CM Chandrababu : రెండో రోజు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన ఇలా..!
CM Chandrababu : ఈ రోజు ఉదయం 10 గంటలకు కుప్పం ఆర్ అండ్ బీ అతిథిగృహం నుంచి బయల్దేరి, టీడీపీ కార్యాలయానికి చేరుకుని అక్కడ జన నాయకుడు సెంటర్ ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో ప్రజలనుంచి వినతులు స్వీకరించి, అనంతరం కుప్పం పార్టీ కేడర్‌తో సమావేశం జరపనున్నారు.
- By Kavya Krishna Published Date - 10:38 AM, Tue - 7 January 25

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు కుప్పం ఆర్ అండ్ బీ అతిథిగృహం నుంచి బయల్దేరి, టీడీపీ కార్యాలయానికి చేరుకుని అక్కడ జన నాయకుడు సెంటర్ ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో ప్రజలనుంచి వినతులు స్వీకరించి, అనంతరం కుప్పం పార్టీ కేడర్‌తో సమావేశం జరపనున్నారు.
మధ్యాహ్నం 12:20 గంటలకు కంగుంది గ్రామానికి చేరుకుని, దివంగత శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 1:20 గంటలకు, కుప్పంలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేరుకుని అక్కడని అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు 92 కోట్ల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
Pooja Hegde : పాత్రలో జీవించాలనే.. పూజా హెగ్దే కామెంట్స్..!
సాయంత్రం 5:05 గంటలకు శాంతిపురం మండలం కడపల్లె వద్ద సొంతింటి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. ఆ తరువాత సాయంత్రం 6:10 గంటలకు ద్రావిడ యూనివర్సిటీలో అకడమిక్ బిల్డింగ్‌లోని కెరీర్ రెడీనెస్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం అనంతరం యూనివర్సిటీలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ప్రధానంగా, చంద్రబాబు తొలి రోజు పర్యటనలో ద్రావిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. అంతే కాకుండా, రాష్ట్రంలోనే తొలిసారిగా సూర్యఘర్ సోలార్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇదే సమయంలో, సీగలపల్లెలో “ఆర్గానిక్ కుప్పం” కార్యక్రమంలో భాగంగా ప్రకృతి సేద్యం రైతులతో ముఖాముఖిగా పాల్గొన్నారు.
చంద్రబాబు, 2014-19 మధ్యకాలంలో రాష్ట్ర అభివృద్ధి పురోగతి సాధించినప్పటికీ, వైసీపీ పాలనలో అభివృద్ధి 4 శాతం తగ్గిపోయిందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. రాష్ట్రం తిరిగి అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి కూటమి ప్రభుత్వం త్వరలో సమర్థవంతమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
Tremors In India : నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం.. బిహార్, ఢిల్లీ, బెంగాల్‌లో ప్రకంపనలు