HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >7 Tips To Curb Insomnia For Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

  • Author : Vamsi Chowdary Korata Date : 06-07-2026 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
7 Tips to Curb Insomnia for Stress Management
7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. రాత్రి తగినంత నిద్ర లేకపోవడం అనేది శారీరకంగా, మానసికంగా మీ శరీరానికి అలసట కలిగిస్తుంది. శరీరం సక్రమంగా పని చేయాలంటే, మెదడు యాక్టివ్‌గా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఇంతకంటే తక్కువగా నిద్రపోతే మీ గుండె, కిడ్నీలు మరియు మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒత్తిడి తగ్గిపోయి మీకు హాయిగా నిద్రపట్టేలా చేసే 7 లైఫ్‌స్టైల్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని పాటిస్తే మీ నిద్రకు భంగం కలగదు, ఒత్తిడి కూడా పటాపంచలు అయిపోతుంది.

ఆహారపు అలవాట్లు:

నిద్రపోవడానికి ముందు అరటిపండు, గుమ్మడి గింజలు, బాదం, అక్రోట్, పిస్తా, జీడిపప్పు లేదా చామంతి హెర్బల్ టీ తాగితే మంచిది. ఇవి మీకు మంచి నిద్రను ఇస్తాయి. మెలటోనిన్ మరియు ఇతర ఖనిజాలు (minerals) కలిగిన ఆహార పదార్థాలు తింటే నిద్రలేమి సమస్య తొలగిపోతుందని ఒక ప్రయోగంలో నిరూపితమైంది. ప్రత్యేకించి వృద్ధులలో నిద్ర నాణ్యతను పెంచేందుకు ఇవి సహాయపడతాయి.

డిన్నర్ టైమ్:

నిద్రవేళకు, రాత్రి భోజనానికి మధ్య కనీసం 3 గంటల సమయం (gap) ఉండేలా చూసుకోవాలి.

వ్యాయామం చేయడం:

వారానికి కనీసం 4 రోజులు వ్యాయామం చేయండి.

హైడ్రేటెడ్ గా ఉండండి:

నీరు, ఫ్రూట్ జ్యూస్‌లు బాగా తాగండి. దీనివల్ల హైడ్రేటెడ్ గా ఉంటారు. ఇది మీ మానసిక స్థితిని కూడా యాక్టివ్‌గా చేస్తుంది మరియు అలసట దరిచేరకుండా చేస్తుంది.

సన్నిహితులతో చిట్ చాట్:

మీరు ఒత్తిడిగా ఫీల్ అయితే మీ సన్నిహిత మిత్రులు లేదా కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడండి. మీతో ఎమోషనల్ అటాచ్‌మెంట్ కలిగిన వారితో మీ అభిప్రాయాలను (opinions) పంచుకోండి. వారు ఇచ్చే సలహాలు పాజిటివ్ ఆటిట్యూడ్‌తో ఉంటే వాటిని స్వీకరించండి.

విటమిన్ లెవల్స్ తనిఖీ చేయండి:

మీ శరీరంలోని విటమిన్ D, విటమిన్ B12 స్థాయిలను చెక్ చేసుకోండి. ఇవి కూడా శరీరానికి చాలా అవసరం. ఇవి లేకపోవడం వల్ల కూడా మీ నిద్రకు ఆటంకం కలుగుతుంది.

ఉదయం సూర్యకాంతి:

ఉదయం వేళ సూర్యకాంతిలో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉండండి. సూర్యకాంతి అనేది విటమిన్ D యొక్క సహజ మూలం.

స్క్రీన్ టైమ్:

రాత్రి నిద్రపోయే చివరి నిమిషం దాకా చాలామంది ఫోన్‌లోనే గడుపుతారు. ఇది మంచిది కాదు. నిద్రపోవడానికి కనీసం గంట ముందు మీరు ఫోన్ చూడటం ఆపేయండి.

కెఫిన్ పానీయాలు:

నిద్రపోయే సమయానికి ముందు కాఫీ, టీ తాగకూడదు. దీనివల్ల బెడ్‌పై పడుకోగానే వెంటనే నిద్రపట్టదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • coping strategies
  • Good Health Tips
  • health care
  • insomnia
  • Life Style
  • Mental Health
  • Office Stress Management
  • relaxation techniques
  • sleep hygiene
  • stress management
  • tips
  • Tricks

Related News

Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

ఇటీవలి కాలంలో చాలా మంది పురుషులు స్పెర్మ్ లోపం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా మగ వంధ్యత్వం, సంతానం లేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. మారిన జీవనశైలి, ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా పురుషులలో స్పెర్మ్ లోపం సమస్య కనిపిస్తుంది. దీని వల్ల జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజం. కానీ పురుషుల్లో వచ్చే ఈ స్పెర్మ్ లోపానికి హోమ్ రెమెడీస్‌తో పరిష్కారం దొరుకుతుందని వైద్యులు చెబుత

  • If belly fat is increasing, it means this hormone is high!

    Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

  • Struggling with work stress? Here’s how to relax!

    Work Stress: పని ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఇలా రిలాక్స్ అవ్వండి!

  • Do you have a habit of drinking alcohol? If so, be careful with its consumption...!!

    Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

Latest News

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

  • Heavy Rains: మహారాష్ట్రలో భారీ వర్షాలు

  • Malla Reddy: బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి గుడ్ బై

  • Mahindra: భారతదేశ ఇంధన పరివర్తనకు E20-అనుకూల పెట్రోల్ వాహనాలు సిద్ధంగా ఉన్నాయని మహీంద్రా పేర్కొంది.

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd