HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Chinas Secret Nuclear Tests After Galvan Clash

గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా రహస్య అణు పరీక్షలు

  • Author : Vamsi Chowdary Korata Date : 12-02-2026 - 3:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Donald Trump holds call with Xi Jinping
Donald Trump holds call with Xi Jinping

CHINA vs USA  ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సులో చైనాపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. ఆ దేశం 2020 జూన్‌లో అణు పరీక్షలు నిర్వహించిందని అమెరికా మంత్రి చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. తాజాగా, ఈ ఆరోపణలపై బీజింగ్ స్పందించి.. అమెరికాకు చురకలు అంటించింది. ముందు అమెరికా తన ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించాలని కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాము ఎటువంటి పరీక్షలు చేయలేదని, అంతర్జాతీయ అణు నిరాయుధీకరణకు కట్టుబడి ఉన్నామని చైనా పునరుద్ఘాటించింది.

  • భారత్, చైనా సైనికుల మధ్య గాల్వాన్ లోయ వద్ద ఘర్షణ
  • ఈ సమయంలో బీజింగ్ అణు పరీక్షలు చేసిందన్న అమెరికా
  • అగ్రరాజ్యం ఆరోపణలను తోసిపుచ్చిన బీజింగ్

గాల్వాన్ లోయ ఘర్షణల తర్వాత తాము అణ్వస్త్ర పరీక్షలు చేపట్టినట్టు అమెరికా చేసిన ఆరోపణలపై చైనా స్పందించింది. ఇందులో ఎలాంటి నిజం లేదని, తాను పరీక్షలు తిరిగి మొదలుపెట్టడానికి సాకులు చెబుతోందని బీజింగ్ ఆరోపించింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ వెల్లడించారు. గతవారం జెనీవాలో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన నిరాయుధీకరణ సదస్సులో అమెరికా మంత్రి థామస్ డినానో మాట్లాడుతూ.. చైనా 2020 జూన్ 22న ఒకటి సహా అణ్వాయుధ పరీక్షలు చేపట్టిందని, మరిన్ని భారీ పరీక్షలకు సిద్ధమైందని ఆరోపించారు.

ఈ ఆరోపణలపై లిన్ జియాన్ స్పందిస్తూ.. ‘‘చైనా ఆరోపణలు పూర్తిగా నిరాధరమైనవి.. ఇందులో ఎలాంటి నిజం లేదు.. మళ్లీ అణు పరీక్షలను ప్రారంభించడానికి అమెరికా సాకుల కోసం వెతుకుతున్న ప్రయత్నాలను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది’’ అని స్పష్టం చేశారు. అంతేకాదు, అమెరికా ఇలాంటి బాధ్యతయుతమైన చర్యలను తక్షణమే నిలిపివేయాలని ఆయన కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతేడాది అక్టోబరులో తామూ చైనా, రష్యాలతో సమానంగా అణ్వస్త్ర పరీక్షలు మొదలుపెడతామని అన్నారు. అయితే, అవి ఎటువంటి పరీక్షలు అనేది మాత్రం ఆయన వెల్లడించలేదు.

ప్రపంచ అణ్వాయుధ శక్తులైన అమెరికా, రష్యా మధ్య చివరి ఒప్పందం న్యూ START గడువు గత గురువారం ముగిసింది. అణ్వాయుధాలపై కొత్త పరిమితులను నిర్ణయించడానికి రష్యా, చైనాలతో త్రిముఖ చర్చలకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో డినాన్నో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, ఈ చర్చల్లో తాము పాల్గొనడానికి సిద్ధంగా లేమని చైనా ఇప్పటికే తోసిపుచ్చింది. లిన్ జియాన్ మాట్లాడుతూ ‘‘అమెరికా ఆయుధ నియంత్రణ, అంతర్జాతీయ భద్రత సహాయ మంత్రి థామస్ జి. డినాన్నో అణ్వాయుధ నియంత్రణ, వ్యూహాత్మక స్థిరత్వంపై బహుళ పక్ష చరల్లో పాల్గొనాలని చైనా కోరినట్లు వచ్చిన నివేదికలు మా దృష్టికి వచ్చాయి.. అలాగే, జెనీవాలో జరిగిన నిరాయుధీకరణ సమావేశంలో జూన్ 2020లో చైనా అణు పరీక్షలు నిర్వహించిందని ఆరోపించింది’’ అని అన్నారు.

అయితే, అమెరికా వైఖరి మాకు కొత్తేమీ కాదని, ఆ దేశం తమ అణు విధానాన్ని వక్రీకరిస్తూనే ఉందన్నారు. ఇది కేవలం అణ్వాయుధ నిరాయుధీకరణ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి అమెరికా ఆడుతోన్న రాజకీయ డ్రామా అని మండిపడ్డారు. అంతేకాదు, అంతర్జాతీయ అణు నిరాయుధీకరణ, ప్రపంచ వ్యూహాత్మక స్థిరత్వానికి ఆమెరికానే తూట్లు పొడుస్తోందని లిన్ దుయ్యబట్టారు. అణు నిరాయుధీకరణ విషయంలో అమెరికా తన ప్రత్యేక, ప్రాథమిక బాధ్యతలను ముందు నెరవేర్చాలని ఆయన చురకలంటించారు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • China - Nuclear Tests
  • China President Xi Jinping
  • China Rejects
  • Chinese President XI Jinping
  • Donal Trump
  • Galwan Clashes
  • Usa Allegations
  • xi jinping

Related News

Rahul Gandhi

రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్‌..సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!

Rahul Gandhi లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్ సభలో బీజేపీ ఓ నోటీసును ఫైల్ చేసినట్లు సమాచారం. అయితే, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయలేదని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రసంగించిన విషయం తెలిసిందే. రాహుల్ తన ప్రసంగంలో కేంద్ర ప్ర

  • China Space

    అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

Latest News

  • T20 ప్రపంచకప్‌లో చ‌రిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న టీమిండియా!

  • తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త..

  • తెలంగాణ లో వాలంటీర్ల నియామకం..రోజుకు రూ.1500 !!

  • బొత్స పై అచ్చెన్నాయుడు ఫైర్

  • గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా రహస్య అణు పరీక్షలు

Trending News

    • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

    • ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!

    • ఏప్రిల్ 1 నుండి మారనున్న ప్ర‌త్యేక‌ నిబంధనలు ఇవే!

    • రైల్వే ప్ర‌యాణికుల‌కు మ‌రో అదిరిపోయే సూప‌ర్ న్యూస్‌!

    • అర్జున్ టెండూల్క‌ర్‌ పెళ్లికి ప్ర‌ధాని మోదీ?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd