Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు
- Author : Vamsi Chowdary Korata
Date : 09-07-2026 - 5:09 IST
Published By : Hashtagu Telugu Desk
రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథకు లీగల్ పరంగా పెద్ద ఉపశమనం లభించింది. భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు గురువారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం హైకోర్టు తుది తీర్పును ప్రకటించారు. రూ.1 లక్ష చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు (Sureties) సమర్పించాలని, కోర్టు విధించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆదేశిస్తూ భగీరథ్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు.