HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >News Of 30000 Layoffs At Tech Mahindra

టెక్‌ మహీంద్రాలో 30వేల లేఆఫ్‌లంటూ వార్తలు..

  • Author : Vamsi Chowdary Korata Date : 09-03-2026 - 11:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tech Mahindra Layoffs
Tech Mahindra Layoffs

Tech Mahindra Layoffs  ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ టెక్ మహీంద్రాలో భారీ స్థాయిలో లేఆఫ్స్ జరుగుతున్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏకంగా 30 వేల మందిని తొలగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై టెక్ మహీంద్రా కీలక ప్రకటన చేసింది. ఉద్యోగుల తొలగింపుల వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.

ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత్ వంటి పలు దేశాల దిగుమతులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. భారత్‌కు చెందిన టెక్ కంపెనీల ఎగుమతులపై యుద్ధ ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే దేశంలోని దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒకటైన టెక్ మహీంద్రా షాకింగ్ నిర్ణయం తీసుకుందని, భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమ కంపెనీలో దాదాపు 30 వేల మందిని ఒకేసారి ఇళ్లకు సాగనంపుతోందన్న వార్తలతో ఐటీ, టెక్ ఉద్యోగుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. అయితే, ఈ వార్తలను టెక్ మహీంద్రా ఖండించింది. భారీ స్థాయిలో లేఆఫ్స్ చేపడుతున్నారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉద్యోగులను తొలగించాలన్న ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని క్లారిటీ ఇచ్చేసింది.

ఈ మేరకు ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నారనే అంశంపై సోషల్ మీడియా పోస్టులు కనిపించాయని, అలాగే ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలపై స్పందించాల్సిన అవసరం ఉందని భావించినట్లు పేర్కొంది. ‘ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందనే మార్కెట్ పుకారుపై కంపెనీకి కాల్స్ అందాయి, కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లను గమనించింది. ఊహాగానాల దృష్ట్యా, అటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని స్టాక్ ఎక్స్ఛేంజీలకు స్పష్టం చేయడం అవసరమని కంపెనీ స్వయంగా భావిస్తోంది. అటువంటి మార్కెట్ పుకార్లను నిర్ద్వంద్వంగా ఖండిస్తోంది.’ అని ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో టెక్ మహీంద్రా తెలిపింది.

కంపెనీలో 30 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నారనే వార్తల్లో నిజం లేదని టెక్ మహీంద్రా నొక్కి చెప్పింది. భారీ లేఆఫ్స్ లేవని, ప్రాజెక్టుల ప్రతిపాదికన వర్క్ ఫోర్స్‌ ఆప్టిమైజేషన్ కొనసాగుతుందని తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ (AI- ready) నైపుణ్యాలు ఉన్న వారికి అవకాశాలు కల్పిస్తూనే, కొత్త ప్రతిభను నియమించుకుంటున్నామని కంపెనీ వర్గాలు తెలిపాయి. టెక్ మహీంద్రా తన ఉద్యోగులను తగ్గించుకోకుండానే అవసరమైన ప్రాజెక్టులలోకి మారుస్తూ వారి ఉత్పాదకతను ఉపయోగించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపింది.

భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలకు టెక్ మహీంద్రా సిద్ధమవుతుందన్న పుకార్లు ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తుందన్న నేపథ్యంలో ఈ మేరకు స్పందించినట్లు ఈ టెక్ కంపెనీ తెలిపింది. ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం లేఆఫ్స్ ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని స్పష్టం చేసింది. కంపెనీ చేసిన ఈ ప్రకటనతో ఉద్యోగులు ఊపిరిపీల్చుకున్నారని చెప్పవచ్చు. మాస్ లేఆఫ్స్‌ జరిగితే వేలాది మంది ఉపాధి కోల్పోవాల్సి వస్తుంది.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bussiness
  • Employees Layoffs
  • IT Layoffs
  • Tech Layoffs
  • tech mahindra

Related News

Amazon Layoffs

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు.. రోబోటిక్స్ ఉద్యోగులపై ప్రభావం

Amazon layoffs  ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో వరుస లేఆఫ్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. 2026లో రెండు నెలల కాలంలో ఈ సంస్థ 16 వేల మంది ఉద్యోగులను తొలగించింది. మరిన్ని తొలగింపులు ఉంటాయని అప్పుడే తెలిపింది. తాజాగా రోబోటిక్స్ విభాగంలోని ఉద్యోగులను తొలగిస్తోంది. సుమారు 100 మంది ఉద్యోగులపై ప్రభావం పడిందని సంబంధిత వ్యక్తులు వెల్లడించారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెజాన్ గోదాముల్లో పని

    Latest News

    • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

    • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

    • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

    Trending News

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd