భారత్‌తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్.. యూరప్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన అమెరికా
- Author : Vamsi Chowdary Korata
Date : 29-01-2026 - 11:37 IST
Published By : Hashtagu Telugu Desk
India-EU Trade Deal భారత్‌తో యూరప్ సమాఖ్య (ఈయూ) కుదుర్చుకున్న కొత్త వాణిజ్య ఒప్పందంపై అమెరికా తీవ్రంగా మండిపడింది. ఈయూ తన వాణిజ్య ప్రయోజనాల కోసం ఉక్రెయిన్ ప్రజలకు ఇస్తున్న మద్దతును పక్కనపెట్టిందని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెస్సెంట్ ఆరోపించారు. తాజాగా భారత్, ఈయూ మధ్య ఖరారైన ఈ ఒప్పందంపై ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.
సీఎన్బీసీతో మాట్లాడుతూ బెస్సెంట్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురుతో భారత్‌లో తయారైన శుద్ధి చేసిన ఉత్పత్తులను యూరప్ దేశాలు కొనుగోలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. గతేడాది భారత్‌పై అమెరికా విధించిన 25 శాతం అదనపు సుంకాలను తమతో కలిసి విధించడానికి యూరప్ నిరాకరించిందని, ఇందుకు కారణం భారత్‌తో ఈ వాణిజ్య ఒప్పందం చేసుకోవాలనే వారి కోరిక అని ఆయన స్పష్టం చేశారు.
“యూరప్ తీరు చాలా నిరాశపరిచింది. ఉక్రెయిన్ ప్రజల ప్రాముఖ్యత గురించి యూరప్ నేతలు మాట్లాడటం మీరు విన్న ప్రతిసారీ, వారు వాణిజ్యాన్ని ఉక్రెయిన్ ప్రజల కంటే ముందుంచారని గుర్తుంచుకోండి” అని బెస్సెంట్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ ఒప్పందాన్ని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా అభివర్ణించారు. ఈ ఒప్పందంతో ఇరుపక్షాల మధ్య 97 శాతం వస్తువులపై సుంకాలు రద్దవుతాయని, 2032 నాటికి భారత్‌కు ఈయూ ఎగుమతులు రెట్టింపు కావచ్చని బ్రస్సెల్స్ తెలిపింది. ట్రంప్ రెండో పర్యాయం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా, యూరప్ మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో బెస్సెంట్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Tags
- america
- Europe America trade
- European Union
- India European Union
- India Russia oil imports
- India trade deal
- India-EU Trade Deal
- India-European Union Agreement
- russia oil imports
- Russia Vs Ukraine War
- Russia-Ukraine War
- Scott Bessent
- Trade Tariffs
- ukraine war
- Ursula von der Leyen
- US trade policy
- US trade tariffs