HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Bharat Bandh Today

నేడు భారత్ బంద్..

  • Author : Vamsi Chowdary Korata Date : 12-02-2026 - 9:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bharat Bandh
Bharat Bandh
Bharat Bandh  కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పదికి పైగా కార్మిక, రైతు సంఘాలు గురువారం (ఫిబ్రవరి 12) ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చాయి. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక ప్రకటించింది. ఈ సమ్మెలో సుమారు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.

ఈ బంద్‌కు సంయుక్త కిసాన్ మోర్చా (SKM) కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో దీని ప్రభావం దేశవ్యాప్తంగా పలు రంగాలపై పడనుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా, రవాణా, విద్యుత్, బొగ్గు, గ్యాస్ వంటి కీలక రంగాల్లో సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఏఐబీఈఏ, ఏఐబీవోఏ వంటి కొన్ని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నందున బ్యాంకింగ్ కార్యకలాపాలు పాక్షికంగా స్తంభించవచ్చు.

కొత్త లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించడాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని కార్మిక సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్ కౌర్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేసేందుకే ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్లు స్పష్టం చేశారు.

అయితే, ఆసుపత్రులు, అంబులెన్సులు, ఫార్మసీలు, పాలు వంటి అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రైవేటు కార్యాలయాలు, ఐటీ కంపెనీలు, పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ, స్థానిక పరిస్థితులను బట్టి వాటి  మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AIBEA
  • Amarjeet Kaur
  • Bank Strike
  • Bank Strike News
  • Bharat Bandh
  • farmers protest
  • Farmers Trade Unions
  • Labour Reforms India
  • Narendra Modi government
  • Privatization India
  • SKM
  • Trade Unions

Related News

    Latest News

    • జాహ్నవి కందుల కుటుంబానికి 264 కోట్ల పరిహారం

    • Whatsapp Black : రష్యాలో వాట్సాప్ బ్లాక్!

    • బీహార్‌లో దారుణం..డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు

    • AP Assembly Sessions : నేటి అసెంబ్లీ షెడ్యూల్

    • British Parliament : బ్రిటిష్ పార్లమెంటులో సభ్యుడిగా తెలుగోడు!

    Trending News

      • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

      • ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!

      • ఏప్రిల్ 1 నుండి మారనున్న ప్ర‌త్యేక‌ నిబంధనలు ఇవే!

      • రైల్వే ప్ర‌యాణికుల‌కు మ‌రో అదిరిపోయే సూప‌ర్ న్యూస్‌!

      • అర్జున్ టెండూల్క‌ర్‌ పెళ్లికి ప్ర‌ధాని మోదీ?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd