Pulivendula : ఘోర ప్రమాదం.. 30 అడుగుల లోయలో పడిపోయిన ఆర్టీసీ బస్సు
వారిని చికిత్స నిమిత్తం వెంటనే పులివెందుల(Pulivendula) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
- By Pasha Published Date - 09:59 AM, Wed - 23 October 24

Pulivendula : ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు 30 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదం ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా పులివెందుల సమీపంలో చోటుచేసుకుంది. కదిరి నుంచి పులివెందుల వైపు వెళ్తున్న బస్సు.. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి లోయలో పడిపోయినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వెంటనే పులివెందుల(Pulivendula) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు చాలా ఎత్తు నుంచి లోయలో పడినందు వల్ల ప్రయాణికుల తలకు బాగా గాయాలు అయ్యాయి.
వైఎస్సార్ సీపీ గత ఐదేళ్ల పాలనా కాలంలోనూ పులివెందుల, దాని పరిసర ప్రాంతాల రోడ్ల పరిస్థితి మారలేదు. దాదాపు 36 కి.మీ మేర విస్తరించి ఉన్న పులివెందుల-ముద్దనూరు రోడ్డులో ప్రయాణించాలంటేనే జనం జంకే దుస్థితి నెలకొంది. ఈ రోడ్డులో అడుగడుగునా గుంతలతో అధ్వానంగా ఉంటుంది. అయితే మరమ్మతులు చేసే నాథుడే కనిపించడం లేదు. జాతీయ రహదారిగా ఎంపికైనా ఈ రోడ్డు పరిస్థితి మారడం లేదు.
Also Read :Prabhas Birthday : ఆ కట్ అవుట్ చూసి అన్నీ నమ్మేయాలి డ్యూడ్ – మెగాస్టార్ ‘మెగా’ ట్వీట్
ఆరు నెలల క్రితమే ఈ రోడ్డుకు టెండర్లు మొదటి దశలోనే ఆగిపోయాయి. దీంతో ఆర్‌అండ్‌బీ వారు వదిలేశారు. గతేడాది డిసెంబరు 25న నాటి సీఎం జగన్ వచ్చిన సమయంలో రాయలాపురం వద్ద కొత్తగా నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవానికి పులివెందుల నుంచి రాయలాపురం వరకు కొత్తగా రోడ్డు నిర్మించారు. అక్కడి నుంచి ముద్దనూరు వరకు రోడ్డు దారుణంగా ఉంది. మొత్తం మీద రోడ్లు బాగా లేకపోవడంపై పులివెందుల ప్రజలు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. రోడ్లను బాగు చేస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని వారు అభిప్రాయపడుతున్నారు.