Fact Check : ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడా ? జైలులోనే హత్య చేయించారా ?
‘‘మే 10న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(Fact Check) చనిపోయారు’’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
- By Pasha Published Date - 11:19 AM, Mon - 12 May 25

Fact Check : పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ఏమైంది ? ఆయన జైలులోనే చనిపోయారా ? ఎవరైనా జైలులో ఇమ్రాన్‌ను హత్య చేశారా ? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మదిలో ఉదయిస్తున్నాయి. పాకిస్తాన్‌లో కొందరైతే ఇమ్రాన్ ఖాన్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలు నిజం ఏమిటి ? ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్టేనా ? ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Mahesh Babu : ఈరోజు ఈడీ ఎదుటకు మహేష్ బాబు.. ఏమిటీ కేసు?
జరుగుతున్న ప్రచారం ఏమిటి ?
- ‘‘మే 10న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(Fact Check) చనిపోయారు’’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
- ఇమ్రాన్ ఖాన్ గాయపడినట్లుగా, ఆయన్ను స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తరలించే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- ఇమ్రాన్‌ను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ జైలులో హత్య చేయించాడనే ఆరోపణలు వస్తున్నాయి.
- ఇమ్రాన్ ఖాన్ మరణవార్తను ధ్రువీకరిస్తూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ పత్రికా ప్రకటన విడుదల చేసిందని ప్రచారం చేస్తున్నారు. పత్రికా ప్రకటనకు సంబంధించిన పత్రాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
నిజం ఏమిటి?
- పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఈ ప్రచారాన్ని ఖండించింది. ఇమ్రాన్ ఖాన్ చనిపోలేదని, బతికే ఉన్నారని వెల్లడించింది.
- తమ శాఖ లెటర్ హెడ్‌తో వైరల్ అవుతున్న పత్రికా ప్రకటన ఫేక్ అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. వదంతులను నమ్మొద్దని ప్రజలను కోరింది.
- ఇమ్రాన్ ఖాన్ గాయపడినట్లుగా, ఆస్పత్రికి తరలిస్తున్నట్లుగా వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు కూడా ఫేక్ అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది.
ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ ?
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? అనే ప్రశ్న అందరి మదిలో ఉదయిస్తోంది. వాస్తవం ఏమిటంటే.. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. 2023 ఆగస్టులో అరెస్టు అయినప్పటి నుంచి ఆయన అడియాలా జైలులోనే ఉన్నారు.
ఇమ్రాన్ ఖాన్‌కు శిక్ష ఎందుకు ?
- పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 2022 ఏప్రిల్‌లో పదవీచ్యుతుడు అయ్యారు. నాటి నుంచి ఆయన అనేక చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొన్నారు.
- అవినీతి ఆరోపణలు నిరూపితం కావడంతో ఆయనకు 14 సంవత్సరాల జైలు శిక్ష పడింది.
- ఇమ్రాన్ గత 19 నెలలుగా జైలులో ఉన్నాడు.
- ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తతో అక్రమ ఒప్పందం కుదుర్చుకున్న వ్యవహారంలో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలను కోర్టు దోషులుగా తేల్చింది. ఖాన్‌కు 14 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించింది. బుష్రాకు 7 సంవత్సరాల జైలు శిక్షను విధించింది.