జమ్మూ కాశ్మీర్ లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి.. 13 మందికి గాయాలు
- Author : Vamsi Chowdary Korata
Date : 22-01-2026 - 3:42 IST
Published By : Hashtagu Telugu Desk
జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన వాహనం లోయలో పడిపోయింది. చంబా-బందేర్వా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా… మరో తొమ్మిది మంది గాయపడ్డారు.
- 200 అడుగుల లోతులోకి పడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం
- జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం
- గాయపడిన తొమ్మిది మంది మిలిటరీ ఆసుపత్రికి తరలింపు
ఆర్మీకి చెందిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో 17 మంది ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో ప్రమాదం సంభవించింది. లోయలో సుమారు 200 అడుగుల లోతులోకి వాహనం పడిపోయింది. హై ఆల్టిట్యూడ్ పోస్టు వద్దకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఆర్మీతో పాటు పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడినవారిని ఉదంపూర్ మిలిటరీ ఆసుపత్రికి తరలించారు.