SBI తమ కస్టమర్లకు వ్యక్తిగత అవసరాల కోసం ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్స్ అందిస్తోంది. దీన్ని SBI Yono APP ద్వారా పొందవచ్చు.
9.60 శాతం నుండి వడ్డీ రేటు మొదలు - పర్సనల్ లోన్ పైన ఈ నెలాఖరు వరకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఉంది. - కనిష్టంగా వడ్డీ రేటు 9.60 శాతం నుండి ప్రారంభమవుతుంది. - జనవరి 31, 2022 వరకు ప్రాసెసింగ్ ఛార్జీలలో 100 శాతం మినహాయింపు ఉంటుంది.
- కేవలం నాలుగు క్లిక్స్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. రుణ మంజూరు తక్షణమే ఉంటుంది.
భౌతికంగా పత్రాలు ఇవ్వవలసిన అవసరం లేదు. - బ్రాంచీకి వెళ్లే పని లేదు. - Yono APP ద్వారా 24X7 ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
ఎలా అప్లయ్ చేసుకోవాలి? - మొదట యోనో యాప్ ఓపెన్ చేసి, లాగ్-ఇన్ కావాలి. - డ్రాప్ మెనూలోని Avail Now పైన క్లిక్ చేయాలి.
రుణ మొత్తం, రుణ కాలపరిమితిని ఎంచుకోవాలి. - బ్యాంకు ఖాతాతో రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్‌కు సందేశం వస్తుంది. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేశాక ప్రాసెస్ పూర్తవుతుంది. రుణ మొత్తం ఖాతాకు క్రెడిట్ అవుతుంది.
రుణ అర్హత ఎలా? ఎస్బీఐ ఖాతాదారులు తమ రుణ అర్హతను తెలుసుకునే విధానం ఉంది. <స్పేస్><చివరి నాలుగు అంకెల ఎస్బీఐ సేవింగ్స్ ఖాతా నెంబర్> టైప్ చేసి 5676766 నెంబర్‌కు ఎస్సెమ్మెస్ చేయడం ద్వారా రుణ అర్హతను తెలుసుకోవచ్చు.