HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Top 3 Female Billionaire Representatives In The Country All The First Three Places Are Ap Mlas

దేశంలో టాప్ 3 మహిళా బిలియనీర్ ప్రజాప్రతినిధులు.. మొదటి మూడు ప్లేసులూ ఏపీ ఎమ్మెల్యేలవే

  • Author : Vamsi Chowdary Korata Date : 09-03-2026 - 3:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Mlas
Ap Mlas

దేశ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం, వారి ఆర్థిక స్థితిగతులపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ప్రజాప్రతినిధుల్లో (ఎంపీలు, ఎమ్మెల్యేలు) 14 మంది బిలియనీర్లు ఉండగా, వీరిలో అత్యంత సంపన్నుల జాబితాలో తొలి మూడు స్థానాలనూ ఏపీకి చెందిన ఎమ్మెల్యేలే కైవసం చేసుకోవడం గమనార్హం. వీరిలో టీడీపీకి చెందిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రూ.716 కోట్ల ఆస్తితో దేశంలోనే అత్యంత సంపన్న మహిళా ప్రజాప్రతినిధిగా మొదటి స్థానంలో నిలిచారు.
Tdp

Tdp

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏడీఆర్ ‘విమెన్ పొలిటికల్ పార్టిసిపేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియా’ పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఈ విశ్లేషణ చేసింది. ఈ నివేదిక ప్రకారం రూ.716 కోట్ల ఆస్తితో ప్రశాంతి రెడ్డి మొదటి స్థానంలో ఉండగా, కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డి రూ.388 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో ఉన్నారు. ఇక, నెల్లిమర్ల నుంచి గెలిచిన జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి రూ.291 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. ఈ 14 మంది మహిళా బిలియనీర్ల మొత్తం ఆస్తి విలువ రూ.8,234 కోట్లుగా ఏడీఆర్ పేర్కొంది.

ఈ నివేదిక చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 4,666 మంది ప్రజాప్రతినిధుల్లో (ఎంపీలు, ఎమ్మెల్యేలు) మహిళలు కేవలం 464 మంది (10 శాతం) మాత్రమే ఉన్నారని తెలిపింది. లోక్‌సభలోని 543 మంది ఎంపీలలో 74 మంది మహిళలు ఉండగా, దేశంలోని 4,123 మంది ఎమ్మెల్యేలలో 390 మంది మహిళలున్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విషయంలోనూ ఏడీఆర్ ఆసక్తికరమైన పోలికను చూపింది. ఏపీలో ఉన్న 24 మంది మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి రూ.74 కోట్లుగా ఉండగా, తెలంగాణలోని 11 మంది మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి కేవలం రూ.14 కోట్లుగానే ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. మొత్తం మీద ఒకవైపు మహిళా ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నప్పటికీ, రాజకీయాల్లో ఉన్న కొద్దిమంది మహిళల్లో కొందరు అత్యంత సంపన్నులుగా ఉండటం ఈ నివేదిక ద్వారా స్పష్టమైంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AAP MLAs
  • ADR report
  • Indian Parliament
  • lok sabha
  • Lokam Nagamadhavi
  • Reddeppagari Madhavi Reddy
  • Richest female politicians India
  • Vemireddy Prasanthi Reddy
  • Women billionaires
  • Women in politics India

Related News

    Latest News

    • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

    • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

    • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

    Trending News

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd