HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ind Vs Pak T20 World Cup 2026 Weather Forecast

భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?!

పాకిస్థాన్‌కు దక్కిన ఏకైక విజయం 2021 టీ20 ప్రపంచకప్‌లో లభించింది. ఈ రికార్డులను బట్టి చూస్తే ఈసారి కూడా టీమ్ ఇండియాదే పైచేయిగా కనిపిస్తోంది.

  • Author : Gopi Date : 13-02-2026 - 8:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
T20 World Cup 2026
T20 World Cup 2026

IND vs PAK: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15 (ఆదివారం) శ్రీలంకలోని కొలంబోలో భారత్- పాకిస్థాన్ మధ్య మహా పోరు జరగనుంది. ఎన్నో ఇబ్బందుల తర్వాత పాకిస్థాన్ ఈ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించగా ఇప్పుడు ఈ మ్యాచ్‌పై వర్షం ముప్పు పొంచి ఉంది. శ్రీలంక అధికారులు ఫిబ్రవరి 15, 16 తేదీలకు వాతావరణ హెచ్చరికలు జారీ చేయడం క్రికెట్ అభిమానుల గుండెల్ని పిండేస్తోంది.

అక్యూవెదర్ నివేదిక ప్రకారం.. మ్యాచ్ రోజున సుమారు 4 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. కేవలం వర్షమే కాకుండా, 26% మేర ఉరుములతో కూడిన తుఫాను వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. భారత్-పాక్ సమరం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా నిరాశ కలిగించే వార్తే.

Also Read: లివర్ క్యాన్సర్‌పై ఢిల్లీ వైద్యుల విజయం.. సర్జరీ లేకుండానే వృద్ధుడికి పునర్జన్మ!

75% chance of the rain on the 15th February, Pak-Ind match day. pic.twitter.com/Mk0CI71DVA

— Muhammad Haseeb (@mhkh123) February 13, 2026

తొలుత నిరాకరించిన పాకిస్థాన్

వాస్తవానికి భారత్‌తో తలపడటానికి పాకిస్థాన్ ప్రభుత్వం మొదట నిరాకరించింది. తమ జట్టు టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొంటుందని, కానీ భారత్‌తో జరిగే మ్యాచ్‌లో మాత్రం మైదానంలోకి దిగదని పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

పాకిస్థాన్ నిరాకరణతో క్రికెట్ ప్రపంచంలో కలకలం రేగింది. వెంటనే రంగంలోకి దిగిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)తో పలు సమావేశాలు నిర్వహించి సమస్యను పరిష్కరించింది. చివరికి పాకిస్థాన్ ఈ మ్యాచ్ ఆడేందుకు పచ్చజెండా ఊపింది. బంగ్లాదేశ్‌కు సంఘీభావం తెలుపుతూ పాకిస్థాన్ ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని భావించినట్లు తెలుస్తోంది. ఐసీసీ, పీసీబీ మధ్య జరిగిన ఈ చర్చల్లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా పాల్గొంది.

టీ20 వరల్డ్ కప్‌లో భారత్-పాక్ హెడ్-టు-హెడ్

టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ vs పాకిస్థాన్ రికార్డులను పరిశీలిస్తే ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మొత్తం 8 మ్యాచ్‌లు జరిగాయి.

  • భారత్ విజయం: 7 సార్లు
  • పాకిస్థాన్ విజయం: 1 సారి

పాకిస్థాన్‌కు దక్కిన ఏకైక విజయం 2021 టీ20 ప్రపంచకప్‌లో లభించింది. ఈ రికార్డులను బట్టి చూస్తే ఈసారి కూడా టీమ్ ఇండియాదే పైచేయిగా కనిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AccuWeather
  • ind vs pak
  • sports news
  • T20 World Cup 2026
  • Weather Forecast

Related News

    Latest News

    • Purchase of Grain : ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే ‘రోహిత్ ‘ కీలక ఆదేశాలు

    • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

    • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

    • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

    • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

    Trending News

      • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

      • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

      • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

      • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd