HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Lokeshs Clarity In The Assembly On Triple It

ట్రిపుల్ ఐటీపై అసెంబ్లీలో మంత్రి లోకేశ్ క్లారిటీ

  • Author : Vamsi Chowdary Korata Date : 12-02-2026 - 2:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh
Nara Lokesh
NARA LOKESH   రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) క్యాంపస్‌లలో పూర్తిస్థాయి, శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. శాసనసభలో దీనిపై మాట్లాడిన ఆయన, ఈ క్యాంపస్‌ల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు.

నిధుల కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రితో చర్చలు జరిపామని లోకేశ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘సాస్కీ’ పథకం ద్వారా నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (డీపీఆర్‌లు) సిద్ధం చేస్తున్నామని, తద్వారా కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న నాలుగు క్యాంపస్‌లకు అవసరమైన నిధుల వివరాలను మంత్రి సభకు తెలియజేశారు. నూజివీడు క్యాంపస్‌లో పనులు పూర్తి చేయడానికి రూ.60 కోట్లు, అరకు వ్యాలీలో నిర్మాణాలకు రూ.40 కోట్లు అవసరమని అంచనా వేశామన్నారు. అదేవిధంగా, ఒంగోలు క్యాంపస్‌కు రెండు దశల్లో కలిపి రూ.600 కోట్లు, శ్రీకాకుళం క్యాంపస్ పనులు పూర్తి చేయడానికి రూ.300 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం శాశ్వత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు చదువు మధ్యలో తాత్కాలిక అకాడమీల కోసం వేర్వేరు జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ జిల్లాలో ట్రిపుల్ ఐటీ చదివే విద్యార్థులు అక్కడే తమ కోర్సును పూర్తి చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని లోకేశ్ స్పష్టం చేశారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి, శాశ్వత సౌకర్యాలను ఏర్పాటు చేసి, విద్యార్థులు చేరిన క్యాంపస్‌లోనే చదువు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో, పుట్టపర్తిలో కొత్త ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేసే అవకాశంపై ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి, తగిన పరిశీలన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన సభకు హామీ ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap education
  • AP Education Minister
  • Araku Valley
  • iiit
  • Minister Nara lokesh
  • Nuzvid
  • Nuzvid IIIT
  • ongole
  • RGUKT
  • Saskey Scheme
  • srikakulam

Related News

Capital war reignites in AP... Amaravati versus Mavigan...

Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

ఏపీలో మావిగన్ గురించి చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పనుల్లో వేగం పెంచడానికి ప్రయత్నిస్తుండగా.. జగన్ మాత్రం మావిగన్ పేరిట మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి రాజధాని నిర్మిస్తే బాగుంటుందని చెబుతున్నారు. మొదట జగన్ నోటి నుంచి ‘మావిగన్’ అనే మాట వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ జులై 1న నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జగన్ మాట్లాడ

  • Pawan meets Maharashtra CM Devendra Fadnavis; expresses gratitude for providing two tigresses to AP.

    Pawan Kalyan: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd