HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Indecent Videos With A Young Woman In The Name Of Chance In A Web Series

వెబ్‌సిరీస్‌లో ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య వీడియోలు

  • Author : Vamsi Chowdary Korata Date : 07-03-2026 - 2:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Girl Harassment
Girl Harassment

Kakinada Girl  సినిమాల్లో అవకాశాల పేరిట యువతులను మోసం చేస్తున్న ముఠాల ఉదంతాలు హైదరాబాద్‌లో మరోసారి కలకలం రేపుతున్నాయి. వెబ్ సిరీస్ ఆడిషన్ పేరుతో ఒక యువతిని నమ్మించి, అసభ్యకర వీడియోలు చిత్రీకరించి వేధిస్తున్న ఒక డైరెక్టర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

కేసు వివరాల్లోకి వెళితే… ఏపీలోని కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతి సినీ రంగంపై ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చి, యూసుఫ్‌గూడలోని తన స్నేహితురాలి వద్ద ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో శంకర్ అనే వ్యక్తి తాను డైరెక్టర్‌నని పరిచయం చేసుకుని, ఒక వెబ్ సిరీస్‌లో అవకాశం ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు. ఆడిషన్ పేరుతో ఆమెను తన కారులో ఎక్కించుకుని అసభ్యకరమైన డైలాగులు చెప్పించడమే కాకుండా, కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోలను బాధితురాలి అనుమతి లేకుండా తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయి, చివరకు ఆమె తల్లిదండ్రుల వరకు చేరడంతో, వారు యువతిని తీవ్రంగా మందలించారు. ఆందోళన చెందిన బాధిత యువతి ఆ వీడియోలను డిలీట్ చేయాలని డైరెక్టర్‌ను కోరగా, అతను అందుకు నిరాకరించడమే కాకుండా… మరిన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేస్తానని ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో యువతి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు శంకర్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • cyber crime
  • Facebook
  • Facebook video
  • film industry
  • hyderabad crime
  • Jubilee Hills police
  • Jubilee Hills Police Station
  • kakinada
  • Kakinada girl
  • Online Harassment
  • Shankar Director
  • social media
  • telugu news
  • web series audition

Related News

Police devise a new plan in the Gyaneshwari case: a reward of one lakh for information about the child.

Jnaneswari Missing: జ్ఞానేశ్వరి కేసులో పోలీసులు కొత్త ప్లాన్.. తుని పాప సమాచారం ఇస్తే లక్ష బహుమతి

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో మిస్టరీ 25 రోజులుగా కొనసాగుతూనే ఉంది. పాప ఆచూకీ కోసం పోలీసులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్నారి సమాచారం అందించిన వారికి రూ.లక్ష నగదు పారితోషికం ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు చిన్నారి ఫొటో, గుర్తింపు వివరాలతో కూడిన వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. కాకినాడ జిల్లాతో

  • Pawan meets Maharashtra CM Devendra Fadnavis; expresses gratitude for providing two tigresses to AP.

    Pawan Kalyan: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd