CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈవో సమావేశం
CM Chandrababu: నీతి ఆయోగ్ సీఈవోతో నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై, అలాగే ఇతర ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది.
- By Kavya Krishna Published Date - 09:54 AM, Wed - 30 October 24

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నీతి ఆయోగ్ సీఈవోతో నేడు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై, అలాగే ఇతర ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది. అధికారులు ఇప్పటికే ఈ భేటీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత ఆగస్టు చివరి వారంలో, సీఎం చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ ప్రతినిధులతో కూడా ఒక సమావేశం నిర్వహించారు.
ఆ సమావేశంలో, వికసిత్ భారత్ , వికసిత్ ఏపీపై చర్చించారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి 12 అంశాలతో కూడిన డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ లక్ష్యానికి సంబంధించిన వివరాలను నీతి ఆయోగ్ ప్రతినిధులకు అందించారు, అందుకే ఈ సమావేశం జరగాలని నిర్ణయించారు. ఈ క్రమంలో, నీతి ఆయోగ్ సీఈవో బుధవారం రాష్ట్రానికి రాబోతున్నారు. సమావేశంలో వివిధ ప్రణాళికలు, అమలులో ఉన్న పథకాల ప్రగతి , భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించనున్నారని సమాచారం.
Minister Anita : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో హోంమంత్రి అనిత భేటీ
ఈనెల 6న మంత్రివర్గ సమావేశం
అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. నవంబర్ 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో నవంబర్ 6న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం నవంబర్ 12న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంటుందని తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి నాలుగు నెలలు పూర్తైంది. అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దాఖలాలు లేవు. గత అసెంబ్లీ సమావేశాల్లో తాత్కలిక బడ్జెట్‌తో సరిపెట్టాల్సి వచ్చింది. పాత బడ్జెట్‌నే కొనసాగించారు. అయితే శీతాకాల సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి కూడా వారం రోజులపాటు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
Benefits Of Walking: ఒక గంటలో 5000 అడుగులు నడుస్తున్నారా? అయితే లాభాలివే!