Chandrababu Naidu
-
#Andhra Pradesh
CM Chandrababu: ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారు
CM Chandrababu: 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ రాష్ట్ర సచివాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రజల హక్కులను రక్షించేందుకు కీలకమైన ఆస్తి అని దుర్వినియోగం జరిగితే ప్రజలు ఓటు ద్వారా సమాధానం చెప్పగలిగే సమాజంలో మెలిగినందుకు భావించారు.
Published Date - 01:30 PM, Tue - 26 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu : అర్బన్ ప్లానింగ్ రంగంలో సంస్కరణలకు సీఎం చంద్రబాబు అనుమతి..
CM Chandrababu : పట్టణ ప్రణాళికా రంగంలో సంస్కరణల అమలుపై అధికారులు సమర్పించిన నివేదికలను సీఎం పరిశీలించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం మున్సిపల్ శాఖ మంత్రి పొంగురి నారాయణ మీడియాతో వివరాలు పంచుకున్నారు.
Published Date - 11:29 AM, Tue - 26 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu : జమిలి ఎన్నికల్లో ఏపీ ఉండదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
CM Chandrababu : టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలపై తన అభిప్రాయాన్ని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జమిలి ఎన్నికలు వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు మాత్రం 2029లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కోసం జమిలి వ్యవస్థను అమలు చేసినప్పటికీ, రాష్ట్ర ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని చెప్పారు.
Published Date - 11:38 AM, Sat - 23 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu: పార్లమెంట్ సెషన్స్ నేపథ్యంలో ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం
CM Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో, టీడీపీ ఎంపీలకు వ్యూహాత్మక సూచనలు అందించారు. ప్రధానంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కీలక ప్రాజెక్టుల పురోగతి, అలాగే రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.
Published Date - 10:30 AM, Sat - 23 November 24 -
#Andhra Pradesh
BPCL Oil Refinery: ఏపీలో రూ.60వేల కోట్లతో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ
ఎట్టకేలకు ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(BPCL Oil Refinery) చొరవతో ఆంధ్రప్రదేశ్‌లో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.
Published Date - 11:55 AM, Thu - 21 November 24 -
#Andhra Pradesh
Ramamurthy Naidu Passes Away: నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత.. బులిటెన్ విడుదల చేసిన ఏఐజీ
రామ్మూర్తి నాయుడు రాజకీయ జీవితానికి వస్తే ఆయన 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు నారా రోహిత్ టాలీవుడ్‌లో హీరోగా రాణిస్తున్నారు.
Published Date - 03:22 PM, Sat - 16 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
CM Chandrababu : నేడు ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. శనివారం నిర్వహించనున్న ఆంగ్ల పత్రిక లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన పాల్గొంటారు. ఈరోజు ఉదయం ఆయన శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి, అక్కడ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీకి పయనమవుతారు.
Published Date - 09:37 AM, Fri - 15 November 24 -
#Andhra Pradesh
Seaplane : ఫ్యూచర్‌లో ఏ యిజం ఉండదు.. టూరిజం ఒక్కటే ఉంటుంది : సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వ హయాంలో మసకబారిన ఏపీ ఇమేజ్‌ను(Seaplane) సరిచేసే పనిలోనే మేం ఉన్నాం.
Published Date - 01:09 PM, Sat - 9 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu : ఇవాళ సీ ప్లేన్ ట్రయల్ రన్.. విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లనున్న సీఎం చంద్రబాబు..
CM Chandrababu : విజయవాడలోని బబ్బూరి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సీప్లేన్ సర్వీసును నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ఇతర ఉన్నతాధికారులు ఉదయం 10:30 గంటలకు పున్నమి ఘాట్ నుంచి బయలుదేరి శ్రీశైలం జలాశయంలోకి చేరుకుంటారని ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సీవీ ప్రవీణ్ ఆదిత్య తెలిపారు.
Published Date - 09:51 AM, Sat - 9 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu : పార్టీ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిచాం.. 45 ఏళ్ల తరువాత అతిపెద్ద విజయం సాధించాం.
CM Chandrababu : ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నవంబర్ 1 అంటే అందరికీ రాష్ట్ర అవతరణ గుర్తుకువస్తుందని, మేం మొన్న క్యాబినెట్ లో దీనిపై చర్చించాం. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తుపట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ప్రాణ త్యాగంతో రాష్ట్రం ఏర్పాటు అయ్యిందని, ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేసింది నేను అని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. 1952 అక్టోబర్ 19 ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఆ పోరాటంలో డిశంబర్ 15వ తేదీన ఆయన ప్రాణాలు విడిచారని, దాదాపు 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఆయన అన్నారు.
Published Date - 06:40 PM, Fri - 1 November 24 -
#Andhra Pradesh
Nara Lokesh : అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేశ్..!
Nara Lokesh : ఈ పర్యటనలో, అట్లాంటాలో ఎన్టీ రామారావు (ఎన్టీఆర్) విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆయన, ఎన్టీఆర్ తెలుగువారికి గర్వకారణమని, ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నారని కొనియాడారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన లోకేశ్, ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN)కే దక్కుతుందని, ఆయన నాయకత్వమే ప్రపంచం ఏపీ వైపు చూస్తోందని పేర్కొన్నారు.
Published Date - 11:24 AM, Fri - 1 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈవో సమావేశం
CM Chandrababu: నీతి ఆయోగ్ సీఈవోతో నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై, అలాగే ఇతర ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది.
Published Date - 09:54 AM, Wed - 30 October 24 -
#Andhra Pradesh
Nara Lokesh In USA: అమెరికా లో మంత్రి నారా లోకేష్ బిజీ బిజీ
మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన చేస్తున్నాడు. ఆయన పెరోట్ మరియు టెస్లా సంస్థల ప్రతినిధులతో సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. మొదట, లోకేష్ పెరోట్ గ్రూప్ అండ్ హిల్‌వుడ్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ రాస్ పెరోట్ జూనియర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో ఏవియేషన్ మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఏపీ తీరప్రాంతం టెక్సాస్ తరహా ప్రాజెక్టులకు అనుకూలంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో పోర్టులు, హైవేలు, పట్టణాభివృద్ధికి సహకరించాలని […]
Published Date - 01:00 PM, Mon - 28 October 24 -
#Andhra Pradesh
TDP : ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
TDP : ఉదయం 9 గంటలకు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. 'కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం చూసే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024 ప్రారంభమైంది. వంద రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే ..ఐదు లక్షల ప్రమాద బీమా, విద్య, వైద్య, ఉపాధి సహాయం అందిస్తుంది తెలుగుదేశం పార్టీ. వాట్సప్, టెలిగ్రామ్, తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ ద్వారా ఇప్పుడే సభ్యత్వం తీసుకోండి..' అని టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
Published Date - 10:07 AM, Sat - 26 October 24 -
#Andhra Pradesh
AP Politics : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జగన్ తన రాజగురువుకిచ్చిన 15 ఎకరాలు కాన్సిల్..!
AP Politics : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీడీపీ నేతృత్వంలో, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన వివాదాస్పద భూ కేటాయింపును రద్దు చేసే కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో విశాఖపట్నంలో శ్రీ శారదా పీఠానికి 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఎకరాకు కేవలం రూ.1 లక్ష చొప్పున కేటాయించారు, అయితే భోగాపురం విమానాశ్రయం , రియల్ ఎస్టేట్ అభివృద్ధి కారణంగా ఆ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Published Date - 01:31 PM, Sun - 20 October 24