Andhra Pradesh
-
#Andhra Pradesh
పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ డిమాండ్ రెట్టింపు: గ్రిడ్ విస్తరణపై నిపుణుల హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ తన ఇంధన రంగంలో ఒక పెను మార్పుకు సిద్ధమవుతోంది. కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) విడుదల చేసిన వనరుల లభ్యత ప్రణాళిక (2024-25 నుండి 2034-35) ప్రకారం రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2024-25లో 14,610 మెగావాట్ల నుండి 2034-35 నాటికి భారీగా 28,850 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Date : 20-01-2026 - 6:30 IST -
#Business
కడపలోకి PURE EV సరికొత్త షోరూమ్ ప్రారంభం
అత్యాధునిక ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు మోటార్‌సైకిళ్లతో పాటు, గృహాలు మరియు వ్యాపారాలకు క్లీన్ ఎనర్జీని అందించే మా ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తుల శ్రేణి PuREPower కూడా ఈ కొత్త షోరూమ్‌లో అందుబాటులో ఉంటుంది.
Date : 20-01-2026 - 5:30 IST -
#Telangana
జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
జల వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరగకుండా, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు.
Date : 10-01-2026 - 6:00 IST -
#Business
కోడిగుడ్ల ధరలకు రెక్కలు.. సామాన్యుడి పౌష్టికాహారంపై భారం
ఎన్నడూ లేని విధంగా గుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది నెలల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో రూ.5 నుంచి రూ.6 మధ్య లభించిన ఒక్కో గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కి చేరింది. హోల్‌సేల్ మార్కెట్లో అయితే ఒక్క గుడ్డు ధర రూ.7.30కు మించి ఉండటం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.
Date : 22-12-2025 - 5:30 IST -
#Andhra Pradesh
రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఈ పర్యటనలో భాగంగా రేపు శుక్రవారం రోజున ఆయన వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ రంగాల ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక సహాయం, అనుమతులు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించనున్నారు.
Date : 18-12-2025 - 4:45 IST -
#Andhra Pradesh
కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో జగన్ భేటీ కానున్నారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి, పీపీపీ విధానాన్ని రద్దు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరనున్నారు.
Date : 18-12-2025 - 10:53 IST -
#Andhra Pradesh
Amaravati TTD Temple : కృష్ణమ్మకు నిత్య హారతి.. కళ్లు చెదిరేలా టీటీడీ ఆలయం.. సీఎం చంద్రబాబు ప్లాన్ ఇదే!
అమరావతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల మాస్టర్ ప్లాన్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఆలయం క్లీన్, గ్రీన్, హైజినిక్‌గా ఉండటంతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అన్నప్రసాదం భవనాన్ని విస్తరించాలని చెప్పారు. ఇక కృష్ణమ్మకు నిత్యహారతి ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. కాగా, విస్తరణలో భాగంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 7 అంతస్తుల్లో మహా రాజగోపురంతో పాటు మూడు రాజగోపురాలు నిర్మించనున్నారు. భక్తులు, వీఐపీల కోసం […]
Date : 28-11-2025 - 11:51 IST -
#Andhra Pradesh
Dwaraka Tirumala : ద్వారకాతిరుమలలో అంతరాలయ దర్శనానికి టికెట్
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ద్వారకాతిరుమల- ఏలూరు జిల్లా. శ్రీ స్వామి వారి దేవాలయము నందు ది.27.11.2025 నుండి అంతరాలయ దర్శనము మనిషి ఒక్కింటికి రూ.500/-ల టిక్కెట్టు ఏర్పాటు చేయడమైనది. సదరు టిక్కెట్టు ఒక్కింటికి రెండు చిన్న లడ్డూ ప్రసాదములను ఉచితముగా ఇచ్చుటకు నిర్ణయించడమైనది. ప్రతి శనిఆదివారములు మరియు విశేష పర్వదినములలో, భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ మరియు ముఖ మండపం దర్శనము అనుమతించబడదు.
Date : 28-11-2025 - 11:28 IST -
#Andhra Pradesh
Simhachalam Temple : మారుతున్న సింహాచల క్షేత్ర రూపురేఖలు.. మొదలైన అభివృద్ధి పనులు!
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన జరిగింది. నాల్కో సంస్థ సీఎస్ఆర్ కింద్ ఇచ్చిన రూ. 1.58 కోట్ల నిధులతో చేపట్టిన షెడ్లకు శంఖుస్థాపన చేశారు. ఇక కోల్‌కతాకు చెందిన ఓ భక్తుడు ఇచ్చిన రూ. 45 లక్షల విరాళంతో తొలిపావంచా వద్ద నిర్మించనున్న షెడ్డుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంఖుస్థాపన చేశారు. అంతేకాకుండా రూ. 3 కోట్లతో నిర్మించిన టీఎంఎస్ షెడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా […]
Date : 27-11-2025 - 12:21 IST -
#Andhra Pradesh
Krishna Water Dispute : నీళ్లన్నీ మీకిస్తే, మా సంగతి ఏంటి.. కృష్ణా జల వివాదంపై ఏపీ తెలంగాణ వాదనలు!
కృష్ణా జలాల పునఃపంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్.. హైదరాబాద్, పరిశ్రమలు కోల్పోయిందని ఏపీ వాదనలు వినిపించింది. ఇప్పుడు వ్యవసాయమే మిగిలిందని చెప్పారు. ఇప్పుడు ఏపీకి నీటి కేటాయింపులు తొలగించడం సరికాదని ఏపీ న్యాయవాది జయదీప్ గుప్తా వాదించారు. చట్టబద్ధమైన ట్రైబ్యునల్ తీర్పులను గౌరవించాలన్న న్యాయవాది.. మిగులు జలాలు ఏపీకే దక్కాలని కోరారు. కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్, […]
Date : 27-11-2025 - 11:33 IST -
#Andhra Pradesh
Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!
చంద్రబాబు సహా 16 మందిపై జగన్ ప్రభుత్వ హయాంలో నమోదైన ఫైబర్‌నెట్ కేసును సీఐడీ ముగించింది. ఎలాంటి ఆర్థిక అక్రమాలు జరగలేదని, సంస్థకు నష్టం వాటిల్లలేదని నివేదికలో తేల్చింది. గతంలో ఫిర్యాదు చేసిన మాజీ ఎండీ కూడా దీనితో ఏకీభవించారు.. ఏసీబీ కోర్టుకు కూడా హాజరయ్యారు. అయితే ఈ ఫైబర్ నెట్ కేసును మూసివేయడాన్ని వైఎస్సార్‌సీపీ తప్పుబట్టింది. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఘాటుగా విమర్శించింది. జగన్ హయాంలో చంద్రబాబు సహా 16 మందిపై సీఐడీ కేసులు […]
Date : 27-11-2025 - 10:15 IST -
#Andhra Pradesh
Yarlagadda Venkata Rao : గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వినూత్న ఆలోచనకు శ్రీకారం!
గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యార్లగడ్డ వెంకట్రావు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తాజాగా గన్నవరం మండలం బిబి.గూడెం గ్రామంలో దాతల సహకారంతో సుమారు రూ. 55 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు (ఎన్నారైలు) తమ పుట్టిన గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిధులతో పనులు జరిగేటప్పుడు నిధుల […]
Date : 26-11-2025 - 3:03 IST -
#Andhra Pradesh
Gannavaram Mla : గన్నవరం ఆరోగ్య కేంద్రాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు!
గన్నవరం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూసేందుకు, ఆయన నేరుగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో డాక్టర్ల పనితీరు, సిబ్బంది విధులు, ఆసుపత్రి ప్రాంగణంలో పరిశుభ్రత వంటి కీలక అంశాలను పరిశీలించడానికి ఆయన రాత్రి సమయాల్లో ఆసుపత్రులకు ఆకస్మికంగా వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ అనూహ్య పర్యటనల ద్వారా, వైద్య […]
Date : 26-11-2025 - 2:02 IST -
#Andhra Pradesh
Gannavaram : లబ్ధిదారులకు ట్రై సైకిళ్లను అందజేసిన యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు ప్రజా సంక్షేమం మరియు సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా ఆయన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ట్రై సైకిళ్లను స్వయంగా అందజేసి దివ్యాంగుల పట్ల తమ ఆదరణను చాటుకున్నారు. ఈ ట్రై సైకిళ్ల పంపిణీ ద్వారా, శారీరక ఇబ్బందులు ఉన్నవారు తమ దైనందిన కార్యకలాపాలను సులభంగా నిర్వహించుకోవడానికి, తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి వీలు కలుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ప్రజా […]
Date : 26-11-2025 - 1:54 IST -
#Andhra Pradesh
Mantena Ramaraju : కూతురి పెళ్లికి రూ.100 కోట్లు..తిరుమల శ్రీవారికి NRI రామరాజు కళ్లు చెదిరే విరాళం!
తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది. రామలింగరాజు అనే భక్తుడు తన కుమార్తె, అల్లుడి పేరు మీద రూ.9 కోట్లు ఇచ్చారు. ఈ మేరకు దాతను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. మరోవైపు, తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. పంచమీ తీర్థం సందర్భంగా లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తన్మయత్వం పొందారు. శ్రీవారి ఆలయం నుంచి సారె, విలువైన కానుకలు అమ్మవారికి సమర్పించారు. తిరుమల శ్రీవారిని నిత్యం దేశ […]
Date : 26-11-2025 - 12:57 IST