HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hand In Hand In Nalgonda 4 Municipalities Captured

నల్గొండ లో హస్తం హవా.. 4 మున్సిపాలిటీలు కైవసం

  • Author : Vamsi Chowdary Korata Date : 13-02-2026 - 11:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Municipal Election Results
Telangana Municipal Election Results

Telangana Municipal Election Results  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార కాంగ్రెస్ (Congress) పార్టీ తన రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జిల్లాలోని నాలుగు కీలక మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హాలియా, చండూరు, నందికొండ, చిట్యాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించి, ప్రత్యర్థి పార్టీలకు గట్టి షాక్ ఇచ్చారు.ఏకపక్షంగా నందికొండ, హాలియా ఫలితాలు..నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 12 వార్డులకు గాను ఏకంగా 11 స్థానాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేయగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. అదేవిధంగా, హాలియా మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది. ఇక్కడ 12 స్థానాలకు గాను 10 వార్డులను హస్తం పార్టీ గెలుచుకోగా, బీఆర్ఎస్ రెండు స్థానాల్లో విజయం సాధించింది.చండూరులోనూ ‘హస్తం’ జోరుతీవ్ర ఉత్కంఠ రేపిన చండూరు మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ పార్టీయే పైచేయి సాధించింది. మొత్తం 10 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో 7 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, బీఆర్ఎస్ 3 స్థానాలను దక్కించుకుంది. ఇక చిట్యాలలో 12 వార్డులకు గాను 11 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు, ఒకే ఒక్క వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు.తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకుంది. ఖమ్మం జిల్లాలోని మధిర మున్సిపాలిటీలో 10వ వార్డును టీడీపీ గెలుచుకుంది. ఇక్కడి నుండి ఆ పార్టీ అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం సాధించారు. పదో వార్డులో 530 ఓట్లు పోల్ కాగా రేవతికి 334 ఓట్లు వచ్చాయి.మధిర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకర్గం. మధిర మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 9 చోట్ల విజయం సాధించారు.ఇప్పటి వరకు పలు మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకుంది. అశ్వారావుపేట, పెద్దపల్లి, కామారెడ్డి, భీంగల్, మరిపెడ, చండూరు, చొప్పదండి, రామాయంపేట, బాన్సువాడ, హాలియాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. అశ్వారావుపేటలో 22 వార్డులకు గాను 17 స్థానాల్లో కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్, ఒకచోట బీజేపీ విజయం సాధించాయి. హాలియా మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ ఎనిమిది చోట్ల గెలిచింది.నల్లగొండ జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సామాజిక మార్పుకు నాంది పలుకుతూ ఓ ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి విజయం సాధించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిట్యాల మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 9 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అభ్యర్థులు 2 వార్డుల్లో, ఇండిపెండెంట్ అభ్యర్థి ఓ వార్డులో గెలిచారు.అయితే, ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించింది 1వ వార్డు ఫలితమే. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా (Independent) పోటీ చేసిన ట్రాన్స్‌జెండర్ నాగిళ్ల సుధాకర్ సంచలన విజయం సాధించారు. రాజకీయ నేపథ్యం, పార్టీల అండదండలు లేకపోయినా.. ప్రజల మద్దతుతో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి సుధాకర్ జయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో ఓటు వేసిన వార్డు ప్రజలకు సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు. వార్డు అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Eelection Commission
  • nalagonda
  • Telangana Municipal Election
  • Telangana Municipal Election Results
  • Telangana Municipal Elections
  • telangana municipal elections 2026
  • telangana municipal elections results
  • telangana politics

Related News

Delhi High Court deals a blow to Kavitha.

TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తూ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. ఆమె ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన (TRS) అనే పేరును రిజిస్టర్ చేయడం కుదరదని స్పష్టం చేస్తూ ఈసీ అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఈ పేరుపై ప్రజల నుంచి, వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని ఎలక్షన్ క

  • 20 Years of Revanth Reddy's Political Journey

    Revanth Reddy: రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు

Latest News

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

  • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

  • Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

  • Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd