HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Oil Shocks Stock Markets Sensex Collapses

స్టాక్‌మార్కెట్లకు చమురు సెగ.. కుప్పకూలిన సెన్సెక్స్

  • Author : Vamsi Chowdary Korata Date : 09-03-2026 - 10:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Market Crash
Market Crash

Sensex  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో చమురు ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 2400 పాయింట్ల మేర పడిపోయింది. నిఫ్టీ 24000 దిగువకు చేరింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఆరంభంలోనే ఏకంగా రూ. 12 లక్షల కోట్లు ఆవిరైపోయింది. కీలక రంగాల్లోని షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. మార్చి 9వ తేదీన మార్కెట్ పరిస్థితుల గురించి ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఇండియన్ స్టాక్ మార్కెట్లు సోమవారం రోజు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 3 శాతం మేర పడిపోయాయి. గతవారం నష్టాలను కొనసాగిస్తూ ఈరోజు సైతం భారీ నష్టాలతో ట్రేడింగ్ మొదలు పెట్టాయి. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 100 డాలర్లు దాటింది. అలాగే భారతీయ రూపాయి మారకం విలువ సైతం తగ్గడం మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో సెన్సెక్స్ ఆరంభంలోనే 2400 పాయింట్లు కోల్పోయి ఇంట్రాడే కనిష్ఠ స్థాయి 76,424 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఇక నిఫ్టీ 50 సూచీ 700 పాయింట్లకు పైగా నష్టంతో 23,750 పాయింట్ల వద్దకు దిగజారింది.

మదుపరుల సంపదగా భావించే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలోని నమోది కంపెనీల మార్కెట్ విలువ ఆరంభంలోనే భారీ అమ్మకాలతో ఏకంగా రూ.12.39 లక్షల కోట్లు ఆవిరైపోయింది. కేవలం 10 నిమిషాల్లోని మొత్తం కంపెనీల విలువ భారీకో కోసుకుపోయి రూ.437 లక్షల కోట్లకు దిగివచ్చింది. సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో ఇండిగో కంపెనీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. దాదాపు 8 శాతం మేర పడిపోవడం గమనార్హం. ఆ తర్వాత టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, ఎటెర్నల్ షేర్లు దాదాపు 5 శాతం చొప్పున పతనమై నష్టాలు మూటగట్టుకున్నాయి. సెక్టార్ల వారిగా చూసుకుంటే జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 5 శాతానికి పైగా పడిపోయింది. దీంతో అత్యధికంగా నష్టపోయిన సెక్టార్‌గా నిలిచింది. నిఫ్టీ ఆటో సెక్టార్ 4 శాతం పడిపోయింది. ఇక నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచీలు 3 శాతం చొప్పున పడిపోయాయి.

కారణాలు ఇవే

ఇరాన్- యూఎస్ యుద్ధంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఆయిల్ రవాణాకు ఆటంకం ఏర్పడడంతో ధరలు భారీగా పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ 30 శాతం పెరిగి బ్యారెల్ ధర 118.21 డాలర్లకు పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ధర 27 శాతం పెరిగి బ్యారెల్ రేటు 118.22 డాలర్లకు చేరింది. 2022లో ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత ఈ స్థాయిలో ముడి చమురు ధర పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రపంచ ఇంధన సరఫరాలో 20 శాతం హార్ముజ్ జలసంధి నుంచే రవాణా జరుగుతోంది. ఇప్పుడు ఇక్కడ ఆంక్షలు ఉండడంతో చాలా వరకు నౌకలు చిక్కుకుపోయాయి. ఆ ప్రభావం మార్కెట్లపై కనిపిస్తోంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Indian stock market fall
  • Market Crash
  • Nifty
  • sensex
  • Sensex Today
  • Stock Market Crash
  • Stock Market Crash Today

Related News

Stock Market

Stock Market: ట్రంప్ ప్రకటనతో.. భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

అమెరికా, ఇరాన్ మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడటంతో సూచీలు పరుగులు పెట్టాయి. ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1303 పాయింట్లు (1.70%) పెరిగి 78,150.54 వద్దకు చేరగా, నిఫ్టీ 392 పాయింట్లు (1.61%) లాభపడి 24,237.70 వద్ద ట్రేడ్ అయింది. ఇరాన్‌తో వివాదం ముగింపు దశకు రావొచ్చని అమెరికా అధ్యక్షుడు డొన

  • Pakistan stock markets crash

    యుద్ధం ఎఫెక్ట్‌తో కుప్పకూలిన పాకిస్థాన్ స్టాక్ మార్కెట్

Latest News

  • Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

  • పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

  • Gold Rate : మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు

  • Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd