ట్రెక్కింగ్ అంటే మనకు ముందుగా దక్షిణ భారత దేశంలో ఉండే పర్వతాలే గుర్తొస్తాయి. అయితే మన హైదరాద్‌కు సమీపంలో ఎన్నో అద్భుత హిల్‌ స్టేషన్స్‌ ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? భాగ్యనగరానికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అడ్వెంచర్‌ ప్రదేశాలపై ఓ లుక్కేయండి..

అనంతగిరి హిల్స్‌: ప్రకృతి రమణీయతకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన అనంతగిరి కొండలు వికారాబాద్‌ జిల్లాలో ఉన్నాయి. హైదరబాద్‌కు కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశం ట్రెక్కింగ్‌కు అడ్డగా మారింది. 

భువనగిరి కోట: హైదరాబాద్‌కు 100 కిలో మీటర్ల దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో 610 మీటర్ల ఎత్తైన ఏకశిల రాతి గుట్టపై ఈ ప్రాచీన కట్టడాన్ని నిర్మించారు. 500 అడుగుల ఎత్తులో 40 ఎకరాల విస్తరించి ఉన్న ఈ కొండ ట్రెక్కింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

దేవరకొండ: వందల ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉన్న దేవరకొండ కోట హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవరకొండ కోటను 13వ శతాబ్ధంలో ఎత్తైన కొండపై నిర్మించారు. ఇటీవల ప్రాధాన్యతను దక్కించుకున్న ఈ చారిత్రక కట్టడం ప్రస్తుతం ట్రెక్కింగ్‌కు అడ్డాగా మారింది.

రాచకొండ కోట: చారిత్రక సంపదకు, ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా ఉండే ఈ ప్రదేశం హైదరాబాద్‌ నుంచి కేవలం 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంతో ఎత్తైన కొండపై ఈ కోటను అద్భుతంగా నిర్మించారు. ముఖ్యంగా ట్రెక్కింగ్ ప్రియులకు ఈ పర్వతాలు ఎంతో అనుకూలంగా ఉన్నాయని చెప్పాలి.