HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >T20 World Cup 2026 Closing Ceremony

ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

ఐసీసీ విడుదల చేసిన అప్‌డేట్ ప్రకారం.. రికీ మార్టిన్‌తో పాటు మరో ఇద్దరు భారతీయ సింగర్ల పేర్లు కూడా ఉన్నాయి. వారు సుఖ్బీర్, ఫాల్గుణి పాఠక్.

  • Author : Gopichand Date : 07-03-2026 - 3:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
T20 World Cup 2026
T20 World Cup 2026

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ మార్చి 08, ఆదివారం నాడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ పోరుకు ముందు టోర్నమెంట్ ‘క్లోజింగ్ సెర్మనీ’ (ముగింపు వేడుక) నిర్వహించనున్నారు. ఇందులో అంతర్జాతీయ స్టార్లు తమ ప్రదర్శనతో అలరించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) క్లోజింగ్ సెర్మనీలో ప్రదర్శన ఇవ్వబోయే కళాకారుల జాబితాను విడుదల చేసింది. ఇందులో అంతర్జాతీయ పాప్ సింగర్ రికీ మార్టిన్ పేరు కూడా ఉంది.

ఐసీసీ అప్‌డేట్

ఐసీసీ విడుదల చేసిన అప్‌డేట్ ప్రకారం.. రికీ మార్టిన్‌తో పాటు మరో ఇద్దరు భారతీయ సింగర్ల పేర్లు కూడా ఉన్నాయి. వారు సుఖ్బీర్, ఫాల్గుణి పాఠక్. ఐసీసీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఇలా రాసింది.వేదిక మరింత పెద్దదిగా మారుతోంది! టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు జరిగే క్లోజింగ్ సెర్మనీలో గ్లోబల్ సూపర్ స్టార్ రికీ మార్టిన్‌తో పాటు సంగీత దిగ్గజాలు సుఖ్బీర్, ఫాల్గుణి పాఠక్ కూడా చేరనున్నారు! క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద రాత్రి ఈ దిగ్గజ కళాకారులు తమ ప్రదర్శనతో మెప్పించనున్నారు. కాబట్టి గ్లోబల్ హిట్ సాంగ్స్, దేశీ పాటల కోసం సిద్ధంగా ఉండండి అని ట్వీట్ చేసింది.

Also Read: ప్రజా రాజధాని అమరావతిలో అంతర్జాతీయ న్యాయ వర్సిటీ

🎤 The stage keeps getting bigger!
Joining Global Superstar Ricky Martin at the Closing Ceremony before the #T20WorldCup Final are music icons Sukhbir and Falguni Pathak!

Get ready for global hits and desi anthems as these legendary artists light up the biggest night in cricket.… pic.twitter.com/8kMK7yg31b

— ICC (@ICC) March 7, 2026

క్లోజింగ్ సెర్మనీ ఎప్పుడు మొదలవుతుంది?

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అంతకంటే ముందు సాయంత్రం 5:30 గంటల నుండి క్లోజింగ్ సెర్మనీ మొదలవుతుంది. ఈ వేడుకలో ముగ్గురు సింగర్ల ప్రదర్శనను చూడవచ్చు.

ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన భారత్

సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమ్ ఇండియా సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇప్పుడు ఫైనల్‌లో భారత్- న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత జట్టు వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. గత 2024 టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమ్ ఇండియా టైటిల్ నెగ్గింది. మరి ఈసారి భారత జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడటం ఆసక్తికరంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • closing ceremony
  • ICC
  • Ind vs NZ
  • sports news
  • T20 World Cup 2026

Related News

Arjun Tendulkar

పెళ్లయిన 24 గంటల్లోనే మైదానంలోకి అర్జున్ టెండూల్కర్!

డీవై పాటిల్ టీ20 కప్‌లో అర్జున్ 'డీవై పాటిల్ బ్లూ' జట్టు తరపున ఆడుతున్నాడు. పెళ్లి జరిగిన మరుసటి రోజే అంటే శుక్రవారం (మార్చి 06) ముంబై కస్టమ్స్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో అతను బరిలోకి దిగాడు.

  • T20 World Cup

    టీ20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్‌.. వ‌ర్షం ప‌డితే విజేత ఎవ‌రో తెలుసా?!

  • India vs New Zealand

    టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

  • ICC Chairman Jay Shah

    మ‌రోసారి మంచి మ‌న‌సు చాటుకున్న జై షా!

  • Abhishek Sharma

    టీమ్ ఇండియా ఫైనల్లోకి.. ఫామ్ లేమితో సతమతమవుతున్న అభిషేక్ శర్మ!

Latest News

  • ఇకపై దాడులు ఉండవు..పొరుగు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడి క్షమాపణలు

  • జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనం.. తేల్చి చెప్పిన కాగ్ నివేదిక

  • వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

  • ప్రపంచ కుబేరుల తయారీలో భారత్ రికార్డు!

  • ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

Trending News

    • ఏ కారు కొంటే మంచిది?!

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

    • 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

    • 23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd