HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Alert For The People Of Ap Heavy Rain Warning For These Districts

Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

  • Author : Vamsi Chowdary Korata Date : 10-07-2026 - 9:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Alert for the people of AP: Heavy rain warning for these districts.
Alert for the people of AP: Heavy rain warning for these districts.

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో ఇవాళ మేఘావృతమైన వాతావరణంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. శనివారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాదు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అంటున్నారు. నైరుతి రుతుపవనాలు గురువారం రోజు దేశమంతటా విస్తరించాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు మినహా పెద్దగా వర్షాలు పడలేదు. రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం బాగా కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వానలు ఊపందుకుంటాయని భావించినా, అవి పెద్దగా ప్రభావం చూపించలేదు. వర్షాల విషయంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే కష్టాలు తప్పవని రైతులు ఆందోళనలో ఉన్నారు. ఖరీఫ్ పంటలపై ప్రభావం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు మాత్రం ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తోంది.

వాస్తవానికి రుతుపవనాలు జులై ఎనిమిది కల్లా దేశమంతా విస్తరించాల్సి ఉండగా, ఒకరోజు ఆలస్యమైందని చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు గత నెల 4న కేరళలోకి ప్రవేశించాయి. ఆ తర్వాత కూడా నిదానంగా విస్తరించాయి. ఇది ఎల్‌నినో ప్రభావమని చెబుతున్నారు. గత నెలలో ఎల్‌నినో కారణంగా దేశవ్యాప్తంగా 40 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతులపై ప్రభావం కనిపించింది. ఖరీఫ్ పంటల సాగుపై రైతన్నలు ఆందోళనలో ఉన్నారు. ఈ నెల 2న బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి. అలాగే ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలను వానలు ముంచెత్తాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో రెండు రోజుల వ్యవధిలో కుంభవృష్టి కురిసింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh rain alert
  • AP Rain Alert
  • Heavy Rain Alert
  • IMD Rain Alert
  • rain alert
  • Rain Alert in Andhra Pradesh
  • rain alert in AP
  • rain alert to andhra pradesh
  • Rain Alert Today

Related News

Rain's impact... roads turned into rivers.

Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

గురువారం ఉదయం ఢిల్లీ మరియు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)పై భారీ వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లు నీట మునిగి, భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, ఈ ప్రాంతంలోని పలు చోట్ల రోజువారీ ప్రయాణాలకు అంతరాయం కలిగింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ మరియు బులంద్‌షహర్ నుండి వచ్చిన వీడియోలు జలమయమైన పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించాయి. నీట మునిగిన వీధుల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతుండగా,

  • Alert for the people of AP: Heavy rain warning for these districts.

    Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

  • Heavy rains in Telangana

    Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

  • Heavy rains in Telangana

    Rain Alert: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

  • Alert for the people of AP: Heavy rain warning for these districts.

    Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. పలు జిల్లాలకు అతి భారీ వర్షాలు

Latest News

  • Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

  • Donald Trump: నన్ను హత్య చేయాలని చూస్తోంది.. ట్రంప్‌ షాకింగ్ కామెంట్స్

  • Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd