HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Fssai Notices To Swiggy Instamart

FSSAI: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు..

  • Author : Vamsi Chowdary Korata Date : 11-07-2026 - 2:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
FSSAI notices to Swiggy Instamart...
FSSAI notices to Swiggy Instamart...

ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) షాక్ ఇచ్చింది. వినియోగదారుల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో స్విగ్గీకి ఏకంగా తొమ్మిది నోటీసులు జారీ చేసినట్టు శనివారం వెల్లడించింది. గడువు ముగిసిన, పాడైపోయిన, కుళ్లిపోయిన, కలుషితమైన, అసురక్షిత ఆహార పదార్థాలను తమ ప్లాట్‌ఫామ్ ద్వారా సరఫరా చేస్తున్నారంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా తెలిపింది.

ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌లో ఆమోదం లేని బ్రాండ్ పేరుతో గుడ్లను విక్రయిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని రెగ్యులేటరీ సంస్థ పేర్కొంది. సరైన లైసెన్స్ పొందే వరకు ఆ ఉత్పత్తిని మార్కెట్ చేయవద్దని ‘ఫుడ్ బిజినెస్ ఆపరేటర్’ (ఎఫ్‌బీఓ) అయిన స్విగ్గీని ఆదేశించింది. అంతేకాకుండా ‘హెల్తీఫై 100% వే ప్రోటీన్ 1 కేజీ’, ‘నాయిస్ హోమ్‌స్టైల్ మద్రాస్ మిక్చర్ విత్ పీనట్స్’ వంటి ఉత్పత్తులను వాటి గడువు తేదీ ముగిసిన తర్వాత కూడా వినియోగదారులకు సరఫరా చేసినట్టు వచ్చిన ఫిర్యాదులను కూడా నోటీసుల్లో ప్రస్తావించింది.

మరో తీవ్రమైన ఘటనలో.. ‘అక్షయకల్ప ఆర్గానిక్ ఎగ్’ గడువు ముగిసి, కుళ్లిపోయి, దుర్వాసన వెదజల్లుతూ, కలుషితమైనట్టుగా గుర్తించారు. ఇది మానవ వినియోగానికి ఏమాత్రం పనికిరాదని తేలింది. అదేవిధంగా, ‘కక్కే దా పరాఠా’ అనే ఉత్పత్తి కూడా పాడైపోయి, దుర్వాసనతో ఉన్నట్టు ఫిర్యాదు అందింది. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, శిశువుల కోసం ఉద్దేశించిన ఒక ఫుడ్ ఫార్ములేషన్ పాడైపోయిందని వినియోగదారుడు వెనక్కి పంపితే, అదే ఉత్పత్తిని మళ్లీ తిరిగి సరఫరా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదు చేసినప్పటికీ స్విగ్గీ ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది.

ఈ ఘటనల నేపథ్యంలో నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర వివరణ ఇవ్వాలని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ను ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్యలు, నాణ్యత హామీ వ్యవస్థలు, దిద్దుబాటు చర్యల వివరాలను సమర్పించాలని కోరింది. నిర్దేశిత గడువులోగా సంతృప్తికరమైన వివరణ ఇవ్వడంలో విఫలమైతే.. ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006’ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టంగా హెచ్చరించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Food Safety Warning
  • fssai
  • Notices
  • Swiggy Instamart

Related News

Why did FSSAI take strict action against liquor manufacturers?

Alcohol: మద్యం తయారీదారులపై FSSAI ఎందుకు కఠిన చర్యలు తీసుకుంది?

అదనపు ఫ్లేవర్లను అనధికారికంగా ఉపయోగించడం మరియు వయస్సుకి సంబంధించిన వాదనలను పాటించనందుకు, మద్యపాన తయారీదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఆహార భద్రతా మరియు ప్రమాణాల సంస్థ (FSSAI) గురువారం తెలిపింది. ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఆల్కహాలిక్ బెవరేజెస్) రెగ్యులేషన్స్, 2018’ కింద నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ నోటీసులు జారీ చేయబడ్డాయి. అదనపు ఫ్లేవర్ల వాడకంపై నిష

    Latest News

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

    • FSSAI: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు..

    • Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

    • INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd