HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cobra Hatchlings At The Police Station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

  • Author : Vamsi Chowdary Korata Date : 11-07-2026 - 2:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cobra hatchlings at the police station
Cobra hatchlings at the police station

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రాంగణంలో ఫిర్యాదుదారులు కూర్చుని వేచి ఉండే అత్యంత కీలకమైన ప్రాంతంలోకి మూడు ప్రమాదకరమైన నాగుపాము పిల్లలు అకస్మాత్తుగా రావడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసు సిబ్బంది, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు నిత్యం వందలాది మంది బాధితులు వివిధ సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు వస్తుంటారు. ఎప్పటిలాగే బాధితులు స్టేషన్ ఆవరణలోని వెయిటింగ్ ఏరియాలో కూర్చుని ఉండగా.. పక్కనే ఉన్న ఖాళీ స్థలం నుంచి మూడు నాగుపాము పిల్లలు జరజరా పాకుకుంటూ లోపలికి వచ్చాయి. ఫిర్యాదుదారులు కూర్చునే కుర్చీల కిందకు అవి వెళ్లడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా కేకలు వేస్తూ.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరిగెత్తారు.

సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు తక్షణమే స్పందించారు. అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. చాకచక్యంగా ఆ మూడు నాగుపాము పిల్లలను ఒక ప్లాస్టిక్ బకెట్‌లో బంధించి మూత పెట్టారు. అనంతరం నగరంలోని ప్రముఖ జంతు సంరక్షణ సంస్థ ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ’ ప్రతినిధులకు సమాచారం అందించారు. స్టేషన్‌కు చేరుకున్న స్నేక్ క్యాచర్స్ ఆ పాములను సురక్షితంగా స్వాధీనం చేసుకుని, జనావాసాలకు దూరంగా ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. సమయానికి పాములను గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మూడేళ్ల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు అనుబంధంగా ఈ మధురానగర్ పోలీస్ స్టేషన్‌ను ఒక తాత్కాలిక ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎస్‌ఐఐటీకి చెందిన ఒక భారీ ఖాళీ స్థలాన్ని పోలీస్ స్టేషన్ అవసరాల కోసం ప్రస్తుతం వినియోగిస్తున్నారు. వివిధ రకాల క్రైమ్ కేసుల్లో, ప్రమాదాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వందలాది ద్విచక్ర వాహనాలు, కార్లను ఈ ఖాళీ స్థలంలోనే పార్క్ చేస్తున్నారు. అయితే సరైన నిర్వహణ లేకపోవడంతో.. ఆ ఖాళీ స్థలం అంతా పిచ్చి మొక్కలు, దట్టమైన చెట్లు, పొదలతో నిండిపోయి ఒక చిన్నపాటి అడవిని తలపిస్తోంది.

ఈ దట్టమైన పొదలు, పాత వాహనాల నిలువ కారణంగా ఇక్కడ పాములకు సురక్షిత ఆవాసాలు ఏర్పడ్డాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా పలుమార్లు పెద్ద పెద్ద సర్పాలు స్టేషన్ లోపలికి, రైటర్ రూమ్‌ల వైపు వచ్చాయని సిబ్బంది చెబుతున్నారు. దీనికి తోడు పీఎస్ ఆవరణలో వీధికుక్కలు కూడా గుంపులు గుంపులుగా తిరుగుతుండటంతో అర్ధరాత్రి వేళల్లో స్టేషన్‌కు వచ్చే మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పీఎస్ ఆవరణలోని పొదలను తక్షణమే శుభ్రం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Madhura Nagar
  • police station
  • Three Cobra Snakes

Related News

Complaint filed against actor Prakash Raj at the police station.

Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ సమాజాన్ని కించపరిచేలా, కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విష్ణువర్ధన

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

  • FSSAI: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు..

  • Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

  • INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

  • Gold Rate: పసిడి ప్రేమికులకు పండగే.. కుప్పకూలిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd