HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Uan Number Recovery Process

పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

OTP వెరిఫికేషన్ పూర్తయ్యాక మీ పేరు, పుట్టిన తేదీ, ఆధార్ లేదా పాన్ కార్డ్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలను అడుగుతుంది. మీరు ఇచ్చిన సమాచారం సరైనదైతే మీ UAN నంబర్ వెంటనే స్క్రీన్‌పై కనిపిస్తుంది.

  • Author : Gopi Date : 02-02-2026 - 5:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
EPFO
EPFO

UAN Number: ఉద్యోగస్తులకు పిఎఫ్ అనేది కేవలం పొదుపు మాత్రమే కాదు. అది వారి భవిష్యత్తుకు భద్రత. అయితే తరచుగా ఉద్యోగాలు మారడం లేదా చాలా కాలం పాటు అకౌంట్‌ను ఉపయోగించకపోవడం వల్ల చాలామంది తమ UAN (Universal Account Number) మర్చిపోతుంటారు. అటువంటప్పుడు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా లేదా డబ్బు విత్‌డ్రా చేయాలన్నా ఇబ్బందులు ఎదురవుతాయి.

మంచి విషయం ఏమిటంటే.. ఇప్పుడు EPFO మర్చిపోయిన UAN నంబర్‌ను తిరిగి పొందడానికి చాలా సులభమైన పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది. మీరు ఇంట్లోనే కూర్చుని మొబైల్ ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే మీ UAN నంబర్‌ను రికవర్ చేసుకోవచ్చు.

UAN నంబర్ మర్చిపోతే ఏం చేయాలి?

UAN అనేది ప్రతి పీఎఫ్ అకౌంట్ హోల్డర్‌కు చాలా ముఖ్యమైన నంబర్. మీ పీఎఫ్ అకౌంట్ మొత్తం దీనితోనే ముడిపడి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ నంబర్ మర్చిపోయినట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. EPFO కల్పిస్తున్న ఆన్‌లైన్ రికవరీ సదుపాయం ద్వారా దీన్ని తిరిగి పొందవచ్చు.

Also Read: టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

EPFO వెబ్‌సైట్ ద్వారా UAN పొందే విధానం

UAN రికవర్ చేయడానికి మీరు ఏ ఆఫీసు చుట్టూ లేదా ఏజెంట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ పీఎఫ్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది.

  • మొదట EPFO అధికారిక వెబ్‌సైట్ unifiedportal-mem.epfindia.gov.inకి వెళ్ళండి.
  • అక్కడ మీకు “Know your UAN” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • ఆ తర్వాత మీ మొబైల్‌కు ఒక OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయండి.
  • వివరాలు నమోదు చేయగానే స్క్రీన్‌పై UAN కనిపిస్తుంది

OTP వెరిఫికేషన్ పూర్తయ్యాక మీ పేరు, పుట్టిన తేదీ, ఆధార్ లేదా పాన్ కార్డ్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలను అడుగుతుంది. మీరు ఇచ్చిన సమాచారం సరైనదైతే మీ UAN నంబర్ వెంటనే స్క్రీన్‌పై కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ నంబర్‌ను మీ మొబైల్‌కు SMS ద్వారా కూడా పంపిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం కేవలం రెండు మూడు నిమిషాల్లో పూర్తవుతుంది.

UAN నంబర్ ఎందుకు అంత ముఖ్యం?

  • UAN నంబర్‌ను పీఎఫ్ ఖాతాకు ‘తాళం చెవి’ వంటిదని చెప్పవచ్చు.
  • దీని ద్వారా మీరు PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
  • ఆన్‌లైన్‌లో డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • ఉద్యోగం మారినప్పుడు పాత పీఎఫ్ అకౌంట్‌ను కొత్త అకౌంట్‌కు అనుసంధానం చేయవచ్చు.
  • మీ ఖాతాలో ఎప్పుడు ఎంత డబ్బు జమైందో తెలుసుకోవచ్చు.

ఇకపై ATM ద్వారా కూడా పీఎఫ్ డబ్బు విత్‌డ్రా!

EPFO తన సేవలను నిరంతరం డిజిటలైజ్ చేస్తూ సులభతరం చేస్తోంది. ఒకప్పుడు పీఎఫ్ వివరాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు దాదాపు అన్ని పనులు ఆన్‌లైన్‌లోనే అయిపోతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. త్వరలో ప్రజలు తమ పీఎఫ్ ఖాతాలోని డబ్బును నేరుగా ATM మెషిన్ ద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయం రానుంది. అంటే బ్యాంక్ అకౌంట్ లాగే పీఎఫ్ డబ్బును కూడా ఏటీఎం నుంచి తీసుకోవచ్చు. ఈ సదుపాయం జనవరి నుండి ప్రారంభం కావచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక తేదీ వెల్లడి కావాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • business news
  • epfo
  • PF Account
  • UAN Number
  • UAN Number Recovery

Related News

    Latest News

    • US Prepping Iran Attack Again : ఇరాన్ పై మరోసారి దాడికి సిద్దమైన అమెరికా ?

    • Electricity Charges : విద్యుత్ ఛార్జీల పెంపు పై కీలక అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

    • GST : ఏప్రిల్ GST వసూళ్లలో రికార్డ్

    • Soap & Shampoo Price : సామాన్య ప్రజలపై మరో పిడుగు..భారీగా పెరిగిన సబ్బులు, షాంపూల ధరలు

    • Balayya : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్య-కొరటాల కాంబో ఫిక్స్

    Trending News

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd