HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >President Trump Just Spoke With Prime Minister Modi

ప్ర‌ధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌!

భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోని సమయంలోనే ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Author : Gopi Date : 02-02-2026 - 9:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trump- PM Modi
Trump- PM Modi

Trump- PM Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ ద్వారా సంభాషించారు. ఈ విషయాన్ని భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన చర్చకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన ప్రస్తుతానికి వెల్లడించలేదు. ఈ విషయంలో మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండాలని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Also Read: టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోని సమయంలోనే ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు దేశాల మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరబోతోందని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు.

మార్చి 2025 నుండి భారత్- అమెరికా ఒక సమగ్ర వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నాయి. అయితే, గత ఏడాది కాలంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

భారతీయ ఎగుమతులపై 50% టారిఫ్

గత ఏడాది ఆగస్టు (2025) నుండి అమెరికా భారతీయ వస్తువుల ఎగుమతులపై మొత్తం 50% భారీ టారిఫ్ (సుంకం) విధించింది. ఇది ప్రపంచంలోనే ఏ దేశంపైనా లేనంత అత్యధిక సుంకం కావడం గమనార్హం. ఈ 50% సుంకంలో 25 శాతం కేవలం భారత్ రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేస్తున్నందున ‘పెనాల్టీ’గా విధించబడింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఉన్న ఆంక్షలను భారత్ పట్టించుకోవడం లేదన్న కారణంతో అమెరికా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Mobile Talk
  • President Trump
  • prime minister modi
  • twitter
  • world news

Related News

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd