత్వ లక్షణమని, ఈ చర్యతో అది మరింత స్పష్టమైందని మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు.
Published Date - 03:50 PM, Wed - 3 September 25 -
Controversial Comments : హరీష్ వివాదస్పద వ్యాఖ్యలు.. జిల్లా ఎస్పీ కాంగ్రెస్ నేతల పెంపుడు కుక్కలా అంటూ..
Controversial Comments : కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే బీ.పి. హరీష్ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి హాట్‌టాపిక్ అయ్యారు. దావణగెరె జిల్లా ఎస్పీ ఉమా ప్రసాంత్‌ను కాంగ్రెస్ నేతల పెంపుడు కుక్కలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించడంతో పెద్ద దుమారం రేగింది.
Published Date - 03:30 PM, Wed - 3 September 25 -
Revanth Reddy : నేను ఎవరి వెనుకా లేను..మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి
కవిత చెబుతున్నట్టు నేను ఆమె వెనుక ఉన్నానంటారు. ఇంకొందరు హరీశ్ రావు, సంతోష్ వెనుక ఉన్నానంటున్నారు. ఈ రాజకీయ పంచాయితీలు ప్రజలకు అవసరం లేదు. నన్ను మీ కుటుంబ, కుల రాజకీయాల్లోకి లాగొద్దు అని రేవంత్ స్పష్టంగా అన్నారు.
Published Date - 03:26 PM, Wed - 3 September 25 -
AP : మద్యం కేసు..వైసీపీ నేతల ఇళ్లలో సిట్ సోదాలు ముమ్మరం
చిత్తూరు జిల్లాలోని బీవీరెడ్డి కాలనీ మరియు నలందా నగర్ ప్రాంతంలో ఉన్న నిఖిలానంద అపార్ట్మెంట్లో అధికారులు ఆకస్మికంగా సోదాలు చేశారు. ఇదే అపార్ట్మెంట్లో విజయానందరెడ్డి నివాసముండటంతో అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు.
Published Date - 03:10 PM, Wed - 3 September 25