HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Arjun Tendulkar Back In Action A Day After Wedding

పెళ్లయిన 24 గంటల్లోనే మైదానంలోకి అర్జున్ టెండూల్కర్!

డీవై పాటిల్ టీ20 కప్‌లో అర్జున్ 'డీవై పాటిల్ బ్లూ' జట్టు తరపున ఆడుతున్నాడు. పెళ్లి జరిగిన మరుసటి రోజే అంటే శుక్రవారం (మార్చి 06) ముంబై కస్టమ్స్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో అతను బరిలోకి దిగాడు.

  • Author : Gopi Date : 07-03-2026 - 3:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Arjun Tendulkar
Arjun Tendulkar

Arjun Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్- సాన్యా చందోక్ వివాహం మార్చి 05, గురువారం నాడు ఘనంగా జరిగింది. అయితే పెళ్లయిన మరుసటి రోజే అంటే 24 గంటలు గడవక ముందే అర్జున్ క్రికెట్ మైదానంలో ప్రత్యక్షమయ్యాడు. ఆట పట్ల అతనికున్న ఈ మక్కువ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం పెళ్లయిన మరుసటి రోజే కాదు పెళ్లికి ఒక రోజు ముందు కూడా అర్జున్ తన జట్టు తరపున మ్యాచ్ ఆడటం విశేషం.

డీవై పాటిల్ టీ20 కప్ 2026 విశేషాలు

డీవై పాటిల్ టీ20 కప్‌లో అర్జున్ ‘డీవై పాటిల్ బ్లూ’ జట్టు తరపున ఆడుతున్నాడు. పెళ్లి జరిగిన మరుసటి రోజే అంటే శుక్రవారం (మార్చి 06) ముంబై కస్టమ్స్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో అతను బరిలోకి దిగాడు. అయితే ఈ మ్యాచ్‌లో అర్జున్ జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అర్జున్ వ్యక్తిగత ప్రదర్శన కూడా అంతగా ఆకట్టుకోలేదు. బ్యాటింగ్‌లో 14 బంతుల్లో కేవలం 9 పరుగులు చేసిన అర్జున్ బౌలింగ్‌లో ఒక ఓవర్ వేసి 20 పరుగులు ఇచ్చాడు.

Also Read: వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

अर्जुन तेंदुलकर की शादी कल हुई और आज मैदान में मैच खेल रहे हैं।

सलाम इस जुनून को 🫡 pic.twitter.com/1FUxgaGVFK

— Ocean Jain (@ocjain4) March 6, 2026

పెళ్లికి ఒక రోజు ముందు కూడా మ్యాచ్

క్రికెట్ పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకుంటూ అర్జున్ తన పెళ్లికి ఒక రోజు ముందు అంటే మార్చి 04న ఇన్‌కమ్ టాక్స్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఆడాడు. ఇలా పెళ్లికి ముందు రోజు పెళ్లయిన మరుసటి రోజు కూడా మైదానంలోకి దిగి తన ప్రొఫెషనలిజాన్ని నిరూపించుకున్నాడు.

కుమారుడి పెళ్లిపై సచిన్ టెండూల్కర్ భావోద్వేగం

కుమారుడు అర్జున్ వివాహం సందర్భంగా సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ ఇలా రాశారు. అర్జున్- సాన్య తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో మాకు లభించిన ప్రేమ, ఆశీర్వాదాలకు మేము ఎంతో కృతజ్ఞులం. మీ సమక్షం, సందేశాలు, హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ వివాహాన్ని మా కుటుంబానికి, ముఖ్యంగా ఈ కొత్త జంటకు ఒక మరువలేని వేడుకగా మార్చాయి. అందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నాడు.

As Arjun and Saaniya begin this new chapter together, we feel incredibly grateful for the love and blessings pouring in from everyone. Your presence, messages, and heartfelt wishes have made this wedding a truly unforgettable occasion for the family and, most importantly, for the…

— Sachin Tendulkar (@sachin_rt) March 6, 2026

అర్జున్ టెండూల్కర్- సాన్యా చందోక్ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు క్రికెట్, రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Arjun Tendulkar
  • Arjun Tendulkar Wedding
  • DY Patil T20 Cup
  • sachin tendulkar
  • sports news

Related News

    Latest News

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

    • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

    Trending News

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

      • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

      • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

      • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

      • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd