HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Atrocity In Bihar Forced Marriage After Giving Drugs

బీహార్‌లో దారుణం..డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు

  • Author : Vamsi Chowdary Korata Date : 12-02-2026 - 10:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pakadwa Vivah
Pakadwa Vivah
Pakadwa Vivah  బిహార్‌లో మరో పకడ్వా వివాహ్ (బలవంతపు పెళ్లి) వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న ఓ యువకుడిని కొందరు కిడ్నాప్ చేసి బలవంతంగా వివాహం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. సమస్తీపూర్ జిల్లా జోడి పఖర్ గ్రామానికి చెందిన నితీశ్ కుమార్ బిహార్ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ కోసం శిక్షణ పొందుతున్నాడు. చక్‌రాజా అలీ గ్రామానికి చెందిన శంకర్ రాయ్ కుటుంబం అతడిని తమ ఇంటి అల్లుడిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఈ నెల 7న నితీశ్ లైబ్రరీకి వెళుతుండగా, శంకర్ రాయ్ కుటుంబ సభ్యులు అతడిని కిడ్నాప్ చేశారు. తీవ్రంగా కొట్టి, మత్తు మందులు ఇచ్చి మోర్వాలోని ఓ ఆలయానికి తీసుకెళ్లి శంకర్ రాయ్ కుమార్తె లక్ష్మీ కుమారితో బలవంతంగా వివాహం జరిపించారు. అనంతరం అతడిని ఇంట్లోనే నిర్బంధించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటపడింది. వీడియో చూసిన సమస్తీపూర్ పోలీసులు శంకర్ రాయ్ ఇంటికి చేరుకుని నితీశ్‌ను రక్షించారు. అనంతరం అతడిని విచారించగా, తనను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసినట్లు వివరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అయితే, బిహార్‌లో ‘పకడ్వా వివాహ్’ (బలవంతపు పెళ్లిళ్లు) ఘటనలు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తుంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న లేదా ఉన్నత చదువులు పూర్తిచేసిన యువకులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి వివాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 2009 లోనే రాష్ట్రంలో 1,224 బలవంతపు పెళ్లిళ్లు నమోదైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. కొన్నిసార్లు ఆయుధాలతో బెదిరించి యువకులకు ఇష్టం లేని పెళ్లిళ్లు జరిపిస్తున్న ఘటనలు కూడా నమోదవుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bihar
  • Bride Kidnapping
  • Forced Marriage
  • Groom Kidnapping
  • kidnapping
  • Lakshmi Kumari
  • nitish kumar
  • Pakadwa Vivah
  • police recruitment
  • samastipur

Related News

Nitish Kumar

Nitish Kumar : సీఎం పదవికి నితీశ్ రాజీనామా?

నితీశ్ కుమార్ కేంద్ర రాజకీయాల వైపు వెళ్తుండటంతో, బిహార్ కొత్త ప్రభుత్వంలో ఆయన వారసుడి పాత్రపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నితీశ్ కుమారుడు నిశాంత్ కుమార్ త్వరలో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారని

  • Bihar Bjp

    BJP : బీజేపీ చేతికి బిహార్ పగ్గాలు!

Latest News

  • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

  • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

  • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

  • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

Trending News

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd