Chandrababu Naidu
-
#Andhra Pradesh
Liquor Price : ఏపీలో పెరిగిన మద్యం ధరలు అమల్లోకి..
Liquor Price : ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెంపు అమల్లోకి వచ్చింది. సామాన్యుల కోసం అందుబాటులోకి తెచ్చిన రూ. 99 మద్యం బాటిల్, బీర్లను మినహాయించి మిగతా అన్ని బ్రాండ్‌లపై రూ. 10 చొప్పున ధర పెంచారు. మద్యం రేట్లు పెరగడంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపు నేపథ్యం, ప్రభుత్వ నిర్ణయం, ప్రతిపక్షాల స్పందన వంటి అంశాలను వివరంగా పరిశీలిద్దాం.
Date : 11-02-2025 - 12:59 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం భేటీ
CM Chandrababu : శుక్రవారం ఉదయం నీతి ఆయోగ్ బృందం సచివాలయానికి చేరుకోగా, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వారిని స్వాగతం పలికారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావులతో పాటు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీ పాల్గొన్నారు.
Date : 07-02-2025 - 2:09 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలి.. బీజేపీ అభ్యర్ధుల గెలుపునకు తెలుగు ప్రజలు కృషి చేయాలి
CM Chandrababu : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. తెలుగు ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ఢిల్లీ అభివృద్ధి విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యాలను ప్రస్తావించారు. దేశం స్వచ్ఛ భారత్‌లో ముందుకు సాగుతున్నప్పుడు, ఢిల్లీ మాత్రం మురికి కూపంగా మారిందని విమర్శించారు. ఢిల్లీ ప్రజలకు మంచి పాలన అందించాలంటే బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా తెలుగువారు బీజేపీ విజయంలో భాగమవ్వాలని పిలుపునిచ్చారు.
Date : 03-02-2025 - 12:37 IST -
#Andhra Pradesh
Fiber Net : ఫైబర్ నెట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి
Fiber Net : 2017లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రారంభమైన ఫైబర్ నెట్ ప్రోగ్రాం, అతి తక్కువ ధరలో మూడు సేవలను కలిపి ప్రజలకు అందించడం ద్వారా దేశవ్యాప్తంగా ఆకట్టుకుంది. ఇది కేవలం రూ.149లో వినియోగదారులకు కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సేవలను అందించడమే కాకుండా, 17 లక్షల కనెక్షన్లు 2019లో పూర్తయ్యాయి.
Date : 30-01-2025 - 12:11 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబు గుజరాత్ మోడల్ వ్యాఖ్యల అర్థం ఇదా..?
CM Chandrababu : ఇటీవల తన ప్రసంగాల్లో సీఎం చంద్రబాబు గుజరాత్ మోడల్‌ను ప్రస్తావిస్తూ అభివృద్ధికి రాజకీయ స్థిరత్వం ఎంత ముఖ్యమో వివరించారు. ఆయన గుజరాత్ మోడల్ గురించి రెండు, మూడు సార్లు చెప్పిన సందర్భాలు ప్రజలకు చర్చనీయాంశమయ్యాయి.
Date : 28-01-2025 - 10:35 IST -
#Andhra Pradesh
Yuva Galam Padayatra : నేటికి యువగళానికి రెండేళ్లు.. అలుపెరగని యోధుడు నారా లోకేష్
Yuva Galam Padayatra : నారా లోకేష్ తన తండ్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వ పునాదులను ముందుకు తీసుకెళ్లేందుకు, ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఈ పాదయాత్ర ప్రారంభించారు. రాజధాని లేకుండా, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగింది టీడీపీనే అని ప్రజలు నమ్మినప్పటికీ, 2019 ఎన్నికల్లో వైసీపీ చేసిన ఆకర్షణీయ ప్రచార నినాదాలతో ప్రజలు ఆ పార్టీకి అధికారం అప్పగించారు.
Date : 27-01-2025 - 2:08 IST -
#Andhra Pradesh
Governor Abdul Nazeer : ఏపీ ఆర్థిక పరిస్థితిపై గరవర్నర్ కీలక వ్యాఖ్యలు
Governor Abdul Naseer : జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఏపీ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోంది.” అని పేర్కొన్నారు.
Date : 26-01-2025 - 1:56 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు.. నేడు కేంద్రమంత్రులతో భేటీ..
CM Chandrababu : దావోస్‌లో జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో అనేక ప్రముఖ సంస్థల సీఈవోలు, అధిపతులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో బిజీగా గడిపిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూలమైన అవకాశాలు, అభివృద్ధి పరిస్థితుల గురించి వివరణ ఇచ్చారు. ఈ పర్యటన ద్వారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలో మరింత ముందుకు వెళ్లే అవకాశం సృష్టించిందని చెప్పవచ్చు.
Date : 24-01-2025 - 11:34 IST -
#Andhra Pradesh
Davos : బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ..అప్పుడు IT ..ఇప్పుడు AI
Davos : '1995లో ఐటీ కోసం.. 2025లో ఏఐ కోసం' అంటూ ఆయన రాసుకొచ్చారు
Date : 22-01-2025 - 9:11 IST -
#Andhra Pradesh
AP Politics : నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం.. స్పందించిన టీడీపీ అధిష్టానం
AP Politics : గత కొన్ని రోజులుగా ఈ డిమాండ్ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెంచుతోంది. ముఖ్యంగా, కడప జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి స్టేజ్‌పై మాట్లాడుతూ, నారా లోకేష్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయాలని విజ్ఞప్తి చేశారు.
Date : 20-01-2025 - 5:39 IST -
#Andhra Pradesh
AP Politics : లోకేష్ డిప్యూటీ సీఎం డిమాండ్‌పై జనసైనికులు ఎందుకు అభద్రత భావంలో ఉన్నారు..?
AP Politics : ఇదిలా ఉంటే, ఈ డిమాండ్లపై జనసేన మద్దతుదారులు అభద్రతా భావంతో ఉండడం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో విచిత్రమైన కారణాలతో ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించడం మనం చూడవచ్చు.
Date : 19-01-2025 - 10:46 IST -
#Andhra Pradesh
Lakshmi Parvathi : నన్ను ఎందుకు వేధిస్తున్నారు.. లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు
Lakshmi Parvathi : ఎన్టీఆర్‌తో తన వివాహం గురించి చెబుతూ, ‘‘లక్షలాది ప్రజలు చూస్తుండగా, ఎన్టీఆర్ నన్ను వివాహం చేసుకున్న సంగతి మీరందరికి తెలిసిన విషయమే. అయినా, నన్ను నందమూరి కుటుంబ సభ్యురాలిగా ఎందుకు చూడటం లేదు?’’ అని ప్రశ్నించారు.
Date : 18-01-2025 - 12:21 IST -
#Andhra Pradesh
CM Chandrababu : నేడు సాయంత్రం టీడీపీ మంత్రులు, ఎంపీలతో చంద్రబాబు కీలక భేటీ..
CM Chandrababu : సీఎం చంద్రబాబు ఈరోజు బిజీగా గడపనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో, ముఖ్యమంత్రి అనేక కీలక సమస్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశం రాష్ట్రంలోని సంక్షేమ కార్యక్రమాలు, వివిధ శాఖల పనితీరును సమీక్షించేందుకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వనుంది.
Date : 17-01-2025 - 10:06 IST -
#Andhra Pradesh
Population Control Vs Chandrababu : ఎక్కువ మంది పిల్లల్ని కనడం తప్పేం కాదు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
మనదేశంలోనూ వృద్ధుల జనాభా(Population Control Vs Chandrababu) పెరుగుతున్నందున ఆ సమస్యను అధిగమించేందుకు.. కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనాలి’’ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
Date : 15-01-2025 - 8:39 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఈనెల 20న దావోస్‌కు చంద్రబాబు.. ఆయనతో పాటు
CM Chandrababu : ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రసిద్ధ సంస్థల CEOలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఆర్థిక ప్రగతి సాధనకు అవసరమైన ప్రణాళికలను వివరించడం, అలాగే కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
Date : 13-01-2025 - 10:02 IST