HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >With Which Substances Does Performing Abhishekam To Neelakantha Yield Results

Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Author : Vamsi Chowdary Korata Date : 28-06-2026 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
With which substances does performing *Abhishekam* to Neelakantha yield results?
With which substances does performing *Abhishekam* to Neelakantha yield results?

నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి

పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు

గామధేనువు వానింట గాడి పసర

మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు

తాత్పర్యము: శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి, పూలు, పత్రి దళాలను ఆయన శిరస్సుపై ఉంచే వాని ఇంటిలో దేవతా గోవు కాడి పశువుగా పడి ఉంటుందిట. కల్పవృక్షం అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టులాగా ఉంటుందిట. శివార్చన, అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరుతాయి… సకల ఐశ్వర్యములు సమకూరుతాయి.

నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణెడు జలంతో అభిషేకించినా శివయ్య సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలను ఇట్టే నెరవేరుస్తాడు. అందుకే ఆయనను భోళా శంకరుడు అంటారు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతుంటారు. అలా వినియోగించే ఒక్కో ద్రవ్యానికీ ఒక్కో విశిష్టత ఉంది. అంతేకాదు, ఒక్కో దానికి ప్రత్యేక పరమార్థం ఉంది. మన పెద్దలు విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. శివుడిని ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏం ఫలితం వస్తుందో తెలుసుకుందాం.

1. ఆవు పాలతో – సర్వ సౌఖ్యాలు

2. ఆవు పెరుగు – ఆరోగ్యం, బలం

3. ఆవు నెయ్యి – ఐశ్వర్యాభివృద్ధి

4. చెరకు రసం (పంచదార) – దుఃఖ నాశనం, ఆకర్షణ

5. తేనె – తేజో వృద్ధి

6. భస్మ జలం – మహా పాప హరణం

7. సుగంధోదకం – పుత్ర లాభం

8. పుష్పోదకం – భూలాభం

9. బిల్వ జలం – భోగ భాగ్యాలు

10. నువ్వుల నూనె – అపమృత్యు హరణం

11. రుద్రాక్షోదకం – మహా ఐశ్వర్యం

12. సువర్ణ జలం – దరిద్ర నాశనం

13. అన్నాభిషేకం – సుఖ జీవనం

14. ద్రాక్ష రసం – సకల కార్యాభివృద్ధి

15. నారికేళ జలం – సర్వ సంపద వృద్ధి

16. ఖర్జూర రసం – శత్రు నాశనం

17. దూర్వోదకం – ద్రవ్య ప్రాప్తి

18. ధవళోదకమ్ – శివ సాన్నిధ్యం

19. గంగోదకం – సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి

20. కస్తూరీ జలం – చక్రవర్తిత్వం

21. నేరేడు పండ్ల రసం – వైరాగ్య ప్రాప్తి

22. నవరత్న జలం – ధాన్య గృహ ప్రాప్తి

23. మామిడి పండు రసం – దీర్ఘ వ్యాధి నాశనం

24. పసుపు, కుంకుమ – మంగళ ప్రదం

25. విభూది – కోటి రెట్ల ఫలితం లభిస్తుంది.

విష్ణువు అలంకార ప్రియుడైతే… శివుడు అభిషేక ప్రియుడు. శివుడు అభిషేకానికి చాలా ప్రియంగా భావిస్తుంటాడు. కాబట్టి ఆయనను అభిషేక ప్రియుడు అంటారు. ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. అందుకే శివార్చనల అభిషేకం చాలా ముఖ్యమైనది. గంగ జలరూపమైనది… జలం పంచభూతాలలోనూ, శివుని అష్టమూర్తులలోనూ ఒకటి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • abhisekham
  • benefits
  • devotional
  • devotional pooja
  • devotional tips
  • Devotional Updates
  • Financial Prosperity
  • Lord Shiva
  • Lord Shiva pooja
  • Lord Shiva temple
  • money and prosperity
  • peace and prosperity
  • prosperity

Related News

Surprising facts about Goddess Varahi

Varahi Ammavaru: వారాహి అమ్మవారి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

వారాహి అమ్మవారి విషయాలు: వారాహి అమ్మవారిని శక్తి స్వరూపాలలో ఒకరిగా చెప్తారు. ఈమెను సప్త మాతృకలలో ఒకరిగా, అలాగే దశమహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు. లలితా దేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. ఆ లలితా దేవి తరఫున పోరాడటానికే కాదు, భక్తులకు అండగా నిలిచే ఒక గొప్ప యోధురాలిగా వారాహి నిలుస్తుంది. ఈమెను ఆ

  • Simply planting these three trees—which are highly favored by Kubera—in the right direction at home will lead to a shower of wealth.

    Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

Latest News

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

  • Uppal Balu: ఉప్పల్ బాలుకు ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd