HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Warangal City Residents Placed 4 46 Lakh Chicken Biryani Orders In A Year

వామ్మో ..వరంగల్ నగర వాసులు ఏడాది లో 4.46 లక్షల చికెన్ బిర్యానీ ఆర్డర్లు పెట్టారట !!

ఓరుగల్లు నగరం రుచుల వేటలో తన ప్రత్యేకతను చాటుకుంది. ముఖ్యంగా చికెన్ బిర్యానీ పట్ల వరంగల్ ప్రజలకున్న మక్కువ అసాధారణంగా కనిపిస్తోంది. గడిచిన ఏడాదిలో ఏకంగా 4.46 లక్షల చికెన్ బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి

  • Author : Sudheer Date : 03-02-2026 - 1:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Biryani Orders In Warangal
Biryani Orders In Warangal

Biryani Orders in Warangal : వరంగల్ నగర వాసుల భోజన ప్రియత్వం 2025లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఓరుగల్లు నగరం రుచుల వేటలో తన ప్రత్యేకతను చాటుకుంది. ముఖ్యంగా చికెన్ బిర్యానీ పట్ల వరంగల్ ప్రజలకున్న మక్కువ అసాధారణంగా కనిపిస్తోంది. గడిచిన ఏడాదిలో ఏకంగా 4.46 లక్షల చికెన్ బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి అంటే, సగటున రోజుకు 1222 ప్లేట్లు ఖాళీ అయ్యాయన్నమాట. బిర్యానీతో పాటు వెజ్ దోస, ఇడ్లీ మరియు వెజ్ బిర్యానీలు కూడా నగరవాసుల టాప్-5 ఇష్టమైన వంటకాల జాబితాలో చేరి, వరంగల్ వైవిధ్యభరితమైన ఆహారపు అలవాట్లను ప్రతిబింబిస్తున్నాయి.

నగరంలో ఆహారపు ఆర్డర్ల గమనిస్తే, పార్టీ ప్రియులు మరియు అర్థరాత్రి భోజన ప్రియుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అర్థమవుతోంది. ఒక కస్టమర్ ఒకే ఆర్డర్‌లో ఏకంగా రూ. 13,778 విలువైన 37 ప్లేట్ల వివిధ రకాల బిర్యానీలు, ఫ్రైడ్ రైస్ మరియు స్టార్టర్లను ఆర్డర్ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. అలాగే, అర్ధరాత్రి వేళల్లో (12 AM నుండి 2 AM వరకు) ఆర్డర్లు 118 శాతం వృద్ధి చెందడం గమనార్హం. ఈ సమయంలో చికెన్ షావర్మ, బర్గర్లు మరియు పిజ్జాల కంటే బిర్యానీకే జనం ఎక్కువగా ఓటు వేశారు. ఇక తీపి పదార్థాల విషయానికి వస్తే, డార్క్ చాక్లెట్ ఐస్ క్రీమ్ మరియు చాక్లెట్ కేకులు వరంగల్ వాసుల మనసు గెలుచుకున్నాయి.

ఉదయం వేళల్లో వరంగల్ నగరం సంప్రదాయ రుచులకే ప్రాధాన్యతనిచ్చింది. ప్రతిరోజూ 200 ప్లేట్లకు పైగా ఇడ్లీ ఆర్డర్లు స్విగ్గీ ద్వారా వెళ్లడం, దక్షిణాది అల్పాహారంపై ఉన్న మక్కువను తెలియజేస్తోంది. ఇడ్లీతో పాటు దోస, వడ, బోండాలు నగరవాసుల ఉదయపు ఇష్టమైన వంటకాలుగా నిలిచాయి. కేవలం ఖరీదైన హోటల్స్ మాత్రమే కాకుండా, ’99 స్టోర్’ వంటి సరసమైన ధరల్లో లభించే ఆప్షన్లకు కూడా విపరీతమైన ఆదరణ లభించింది. సాయంత్రం వేళల్లో కూడా చికెన్ బర్గర్లు, మంచూరియా వంటి స్నాక్స్ కంటే బిర్యానీ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపడం చూస్తుంటే, వరంగల్ అంటేనే బిర్యానీలకు అడ్డాగా మారిందని స్పష్టమవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • biryani
  • Biryani Orders
  • Swiggy
  • swiggy orders 2025
  • Warangal City

Related News

Vijay Rashmika Wedding Food

Vijay – Rashmika Wedding Food Menu : విజయ్-రష్మిక పెళ్లి విందులో అదరగొట్టిన తెలంగాణ వంటకాలు

వేదిక రాజస్థాన్ అయినప్పటికీ, విందు భోజనంలో మాత్రం పక్కా తెలంగాణ మరియు కర్ణాటక రుచులు ఘమఘమలాడాయి. తమ మూలాలను మర్చిపోకుండా, అతిథులకు ఇరు రాష్ట్రాల సంప్రదాయ వంటకాలను వడ్డించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు ఈ కొత్త దంపతులు.

  • Gig Workers

    తెలంగాణలోని గిగ్‌ వర్కర్లకు గుడ్‌న్యూస్..

Latest News

  • ప‌చ్చి బొప్పాయి తింటున్నారా? అయితే ఆ స‌మ‌స్య తీరిన‌ట్లే!

  • బాధ‌లోనూ జ‌ట్టులో చేర‌నున్న రింకూ సింగ్‌!

  • ఐపీఎల్ 2026.. మార్చి 29న తొలి మ్యాచ్‌?!

  • భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?

  • హీరో విజ‌య్‌కు ఎఫైర్‌.. విడాకులు కోరిన భార్య‌!?

Trending News

    • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

    • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

    • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd