HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Who Is Ahmad Vahidi The Irgcs New Commander

అమెరికా కంట్లో నలుసుగా మారిన ఐఆర్‌జీసీ కొత్త క‌మాండ‌ర్‌?!

అహ్మద్ వాహిదీ 2009 నుండి 2013 వరకు అప్పటి అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేశారు.

  • Author : Gopi Date : 07-03-2026 - 9:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ahmad Vahidi
Ahmad Vahidi

Ahmad Vahidi: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలై దాదాపు వారం రోజులు కావస్తోంది. యుద్ధం తగ్గకపోగా మరింత భీకరంగా మారుతోంది. ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇరాన్ లొంగడానికి సిద్ధంగా లేదు. దీనికి ప్రధాన కారణం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అని భావిస్తున్నారు. దీని బాధ్యతలు ఇప్పుడు బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వాహిదీ (Ahmad Vahidi) చేతుల్లోకి వచ్చాయి. వాహిదీని IRGC కొత్త కమాండర్-ఇన్-చీఫ్‌గా నియమించారు. వాస్తవానికి ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్‌లో IRGC చీఫ్ మొహమ్మద్ పాక్‌పుర్‌తో పాటు ఖమేనీని కూడా హతమార్చారు.

ఇరానీ మీడియా కథనాల ప్రకారం.. అహ్మద్ వాహిదీ 1988 నుండి 1997 వరకు ఎలైట్ యూనిట్ అయిన కుద్స్ ఫోర్స్ (IRGC విదేశీ విభాగం) కు నాయకత్వం వహించారు. ఇరాన్-ఇరాక్ యుద్ధంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన వ్యూహాల వల్లే అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ప్రభుత్వం యుద్ధంలో మోకరిల్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇరాక్‌కు అమెరికా పూర్తి మద్దతు ఉన్నప్పటికీ వాహిదీ వ్యూహాలు ఫలించాయి.

ఖమేనీ అప్పగించిన బాధ్యతలు

దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ డిసెంబర్ 2025లో వాహిదీని IRGC డిప్యూటీ చీఫ్‌గా నియమించారు. అంతకుముందు ఆయన ఇరాన్ సైన్యంలో డిప్యూటీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇస్లామిక్ విప్లవాన్ని రక్షించడమే అత్యంత ముఖ్యమైన విషయమని వాహిదీ పేర్కొన్నారు. ఈ విప్లవం గనుక రాకపోయి ఉంటే ప్రపంచంలో ఇరాన్ జెండా ఎగిరేది కాదని ఆయన అన్నారు.

Also Read: ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

ప్రభుత్వంలో మంత్రిగా కూడా..

అహ్మద్ వాహిదీ 2009 నుండి 2013 వరకు అప్పటి అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. దీనికంటే ముందు అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రభుత్వంలో హోం మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఆయన సైనిక అధికారిగానే కాకుండా బలమైన వ్యూహకర్తగా, అడ్మినిస్ట్రేటర్‌గా పేరు పొందారు.

అమెరికా కంట్లో నలుసుగా ఎందుకు మారారు?

‘ది న్యూయార్క్ టైమ్స్’ నివేదిక ప్రకారం.. 1994లో అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని ఒక యూదు సాంస్కృతిక కేంద్రంలో పేలుడు సంభవించింది. ఇందులో 85 మంది మరణించగా, సుమారు 300 మంది గాయపడ్డారు. ఒక సూసైడ్ బాంబర్ 275 కిలోల పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కును బిల్డింగ్‌లోకి దూసుకుపోనిచ్చాడు. ఈ కేసులో ఐదుగురు ఇరాన్ అధికారులపై అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. అందులో వాహిదీ పేరు కూడా ఉంది. అమెరికా ఒత్తిడితోనే అర్జెంటీనా పోలీసులు వాహిదీ పేరును చేర్చారని చెబుతారు. ఎందుకంటే 80వ దశకంలో ఆయన అమెరికాకు వ్యతిరేకంగా ఒక నిఘా ఆపరేషన్ నిర్వహించారు. అప్పటి నుండి ఆయన అమెరికా కంట్లో నలుసుగా మారారు.

2000 సంవత్సరంలో అర్జెంటీనా అధికారుల అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ వాహిదీపై రెడ్ నోటీసు జారీ చేసింది. అయితే ఇరాన్ ఈ నోటీసును నిరాధారమైనదిగా కొట్టిపారేసింది. ఈ దాడితో తమ అధికారులకు ఎలాంటి సంబంధం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

2022లో మహ్సా అమిని మరణం తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలను అణిచివేసే విషయంలో కూడా ఆయన పేరు వినిపించింది. నిరసనకారులపై ప్రాణాంతక చర్యలకు పాల్పడ్డారని పేర్కొంటూ అమెరికా, యూరోపియన్ యూనియన్ వాహిదీపై ఆంక్షలు విధించాయి. తల సరిగ్గా కప్పుకోలేదన్న కారణంతో మహ్సా అమినిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఆమె పోలీస్ కస్టడీలోనే మరణించిన సంగతి తెలిసిందే.

ప్రతీకారం తీర్చుకుంటామని IRGC శపథం

సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణం తర్వాత IRGC ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేసింది. ‘అల్ జజీరా’ నివేదిక ప్రకారం.. మధ్యప్రాచ్యంలోని అమెరికాకు చెందిన 27 మిలిటరీ బేస్‌లు, టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై IRGC భారీ దాడులు చేసింది. ఈ దాడుల కమాండ్‌ను అహ్మద్ వాహిదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, అమెరికా స్థావరాలను ఎంచుకుని మరీ లక్ష్యంగా చేసుకుంటున్నారని సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ahmad Vahidi
  • IRGC
  • US - Iran War
  • war
  • world news

Related News

Trump Hints At Restarting Iran War

Hormuz Strait: ఇరాన్ పై ట్రంప్ దెబ్బ

గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న కఠినమైన దిగ్బంధనం కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ చమురు అమ్మకాల ద్వారా పొందాల్సిన దాదాపు 5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయిందని అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) అంచనా వేసింది. ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో, ఇరాన్‌ను మళ్లీ చర్చల వేదికకు తీసుకురావడానికి ఈ ఆర్థిక

    Latest News

    • Purchase of Grain : ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే ‘రోహిత్ ‘ కీలక ఆదేశాలు

    • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

    • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

    • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

    • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

    Trending News

      • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

      • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

      • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

      • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd