Dana Cyclone : తీరం దాటిన దానా తీవ్ర తుఫాన్.. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్..
Dana Cyclone : ఈ తుఫాన్ పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, ఈ రోజు మధ్యాహ్నం నుంచి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఉత్తరాంధ్ర ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది.
- By Kavya Krishna Published Date - 09:41 AM, Fri - 25 October 24

Dana Cyclone : “దానా” తీవ్ర తుఫాన్ తీరం దాటింది. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల మధ్యలో హబాలిఖాతి నేచర్ క్యాంప్ (భిత్తర్కనిక) , ధమ్రా మధ్య సముద్రతీరం దాటింది తుఫాన్ “దానా”. ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ మరో 2-3 గంటల పాటు కొనసాగుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ తుఫాన్ పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, ఈ రోజు మధ్యాహ్నం నుంచి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఉత్తరాంధ్ర ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వాతావరణం మేఘావృతంగా ఉండి, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Jani Master : జానీ మాస్టర్ కు షాక్ ఇచ్చిన పుష్ప టీం
ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది. రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే.. ఇదిలా ఉంటే.. శుక్రవారం తెల్లవారుజామున దానా తుఫాను ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ కొనసాగుతుండగా ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా అనేక చెట్లు నేలకూలాయి. తుఫాను నుండి భారీ వర్షపాతం కారణంగా 16 జిల్లాల్లో వరదలు ముంచెత్తుతాయని IMD అంచనా వేసినందున, ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి ఒడిశా ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని, తుఫాను ప్రభావాలను తగ్గించే చర్యలను అమలు చేసిందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ హామీ ఇచ్చారు.
మాఝీ ప్రత్యేక సహాయ కమీషనర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌ని సందర్శించి, “మేము పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము. హిరాకుడ్ రిజర్వాయర్, ఇతర ప్రదేశాలలో నీటి మట్టాలు నిరంతర పర్యవేక్షణ , నిర్వహణలో ఉన్నాయి.’ అని ఆయన తెలిపారు. భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తుఫాను కారణంగా మూసివేయబడిన విమాన కార్యకలాపాలు శుక్రవారం ఉదయం 8 గంటలకు ఒడిశా తీరంలో ల్యాండ్‌ఫాల్ చేసిన తర్వాత పునరుద్ధరించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.
Singareni : సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం