HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Mha Guidelines On Vande Mataram Legal Provisions And Acts

ఈ సంద‌ర్భాల్లో వందేమాత‌రం త‌ప్ప‌నిస‌రి!

ఇప్పటివరకు జాతీయ గీతం 'జన గణ మన'కు 52 సెకన్ల సమయం, కచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. కానీ 'వందేమాతరం'కు సంబంధించి ఎటువంటి స్పష్టమైన రాతపూర్వక ప్రోటోకాల్ లేదు.

  • Author : Gopichand Date : 11-02-2026 - 10:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vande Mataram
Vande Mataram

Vande Mataram: జాతీయ గీతం ‘జన గణ మన’కు ఉన్న గౌరవప్రదమైన స్థానాన్ని జాతీయ గేయం ‘వందేమాతరం’కు కూడా కల్పిస్తూ భారత ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జనవరి 28న విడుదల చేసిన 10 పేజీల కొత్త ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై బహిరంగ కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ పాడటం, ప్లే చేయడం తప్పనిసరి.

3.10 నిమిషాల నిడివి

కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై కేవలం ప్రారంభ పంక్తులు మాత్రమే కాకుండా ఈ గేయంలోని ఆరు చరణాలతో కూడిన సుదీర్ఘ వెర్షన్‌ను ప్లే చేస్తారు. దీని మొత్తం నిడివి 3 నిమిషాల 10 సెకన్లుగా నిర్ణయించారు. ఈ ఆదేశాల ప్రతులను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖలకు పంపారు.

ఎప్పుడు, ఎక్కడ తప్పనిసరి?

  • హోం శాఖ ఆదేశాల ప్రకారం ఈ క్రింది సందర్భాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరిగా ప్లే చేయాలి.
  • త్రివర్ణ పతాకాన్ని (జాతీయ జెండా) ఎగురవేసే సమయంలో.
  • రాష్ట్రపతి, గవర్నర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్‌లు ఏదైనా కార్యక్రమానికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు.
  • రాష్ట్రపతి ‘జాతిని ఉద్దేశించి ప్రసంగించే’ ముందు, ప్రసంగం ముగిసిన తర్వాత.
  • ఏదైనా కార్యక్రమంలో జాతీయ గీతం (జన గణ మన), జాతీయ గేయం (వందేమాతరం) రెండూ నిర్వహించాల్సి వస్తే.. మొదట ‘వందేమాతరం’ ప్లే చేయాలి. ఆ తర్వాతే ‘జన గణ మన’ వస్తుంది.

Also Read: మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా.. రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా?!

గౌరవ సూచక నియమాలు

‘వందేమాతరం’ అధికారిక వెర్షన్‌ను పాడినా లేదా ప్లే చేసినా అక్కడ ఉన్న వారందరూ తప్పనిసరిగా ‘సావధాన్’ స్థితిలో నిలబడి గౌరవించాలి. గేయం పట్ల గౌరవాన్ని చాటిచెప్పడానికి ఈ నిబంధనను అమలులోకి తెచ్చారు.

మినహాయింపులు ఎక్కడ?

ప్రోటోకాల్‌లో కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చారు. ఒకవేళ ‘వందేమాతరం’ ఏదైనా న్యూస్ రీల్, డాక్యుమెంటరీ లేదా సినిమా కథలో భాగంగా ఉంటే ప్రేక్షకులు నిలబడాల్సిన అవసరం లేదు. బహిరంగ ప్రదేశాల్లో (ఉదాహరణకు సినిమా హాళ్లలో) గందరగోళం లేదా అశాంతి కలగకుండా ఉండటానికి ఈ వెసులుబాటు కల్పించారు.

మొదటిసారి అధికారిక ప్రోటోకాల్

ఇప్పటివరకు జాతీయ గీతం ‘జన గణ మన’కు 52 సెకన్ల సమయం, కచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. కానీ ‘వందేమాతరం’కు సంబంధించి ఎటువంటి స్పష్టమైన రాతపూర్వక ప్రోటోకాల్ లేదు. జాతీయ గేయం గాన నిడివిని, చరణాల సంఖ్యను, నిలబడాల్సిన నిబంధనలను ప్రభుత్వం అధికారికంగా క్రోడీకరించడం ఇదే మొదటిసారి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jana Gana Mana
  • MHA Guidelines
  • Modi Government News
  • pm modi
  • Vande Mataram

Related News

PM Modi Becomes Most-Followed World Leader With Over 30 Million Subscribers

యూట్యూబ్‌లోనూ ప్రధాని మోదీ రికార్డు

Narendra Modi  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో ఆయన చానెల్ 3 కోట్ల (30 మిలియన్ల) సబ్‌స్క్రైబర్ల మైలురాయిని దాటింది. దీంతో ప్రపంచంలోని ప్రస్తుత, మాజీ దేశాధినేతల్లో యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన నేతగా ఆయన తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. ఈ ఘనతతో డిజిటల్ కమ్యూనికేషన్‌ల

  • Netanyahu Modi Phone Call

    ఇజ్రాయెల్‌కు అండగా నిలబడ్డందుకు మోదీకి థాంక్స్

  • PM Modi

    ఎన్‌సీఈఆర్‌టీ వివాదం.. ప్ర‌ధాని మోదీ అస‌హ‌నం!

  • PM Modi

    Social Media : 10 కోట్ల ఫాలోవర్లతో ఇన్స్టాలో మోదీ రికార్డ్

Latest News

  • ముంబై వాంఖ‌డే పిచ్‌.. క్యూరేటర్‌పై గంభీర్ అస‌హ‌నం?!

  • భార‌త మార్కెట్‌లో అత్యంత చౌకైన బైక్ ఇదే!

  • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి తుది వీడ్కోలు.. ఖ‌న‌నం ఎక్క‌డంటే?

  • మనం తీసుకునే ఆహారంలో గోధుమ‌లే డేంజ‌రా?!

  • ఎంఎస్ ధోనీకి షాక్ ఇచ్చిన పోలీసులు!

Trending News

    • రెండు వేల రూపాయ‌ల నోట్లు ఇంకా ఎందుకు బయట ఉన్నాయి?

    • రేపే భార‌త్‌- ఇంగ్లాండ్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌.. ఈ ఆట‌గాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • ఇరాన్‌ లో ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

    • శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

    • ఖమేనీ వద్ద ఎంత ఆస్తి ఉందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd