Nayanatara : కండల వీరుడు సరసన నయనతార..ఇది మామలు కాంబో కాదు !!
ఇప్పటికే షారుఖ్ ఖాన్‌తో కలిసి 'జవాన్' చిత్రంతో వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన నయన, రీసెంట్ గా చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్' (MSVP)- వంటి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. ఇప్పుడు ఆమె ఖాతాలో మరో భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్ చేరబోతున్నట్లు
- Author : Sudheer
Date : 08-03-2026 - 11:00 IST
Published By : Hashtagu Telugu Desk
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘లేడీ సూపర్ స్టార్’గా తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న నయనతార, ఏజ్ పెరుగుతున్నా తన గ్లామర్ మరియు నటనతో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. కేవలం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకే పరిమితం కాకుండా, స్టార్ హీరోల పక్కన నటిస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఇప్పటికే షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘జవాన్’ చిత్రంతో వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన నయన, రీసెంట్ గా చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్’ (MSVP)- వంటి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. ఇప్పుడు ఆమె ఖాతాలో మరో భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్ చేరబోతున్నట్లు సమాచారం.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నయనతార నటించబోతుందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌ను వెండితెరపైకి తీసుకువచ్చే బాధ్యతను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తీసుకోబోతున్నట్లు టాక్. ‘మహర్షి’, ‘వారసుడు’ వంటి క్లాస్ మరియు మాస్ హిట్లను అందించిన వంశీ, సల్మాన్ కోసం ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సిద్ధం చేశారని, అందులో హీరోయిన్ పాత్రకు నయనతార అయితేనే న్యాయం జరుగుతుందని భావిస్తున్నారట. ఈ వార్త గనుక నిజమైతే, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక బిగ్గెస్ట్ కొలాబరేషన్ అవుతుంది.
నయనతార తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ, నార్త్ టూ సౌత్ తన మార్కెట్‌ను విస్తరిస్తోంది. సల్మాన్ ఖాన్ లాంటి మాస్ హీరో పక్కన నయనతార లాంటి పర్ఫార్మర్ తోడైతే, ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి చిత్ర యూనిట్ లేదా మేకర్స్ నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై క్లారిటీ వస్తే, సల్మాన్ అభిమానులకు మరియు నయనతార ఫ్యాన్స్‌కు ఇది అతిపెద్ద పండగ లాంటి వార్త అవుతుంది.