HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Coach Saab Your Smile Is Super Interesting Post By Ms Dhoni

MS Dhoni : కోచ్ సాబ్.. మీ స్మైల్ సూపర్..ఎంఎస్ ధోనీ ఆసక్తికర పోస్ట్

  • Author : Vamsi Chowdary Korata Date : 09-03-2026 - 3:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gautam Gambhir replied to MS Dhoni's
Gautam Gambhir replied to MS Dhoni's

MS Dhoni అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయం తర్వాత, భారత క్రికెట్‌లోని ఇద్దరు దిగ్గజాలైన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య సోషల్ మీడియాలో జరిగిన సంభాషణ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వారిద్దరి మధ్య ఉన్న పాత విభేదాల ఊహాగానాలకు ఈ సంఘటన తెరదించినట్లు అయింది.

భారత్ విజయం సాధించిన వెంటనే, ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో జట్టును అభినందిస్తూ ఒక పోస్ట్ చేశాడు. “అహ్మదాబాద్‌లో చరిత్ర సృష్టించారు. జట్టుకు, సహాయక సిబ్బందికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులందరికీ నా అభినందనలు. మీ అందరి ఆట చూడటం చాలా ఆనందంగా ఉంది” అని పేర్కొన్నాడు.

ఇదే పోస్టులో గంభీర్‌ను ప్రత్యేకంగా ఉద్దేశిస్తూ, “కోచ్ సాబ్, నవ్వు మీ ముఖంలో చాలా బాగుంది. తీవ్రతతో కూడిన చిరునవ్వు ఒక కిల్లర్ కాంబో. అద్భుతంగా పనిచేశారు. ఎంజాయ్ చేయండి” అని రాశాడు. చివర్లో బూమ్రాను ప్రశంసిస్తూ, “బూమ్రా గురించి ఏమీ రాయకపోవడమే మంచిది. ఛాంపియన్ బౌలర్” అని చమత్కరించాడు.

ధోనీ చేసిన ఈ వ్యాఖ్యకు గంభీర్ కూడా అంతే హుందాగా స్పందించారు. “నవ్వడానికి ఇంతకంటే మంచి కారణం ఏముంటుంది, మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది” అని బదులిచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది.

గత కొన్నేళ్లుగా ధోనీ, గంభీర్ మధ్య సత్సంబంధాలు లేవని, వారి మధ్య విభేదాలు ఉన్నాయని అనేక చర్చలు జరిగాయి. ముఖ్యంగా 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్‌పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ అభిమానుల మధ్య చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌కు ధోనీ ప్రత్యేకంగా హాజరు కావడం, 2024 టీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ట్రోఫీని మైదానంలోకి తీసుకురావడం విశేషం. ప్రపంచకప్ విజయం అందించిన ఆనందానికి, ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య కనిపించిన స్నేహపూర్వక వాతావరణం తోడవడంతో భారత క్రికెట్ అభిమానుల సంతోషం రెట్టింపయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket
  • cricket news
  • dhoni
  • gautam gambhir
  • ICC Cricket News
  • ICC Men's T20 World Cup 2026
  • ICC T20 World Cup 2026
  • India vs New Zealand
  • indian cricket team
  • Indian Cricket Team Head Coach
  • Jasprit Bumrah
  • Mens T20 World Cup 2026
  • ms dhoni
  • T20 World Cup 2026
  • T20 World Cup 2026 Final

Related News

    Latest News

    • Lakshmi Parvathi: టీడీపీ పై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు

    • GV Anjaneyulu: విగ్రహాల ధ్వంసం.. అంతా జగన్ ప్లానే : జీవీ ఆంజనేయులు

    • War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు..

    • Drinking Water: మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో తాగునీటి సమస్యకు పరిష్కారం

    • Periods: పీరియడ్స్ సమయంలో మహిళలు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదో తెలుసా?

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd