HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Leopard Causes A Stir On The Alipiri Footpath

Tirumala: అలిపిరి మెట్ల మార్గంలో చిరుత హల్ చల్

  • Author : Vamsi Chowdary Korata Date : 11-07-2026 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Leopard causes a stir on the Alipiri footpath.
Leopard causes a stir on the Alipiri footpath.

కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో మరోసారి చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. అలిపిరి కాలినడక మార్గంలోని ప్రముఖ శ్రీ నరసింహస్వామి ఆలయ సమీపంలో నిన్న రాత్రి ఒక చిరుతపులి ప్రత్యక్షమైంది. ఆ సమయంలో కాలినడకన స్వామివారి దర్శనానికి వెళ్తున్న భక్తులు ఒక్కసారిగా చిరుతను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో భక్తులు చెల్లాచెదురుగా పరుగులు తీయడంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు భక్తులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించగా, ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

చిరుత సంచార సమాచారం అందుకున్న వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భద్రతా సిబ్బంది, అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని భక్తులను గుంపులుగా చేర్చి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భక్తుల భద్రత దృష్ట్యా అటవీశాఖ అధికారులు నరసింహస్వామి ఆలయ పరిసర ప్రాంతాలలో గస్తీని (పెట్రోలింగ్) ముమ్మరం చేశారు. కాలినడకన వెళ్లే భక్తులు గుంపులు గుంపులుగా, అప్రమత్తంగా వెళ్లాలని, ఒంటరిగా ప్రయాణించవద్దని అధికారులు సూచించారు. వన్యప్రాణుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలను, పంజరాలను ఏర్పాటు చేసేందుకు అటవీశాఖ చర్యలు చేపడుతోంది.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alipiri incident
  • alipiri steps
  • Alipiri Walk Way
  • Leopard At Tirumala
  • Tirumala Tirupati Devasthanams (TTD)
  • Tirupati Forest Department

Related News

Cancellation of VIP break darshans from July to September

TTD VIP Break Darshan: జూలై నుండి సెప్టంబ‌ర్ వ‌ర‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల ర‌ద్దు

జూలై 14: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జూలై 17: ఆణివార ఆస్థానం జూలై 19: శ్రీ ఆండవన్ ఆశ్రమం స్వామీజీకి పెద్ద మర్యాద జూలై 29: శ్రీ జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం ఆగస్టు 22: పవిత్రోత్సవాలకు అంకురార్పణ ఆగస్టు 24: పవిత్రోత్సవాల రెండో రోజు (పవిత్రాల సమర్పణ) సెప్టెంబర్ 8: శ్రీవారి బ్రహ్మోత్సవాల కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సెప్టెంబర్ 14: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ సెప్టెంబర్ 15 నుంచి 23

    Latest News

    • Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

    • Nara Brahmani: నారా బ్రాహ్మణికి ‘ఫార్చ్యూన్‌ ఇండియా’ జాబితాలో చోటు.. నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్

    • Tirumala: అలిపిరి మెట్ల మార్గంలో చిరుత హల్ చల్

    • Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

    • US-Iran War: అమెరికా,ఇరాన్ చర్చలు.. కానీ సీజ్‌ఫైర్ మాత్రం క్లోజ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd