HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >T20 World Cup Zimbabwe Beat Australia By 23 Runs In Colombo

ఆస్ట్రేలియాకు భారీ షాక్ ఇచ్చిన జింబాబ్వే!

టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఆస్ట్రేలియాపై జింబాబ్వేకు ఇది రెండో విజయం. అంతకుముందు 2007లో ఆ జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది.

  • Author : Gopi Date : 13-02-2026 - 4:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Zimbabwe Beat Australia
Zimbabwe Beat Australia

Zimbabwe Beat Australia: టీ20 ప్రపంచ కప్‌లో జింబాబ్వే జట్టు మరోసారి చరిత్రను పునరావృతం చేస్తూ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. గ్రూప్-బిలో జరిగిన కీలక మ్యాచ్‌లో జింబాబ్వే 26 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఆస్ట్రేలియాకు ఈ ఓటమి ఊహించని షాక్ అని చెప్పాలి. జింబాబ్వే సాధించిన ఈ విజయంతో గ్రూప్-బి పాయింట్ల పట్టికలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. జింబాబ్వే ఇప్పుడు 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు సాధించగా, ఆస్ట్రేలియాకు సూపర్-8 దారి మరింత కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ తర్వాత గ్రూప్-బి పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

రెండో స్థానానికి చేరుకున్న జింబాబ్వే

ఆస్ట్రేలియాపై సాధించిన ఈ ఘనవిజయంతో జింబాబ్వే జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. జింబాబ్వే తన మొదటి మ్యాచ్‌లో ఒమన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించగా రెండో మ్యాచ్‌లో కంగారూలను ఓడించి సూపర్-8 వైపు బలమైన అడుగు వేసింది. ఈ ఓటమి తర్వాత ఆస్ట్రేలియాకు సూపర్-8 చేరడం కష్టంగా మారింది. ఇకపై ఆ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం 2 మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్‌లో ఉన్న ఒమన్, ఐర్లాండ్ జట్లు 2 మ్యాచ్‌ల్లో 2 ఓటములతో వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లో ఉన్నాయి.

Also Read: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..బిఆర్ఎస్ లో కాస్త జోష్ నింపింది ఆ మాజీ ఎమ్మెల్యేనే !!

జింబాబ్వే చారిత్రాత్మక విజయం

టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఆస్ట్రేలియాపై జింబాబ్వేకు ఇది రెండో విజయం. అంతకుముందు 2007లో ఆ జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 169 పరుగుల స్కోరు సాధించింది. జట్టు తరపున బ్రయాన్ బెన్నెట్ 64 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 146 పరుగులకే ఆలౌట్ కావడంతో జింబాబ్వేకు 23 పరుగుల విజయం దక్కింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • australia
  • sports news
  • T20 World Cup 2026
  • Zimbabwe
  • Zimbabwe Beat Australia

Related News

    Latest News

    • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

    • Venu Swamy: విజయ్-త్రిషపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్

    • Autism: ఆటిజం వ్యాధిని ఇలా గుర్తించండి!

    • NADA: టీమిండియా ఆటగాళ్లకు నోటీసులు

    • Tamil Nadu politics: హైదరాబాద్‌కు చేరుకున్న తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

    Trending News

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

      • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

      • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

      • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

      • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd