Andhra Pradesh
-
#Andhra Pradesh
Amaravati : నేడు అమరావతి పనుల పునఃప్రారంభం
Amaravati : గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భారీ స్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. అయితే, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో, అమరావతి నిర్మాణ పనులు స్తంభించాయి. ఈ స్థితిలో, కూటమి ప్రభుత్వం తిరిగి అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Published Date - 09:28 AM, Sat - 19 October 24 -
#Andhra Pradesh
AP Politics : అందుకు.. విజయసాయి రెడ్డి సంతోషంలో ఉన్నాడా..?
AP Politics : అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. ఎంతటివారికైనా ఇది వర్తిస్తుంది. వైసీపీ హయాంలో అన్నీ తానై వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రస్తుతం వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
Published Date - 12:21 PM, Fri - 18 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీఎల్పీ సమావేశం..
CM Chandrababu: నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో అతి ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమాలు, సమీక్షలు, సమావేశాలతో ఎప్పుడూ బిజీగా ఉంటూ, ప్రభుత్వ పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ, రాజకీయపార్టీ కార్యకలాపాలపై కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, అవసరమైనప్పుడు సమయం కేటాయించడం తెలిసిందే. ఈ రోజు, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత్యంత కీలక సమావేశం నిర్వహించనున్నారు.
Published Date - 10:13 AM, Fri - 18 October 24 -
#Andhra Pradesh
Dharmana Prasada Rao : ధర్మాన మౌనం వెనుక ఉన్న సంగతేంటి..!
Dharmana Prasada Rao : నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నుండి వైఎస్ జగన్ వరకు అనేక ముఖ్యమంత్రుల క్యాబినెట్లో కీలక శాఖలను నిర్వహించిన ఈ నేత, నాలుగు దశాబ్ధాల విస్తారమైన రాజకీయ చరిత్రను కలిగి ఉన్నారు. విభిన్న హోదాల్లో, ధర్మాన సాధారణంగా పనిచేస్తూ, అధికారంలో ఉన్నప్పుడు , ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా హుందాగా వ్యవహరిస్తారు. కానీ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన మౌనంగా ఉన్నారు.
Published Date - 04:52 PM, Thu - 17 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్తమ సమయం
CM Chandrababu : చంద్రబాబు ఎక్స్ వేదికగా.. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను బహిరంగంగా ఆహ్వానించారు. "గౌరవనీయమైన పారిశ్రామికవేత్తలు & పెట్టుబడిదారులు, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్త ఉత్తమ విధానాలతో ఓపెన్గా ఉంది. మీకు స్వాగతం పలికేందుకు రెడ్ కార్పెట్ పరిచిన మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. APలో, వ్యాపార అనుకూల రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిభావంతుడు యువకులు , బలమైన మౌలిక సదుపాయాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి" అని రాశారు.
Published Date - 04:01 PM, Thu - 17 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీలో భారీ వర్షాలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu : ఏపీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు తదితర జిల్లాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షించారు.
Published Date - 12:36 PM, Wed - 16 October 24 -
#Andhra Pradesh
AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ సమావేశం
AP Cabinet : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గం నేడు భేటీకానుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్లో చర్చించనున్నారు.
Published Date - 10:09 AM, Wed - 16 October 24 -
#Andhra Pradesh
Minister Narayana : మంత్రి నారాయణకు 3 వైన్ షాపులు.. కానీ..!
Minister Narayana : ఏపీ మంత్రి పి.నారాయణ తన అనుచరుల కోసం రూ. 2 కోట్ల సొంత డబ్బుతో 100 మంది కార్యకర్తల ద్వారా వైన్ షాపులకు దరఖాస్తు చేశారు. 100 దరఖాస్తులకు గాను వారికి మూడు షాపులు దక్కాయి.
Published Date - 12:42 PM, Tue - 15 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : కొత్త పాలసీలపై సీఎం చంద్రబాబు కసరత్తు.. వరుస సమీక్షలు..
CM Chandrababu : ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ పాలసీల రూపకల్పనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. వివిధ పాలసీలపై వరుసగా రెండో రోజున సీఎం చంద్రబాబు సమీక్షలు జరపనున్నారు..
Published Date - 12:27 PM, Tue - 15 October 24 -
#Andhra Pradesh
Nara Lokesh : మరో యువ గళం హామీని నెరవేర్చిన లోకేష్
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని పూర్తి చేశారు. పూతలపట్టు నియోజక వర్గంలోని బంగారుపాళ్యంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు పెంచడంతోపాటు యువ గళం పాద యాత్ర సందర్భంగా ఇచ్చిన కొన్ని హామీలను ఆయన ఇప్పటికే నెరవేర్చారు.
Published Date - 09:42 PM, Sun - 13 October 24 -
#Andhra Pradesh
AP Liquor Shop Tenders : దరఖాస్తుకు నేడే ఆఖరి రోజు.. ఆ వైన్ షాపులకు ఒక్క దరఖాస్తేనట..!
AP Liquor Shop Tenders : ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమలుకు సిద్ధమవుతోంది. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుకు నేడే ఆఖరి గడువు. ఇక గురువారం రాత్రి 8 గంటల వరకు 65,629 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
Published Date - 12:39 PM, Fri - 11 October 24 -
#Devotional
AP Temples: ఆలయ అర్చకులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!
AP Temples: దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ విషయంలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఆలయాల్లో అర్చకులకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ, ఇతరుల జోక్యం లేకుండా ఉండాలని ఉత్తర్వులు ఇచ్చింది. దేవాదాయ శాఖ కమిషనర్ సహా ఏ స్థాయి అధికారులైన వారికి వైదిక విధుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు, అర్చకులకు విస్తృత అధికారాలు ఇవ్వడంపై సర్కార్ ఉత్తర్వులు విడుదల చేసింది. పూజలు, సేవలు, యాగాలు, […]
Published Date - 12:06 PM, Fri - 11 October 24 -
#Andhra Pradesh
Weather Alert : పండగ వేళ.. తెలుగు రాష్ట్రాలకు వర్షాలకు భారీ వర్ష సూచన
Weather Alert : ముఖ్యంగా తెలంగాణలో అనేక జిల్లాలు వరుస వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం వరుణుడి బారి నుంచి తప్పించుకోలేకపోతోంది. నగరంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రాంతం భారీ వర్షాల ప్రభావానికి గురవుతోంది. తాజాగా ఈ ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం వల్ల, రాబోయే రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Published Date - 09:46 AM, Fri - 11 October 24 -
#Andhra Pradesh
Dasara Celebrations : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం.. వేకువ జాము నుంచే అందరికీ సర్వదర్శనం
Dasara Celebrations : నేడు అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూలానక్షత్రం సందర్భం కావడంతో, భక్తులు ఈ ప్రత్యేక ఆలంకారాన్ని దర్శించుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పోలీసులు భక్తులను క్రమబద్ధీకరించేందుకు కంపార్ట్మెంట్లలో ఉంచి, క్యూలో పంపిస్తున్నారు. దర్శనం చేసుకున్న భక్తులను త్వరగా దిగువకు పంపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు 110 హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతీ భక్తుడికీ ఆలయ సిబ్బంది ఉచితంగా ఒక లడ్డూ అందిస్తున్నారు.
Published Date - 11:39 AM, Wed - 9 October 24 -
#Andhra Pradesh
New Ration Cards : ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు.. మార్గదర్శకాలు ఇలా..!
New Ration Cards : ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు లేని అర్హులైన పేదలకు త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో, రేషన్ కార్డుల్లో పేర్ల మార్పు, చేర్పు వంటి సవరణలను కూడా వీలు కల్పించనుంది. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పు, కుటుంబ విభజన, అడ్రస్ మార్పు, రేషన్ కార్డులు ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి చర్యలను తీసుకునే విధానాన్ని కూడా ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనుంది.
Published Date - 10:29 AM, Wed - 9 October 24