HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For School And College Students In Andhra Pradesh

ఏపీలోని స్కూల్, కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..

  • Author : Vamsi Chowdary Korata Date : 04-02-2026 - 2:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
andhra pradesh government Aadhaar Special Camps in schools
andhra pradesh government Aadhaar Special Camps in schools

Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ పిల్లలతో పాటుగా కాలేజీ పిల్లలకు మరో అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఇంకా ఎవరైనా పిల్లలు ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే.. వెంటనే చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 2 నుంచి 6 వరకు.. ఈ నెల 16 నుంచి 20 వరకు ఆధార్ స్పెషల్ క్యాంపుల్ని నిర్వహిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్, కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా మరోసారి స్కూల్స్, ఇంటర్ కాలేజీల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. గతేడాది నుంచి ఈ క్యాంపులు నిర్వహిస్తున్నా సరే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేయలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం మరోసారి క్యాంపులు నిర్వహిస్తోంది. ఈ నెల 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఆధార్ క్యాంపుల్ని స్కూల్స్, కాలేజీల్లో నిర్వహిస్తున్నారు. రెండో విడతగా ఈ నెల 16వ తేదీ నుంచి 20 తేదీ వరకు కూడా మరోసారి అవకాశం కల్పించారు.

రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్, కాలేజీల్లో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది (గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది) ఈ ఆధార్ స్పెషల్ క్యాంపుల్ని నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల నుంచి 17 ఏళ్ల వరకు పిల్లలకు ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత మొదటిసారి బయోమెట్రిక్ అప్డేట్ చేస్తే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు.. పూర్తిగా ఉచితం. పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, మిగిలిన మార్పులు/చేర్పులకు కేంద్రం నిర్ణయించిన నామమాత్రంగా ఫీజులు వసూలు చేస్తారు. వెంటనే తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పిల్లల ఆధార్ కార్డుల్ని అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

గతేడాది అక్టోబర్ నుంచి ఈ స్పెషల్ ఆధార్ క్యాంపుల్ని నిర్వహిస్తోంది. ప్రతి నెలలో రెండు విడతలుగా క్యాంపులు ఏర్పాటు చేసినా సరే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల ఆధార్ కార్డుల్ని అప్డేట్ చేయడం లేదు.. అందుకే ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది. ఒకవేళ ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి అంటున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలతో పాటుగా మరికొన్ని కీలక విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు. అందుకే వెంటనే పిల్లల ఆధార్‌లను అప్డేట్ చేయాలని సూచిస్తున్నారు.

మరోవైపు తెలంగాణలో కూడా ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్లకు సంబంధించిన వివరాలను , ఎంఈవోలను సంప్రదించి తెలుసుకోవచ్చు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విద్యార్థులు ఆధార్‌ను అప్డేట్ చేసుకోవడానికి ఆధార్ సెంటర్‌కు వెళ్లే పని లేకుండా స్కూల్స్, కాలేజీల్లోనే ఏర్పాట్లు చేశారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aadhaar Card Details Update
  • Aadhaar Card free Update
  • Aadhaar Special Camps
  • andhra pradesh government
  • schools and colleges

Related News

Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

Andhra Pradesh: ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. శాంతిభద్రతలను మెరుగుపరచడం, పోలీస్ వ్యవస్థను అధునీకరించేందుకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్తగా తిరుపతి, గుంటూరు, రాజమండ్రిని పోలీస్ కమిష

    Latest News

    • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

    • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

    • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

    • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

    • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd