HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Akhil Akkinenis Lenin Movie Review

Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

  • Author : Vamsi Chowdary Korata Date : 10-07-2026 - 2:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Akhil Akkineni's 'Lenin' Movie Review
Akhil Akkineni's 'Lenin' Movie Review

శ్రీరామపురంలో జరిగే మహాభారతమే ఈ కథ. ఈ ఊరి పెద్దగా జయంతమ్మ (ఈశ్వరీ రావు) వ్యవహరిస్తుంటుంది. ప్రతి ఏటా జరిగే భారతం మిట్టలో ధర్మరాజు ఎవరిని నిలబెట్టాలి, జాతరను ఎవరు జరిపించాలని జయంతమ్మ నిర్ణయిస్తుంటుంది. జయంతమ్మకి సొంత కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు), పెంచుకున్న కొడుకు లెనిన్ (అఖిల్ అక్కినేని). సక్రమమైన సంతానం కాదు అని తన మరిది ఎతిరాజు (శివాజీ)ని ముందు నుంచీ కూడా జయంతమ్మ దూరం పెడుతూనే ఉంటుంది. ఎప్పటికైనా ధర్మరాజు హోదాను దక్కించుకోవాలని ఎతిరాజు అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే రాఘవరెడ్డికి జయంతమ్మ, వసంత్, లెనిన్ అంటే గిట్టదు. జాతరలో తన కటౌట్‌ని తీసి పారేశారని ఎమ్మెల్యే పగతో రగిలిపోతుంటాడు. ఊర్లో అందరికీ సాయం చేసేందుకు ముందుండేవాడు నీలకంఠం (రాంకీ). అతనికి వైదేహీ, భారతి (భాగ్యశ్రీ) ఇద్దరు కూతుళ్లు. భారతి వల్ల ఆ ఊర్లో జరిగిన రక్తపాతం ఏంటి? అసలు లెనిన్ జైలుకి ఎందుకు వెళ్లాడు? ఎతిరాజు తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నాడా? జైలు నుంచి వచ్చిన లెనిన్ ఏం చేశాడు? ఈ కథలో ఎస్సై పార్థసారథి (సునీల్), దామోదరం (బ్రహ్మాజీ), మురళీ (గెటప్ శ్రీను) పాత్రల పాత్ర ఏంటి? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

లెనిన్ కథ కొత్తగా అనిపించకపోవచ్చు. ఎక్కడో చూశామే అన్న ఫీలింగ్ చాలా వరకు కనిపించొచ్చు. చాలా చోట్ల దసరా, రాజా ది గ్రేట్, రంగస్థలం ఛాయలు కూడా కనిపించొచ్చు. కొన్ని ట్విస్టుల్ని ముందే గెస్ చేస్తాం. కొన్ని ట్విస్టుల్ని మాత్రం అస్సలు గెస్ చేయలేం. అక్కడే దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఏంట్రా మరీ ఇంత రొటీన్‌గా సినిమా ఉంది? అని అనుకునే లోపు ఒక కొత్త రంగు బయటపడుతుంది. ఇలా చాలా వరకు మనకు తెలిసినట్టుగా, ఊహించినట్టుగా సాగుతూనే ఉంటుంది. అయినా కూడా డైరెక్టర్ మురళీ మాత్రం చివరకు తన మేకింగ్, టేకింగ్‌తో, కథతో, అందులో పెట్టుకున్న ట్విస్టులతో అందరినీ ఆకట్టుకుంటాడు.

ఫస్ట్ హాఫ్‌లో చాలా వరకు మనం ప్రతి సీన్‌ను ఊహిస్తూ వెళ్తుంటాం. మన ఊహకు తగ్గట్టుగానే ఫ్లాష్ బ్యాక్ సీన్ జరుగుతుంది. ఒక సీన్, ఒక ఫైట్, ఒక సాంగ్ అన్నట్టుగా సాగుతుంది. అయితే ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ వరకు అదిరిపోతుంది. ఇంటర్వెల్‌కి ట్విస్ట్ ఉంటుందని ఆడియెన్స్‌కి అర్థం అవుతుంది. కానీ ఆ ట్విస్ట్ ఏంటి అన్నది దాదాపుగా గెస్ చేయకపోవచ్చు. ఇక ఆ ట్విస్ట్‌తో సెకండాఫ్ మీద మరింత ఇంట్రెస్ట్ కలుగుతుంది. అప్పటికే అయ్యగారు హిట్టు కొట్టేశాడ్రా అని ఫ్యాన్స్ సంబరపడిపోతారు.

సెకండాఫ్ ప్రారంభం మళ్లీ అంతా రొటీన్‌గానే సాగుతోంది ఏంట్రా.. మనం ఊహించిన ట్విస్ట్ ఇంకా రావడం లేదు.. అసలు రంగులు బయట పడటం లేదు అని అనుకుంటాం. ఆ టైంలో ఊహించిన ట్విస్ట్, అసలు రూపం బయటకు వస్తుంది. అలా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అదిరిపోతుంది. ఇక అక్కడ వచ్చే ట్విస్టులు కూడా బాగానే ఉంటాయి. సినిమా పూర్తయ్యే సరికి ఇదంతా పాత కథే కదా.. చాలా చోట్ల చూశాం కదా? అని అనిపించొచ్చు. కానీ పక్కా లెక్కలేసుకుని కొన్ని మాస్ కమర్షియల్ అంశాలను జోడించి మంచి ట్విస్టుల్ని పెట్టుకోవడంతో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక సంతృప్తితోనే వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే చాలా వరకు లాజిక్స్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. చివరకు ఎమ్మెల్యే పాత్ర ఎటుపోతుందో అర్థం కాదు.. ఒక డాక్టర్ అయి ఉండి.. ఆ కెమికల్స్ వల్ల ఏం జరుగుతుందో తెలియకపోవడం.. ఆ విషయం తెలియనట్టుగా ఉండటం ఏంటో అర్థం కాదు. అలా కొన్ని లాజిక్స్‌ను వదిలేస్తే సినిమా మాత్రం అందరినీ ఆకట్టుకునే అవకాశం ఉంది.

నటీనటుల విషయానికి వస్తే.. అఖిల్ చాలా వరకు అదరగొట్టేశాడు. ఎంతో ఇంప్రూవ్ అయ్యాడని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో పరిణితిని కనబర్చాడు. చాలా వరకు అతని యాక్టింగ్ మనసుల్ని హత్తుకుంటుంది. ఇక యాక్షన్ సీక్వెన్స్ అయితే మాస్‌కి ఫీస్ట్‌లానే ఉంటాయి. భాగ్యశ్రీ మాత్రం ఈ సినిమాకి నిజంగానే సోల్. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రమోద్ పంజు పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా చాలా చోట్ల అనిపిస్తుంది. మనోడికి కూడా చాలా ఎలివేషన్స్ పడ్డట్టుగా అనిపిస్తాయి. తన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటాడు. ఇక ఈశ్వరీ రావు, శివాజీ, శత్రు, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ ఇలా చాలా వరకు అన్ని పాత్రలు బాగుంటాయి. ఏ పాత్ర పరిధి మేరకు ఆ యాక్టర్ చక్కగా నటించారు.

లెనిన్‌లో టెక్నికల్ టీం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. లియోన్ విజువల్స్ ఎంతో నేచురల్‌గా అనిపిస్తాయి. ఈ సినిమాకి తమన్ ఒక కనిపించని, వినిపించే హీరో. బీజీ ఎంతో సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టాడు. పాటలు తెరపై ఫీస్ట్‌లా ఉంటాయి. పరువు, పెళ్లి గురించి చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. కాస్ట్యూమ్స్ చాలా వరకు సహజంగానే ఉంటాయి. మరీ 80వ దశకాన్ని గుర్తు చేయకపోయినా.. బాగానే ఉంటాయి. జాతర సెట్ బాగుంటుంది. యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియెన్స్‌కి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అఖిల్ తన సినీ కెరీర్‌లో మునుపెన్నడూ లేనంత రక్తపాతాన్ని తెరపై చూపించాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ గొప్పగా అనిపిస్తాయి.

ఓవరాల్‌గా లెనిన్ రెగ్యులర్, రొటీన్, మాస్ కమర్షియల్ టెంప్లెట్ మూవీగా అనిపించొచ్చు. కానీ అఖిల్ కెరీర్‌లో మాత్రం లెనిన్ చెప్పుకోవదగ్గ, నిలిచిపోయే చిత్రంగా మారే అవకాశం ఉంది. మాస్ ఆడియెన్స్‌కి మాత్రం ‘లెనిన్’ బాగానే ఎక్కేసేలా ఉంది. కావాల్సిన పాటలు, ఫైట్స్, ఎమోషన్స్, ట్విస్టులు ఇలా అన్ని ఉండటంతో ఈ వీకెండ్‌కి మంచి ఆప్షన్‌గా ‘లెనిన్’ను పెట్టుకోవచ్చు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akhil Akkineni
  • Akhil Akkineni Lenin
  • Lenin Movie
  • Movie Review And Rating

Related News

Shivaji on a roll... a string of exciting projects with young directors...

Sivaji: శివాజీ దూకుడు.. యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్..

ఒకప్పుడు టాలీవుడ్‌లో మినిమం గ్యారెంటీ హీరోగా, లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో అలరించిన నటుడు శివాజీ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో సరికొత్త దూకుడు ప్రదర్శిస్తున్నారు. హీరోగా మంచి సక్సెస్ రేట్ అందుకున్న అనంతరం, ఆయన రాజకీయాల (Politics) వైపు అడుగులు వేసి కొన్నేళ్ల పాటు వెండితెరకు పూర్తిగా దూరమయ్యారు. అయితే, బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ ద్వారా ఇచ్చిన గ్రాండ్ రీఎంట్

    Latest News

    • Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!

    • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

    • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

    • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

    • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd