HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ai Services In 18 Government Hospitals In Ap

ఏపీలో 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సేవలు

  • Author : Vamsi Chowdary Korata Date : 09-03-2026 - 10:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AI Services In AP Government Hospitals
AI Services In AP Government Hospitals

Government Hospitals  ఏపీ ప్రభుత్వం ఏఐ సాయంతో వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. 18 ప్రభుత్వాసుపత్రుల్లో సుమారు 40 పరికరాల ద్వారా పైలట్ ప్రాజెక్టు కింద సరికొత్త ఆవిష్కరణల ద్వారా వైద్య సేవల్లో కీలకమైన స్క్రీనింగ్, కన్ఫర్మేషన్ పరీక్షలు చేస్తున్నారు. ఈ మేరకు తక్కువ సమయంలో వ్యాధులు ఖరారు చేయడం, అత్యుత్తమ వైద్యం అందిచొచ్చని చెబుతున్నారు అధికారులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 18 స్టార్టప్ సంస్థలతో కలిసి వైద్య పరీక్షలు, ఇతర సేవల్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏఐ సేవలతో అతి తక్కువ సమయంలో వ్యాధి నిర్ధారణ, రోగులకు చికిత్స అందించే సమయం కూడా ఆదా అవుతుందంటున్నారు. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రులు.. పార్వతీపురం, రాజానగరం, సిద్థార్థ మెడికల్‌ కాలేజీ, సత్తెనపల్లి ప్రాంతీయ ఆసుపత్రి, తెనాలిలోని జిల్లా ఆస్పత్రి, ఇతర చోట్ల పైలట్‌ ప్రాజెక్టు విధానంలో ఈ సేవల్ని ప్రారంభించారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా వీటి ఫలితాలను విశ్లేషించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదక ఇస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు.

వ్యాధుల్ని ప్రాథమిక పరీక్షలతో గుర్తించి.. తక్కువ సమయంలో మెరుగైన వైద్యసేవలు అందించొచ్చు. డాక్టర్లు, పేషెంట్ల మధ్య సంభాషణ రికార్డు చేస్తారు ఏఐ అప్లికేషన్ల సాయంతో పరీక్షలు చేసి ప్రాథమిక దశలోనే సమస్యల్ని గుర్తిస్తున్నారు. ఆయా ఆస్పత్రుల్లో క్యాన్సర్ గుర్తింపు, క్షయను గుర్తించడానికి, షుగర్, కిడ్నీ, థైరాయిడ్, రక్తపరీక్షలు కూడా ఏఐ ఆధారిత పరికరాలతో చేస్తున్నారు. గుండె సమస్యలు, ఐసీయూలో ఉన్నవారికి బీపీ, పల్స్, టెంపరేచర్, ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షణ లాంటి మరికొన్ని చోట్లో అందుబాటులో ఉన్నాయి. ఏఐ సాయంతో ఏపీ ప్రభుత్వం వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు మంత్రి సత్యకుమార్. రాష్ట్రంలో ఎంపి క చేసిన 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒకేసారి 40 పరికరాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు.

విశాఖపట్నంలో ‘పింక్‌ సఖి శారీ వాక్‌’ నిర్వహించారు.. క్యాన్సర్‌పై అవగాహన కలిగించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వాక్‌ను రాహుల్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు బీచ్‌ రోడ్డులో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ వాక్‌కు సినీ నటి, లైఫ్‌ ఎగైన్‌ సంస్థ వ్యవస్థాపకురాలు గౌతమి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఈ అవగాహన ర్యాలీలో నగరానికి చెందిన మహిళలు భారీగా పాల్గొన్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AI in healthcare
  • Ai Services
  • Andhrapradesh
  • Andhrapradesh Govt
  • AP CM Chandrababu
  • Artificial Intelligence (AI)
  • Cervical cancer screening
  • government hospitals
  • Healthcare Technology
  • Minister Satya Kumar Yadav
  • TB detection

Related News

AP government takes another key decision

CM Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

జులై 11న జరగబోయే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని (World Population Day) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మరియు ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా జనాభా నియంత్రణపై అవగాహన కల్పించే ఈ రోజున, ఏపీ ప్రభుత్వం భిన్నంగా ఎక్కువ మంది సంతానం ఉన్న కుటుంబాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన మ

    Latest News

    • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

    • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

    • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

    • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

    • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd