Chandrababu Naidu
-
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీలో ప్రకృతి సేద్యానికి అమెరికా సంస్థల సహకారం..
CM Chandrababu : ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ , ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, ప్రకృతి వ్యవసాయం, ఆహార సర్టిఫికేషన్, మార్కెట్ డెవలప్‌మెంట్ , రైతుల సంక్షేమం పై చర్చించబడింది. ఇది రాష్ట్రం కోసం గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఏర్పడటానికి ఒక ముఖ్యమైన అడుగు.
Date : 20-02-2025 - 11:14 IST -
#Andhra Pradesh
CM Chandrababu : అప్పులు చేస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి..
CM Chadrababu : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరులో మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల్లో కూరుకుపోయినందున సంక్షేమ పథకాలను అమలు చేయడం కష్టమవుతున్నట్లు తెలిపారు. అలాగే, వ్యవసాయం, చెత్త రీసైక్లింగ్, పర్యావరణ రక్షణ, సోలార్ ఎనర్జీ వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Date : 15-02-2025 - 7:39 IST -
#Andhra Pradesh
CM Chandrababu : స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్చాంధ్ర , బీసీ సంక్షేమంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో, రాష్ట్ర అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, బీసీ సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాలు చర్చించబడ్డాయి. ముఖ్యమంత్రి, వనరుల సద్వినియోగం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, స్వచ్చతపై ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు.
Date : 14-02-2025 - 8:31 IST -
#Andhra Pradesh
Srinivas Varma : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
Srinivas Varma : తెలుగు రాష్ట్రాల్లో యువత రాజకీయ ప్రస్థానం ముఖ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. యూత్ కాంగ్రెస్ నుంచి అనేక మంది ప్రముఖ నేతలు రాణించారని తెలిపారు. ఆయన సమక్షంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ బాధ్యతలు స్వీకరించారు.
Date : 14-02-2025 - 7:29 IST -
#Telangana
CM Revanth Reddy : చంద్రబాబు, కేసీఆర్‌లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy : తెలుగు రాష్ట్రాల అగ్ర రాజకీయ నాయకులందరూ యూత్ కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో జక్కిడి శివచరణ్ తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Date : 14-02-2025 - 7:05 IST -
#Andhra Pradesh
Chintamaneni Prabhakar: సీఎం చంద్రబాబుతో చింతమనేని భేటీ..
Chintamaneni Prabhakar: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో, ఇటీవల దెందులూరులో జరిగిన సంఘటనలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఇంకా, వైసీపీ నేతలపై అక్రమ కేసులు, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలు చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారాన్ని కోరారు.
Date : 14-02-2025 - 6:08 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఇది రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వానికి అద్దం పడుతున్న గొప్ప ఘట్టం
CM Chandrababu : ప్రకాశం జిల్లాకు గర్వకారణమైన ఒంగోలు గిత్త మరోసారి ప్రపంచాన్ని ఆకట్టుకుంది. బ్రెజిల్‌లో జరిగిన కాటిల్ వేలంలో విటియాన-19 రకానికి చెందిన ఒంగోలు గిత్త ఏకంగా రూ. 41 కోట్లు పలకడం సంచలనం సృష్టించింది. ఇది ఒంగోలు జాతి గ్లోబల్ ప్రాముఖ్యతను మరోసారి ప్రపంచానికి చాటింది.
Date : 13-02-2025 - 9:28 IST -
#Andhra Pradesh
Mega DSC : మెగా డీఎస్సీపై సర్కార్ కసరత్తు.. మార్చిలో నోటిఫికేషన్..?
Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి, జూన్ నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Date : 12-02-2025 - 12:57 IST -
#Andhra Pradesh
Liquor Price : ఏపీలో పెరిగిన మద్యం ధరలు అమల్లోకి..
Liquor Price : ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెంపు అమల్లోకి వచ్చింది. సామాన్యుల కోసం అందుబాటులోకి తెచ్చిన రూ. 99 మద్యం బాటిల్, బీర్లను మినహాయించి మిగతా అన్ని బ్రాండ్‌లపై రూ. 10 చొప్పున ధర పెంచారు. మద్యం రేట్లు పెరగడంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపు నేపథ్యం, ప్రభుత్వ నిర్ణయం, ప్రతిపక్షాల స్పందన వంటి అంశాలను వివరంగా పరిశీలిద్దాం.
Date : 11-02-2025 - 12:59 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం భేటీ
CM Chandrababu : శుక్రవారం ఉదయం నీతి ఆయోగ్ బృందం సచివాలయానికి చేరుకోగా, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వారిని స్వాగతం పలికారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావులతో పాటు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీ పాల్గొన్నారు.
Date : 07-02-2025 - 2:09 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలి.. బీజేపీ అభ్యర్ధుల గెలుపునకు తెలుగు ప్రజలు కృషి చేయాలి
CM Chandrababu : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. తెలుగు ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ఢిల్లీ అభివృద్ధి విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యాలను ప్రస్తావించారు. దేశం స్వచ్ఛ భారత్‌లో ముందుకు సాగుతున్నప్పుడు, ఢిల్లీ మాత్రం మురికి కూపంగా మారిందని విమర్శించారు. ఢిల్లీ ప్రజలకు మంచి పాలన అందించాలంటే బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా తెలుగువారు బీజేపీ విజయంలో భాగమవ్వాలని పిలుపునిచ్చారు.
Date : 03-02-2025 - 12:37 IST -
#Andhra Pradesh
Fiber Net : ఫైబర్ నెట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి
Fiber Net : 2017లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రారంభమైన ఫైబర్ నెట్ ప్రోగ్రాం, అతి తక్కువ ధరలో మూడు సేవలను కలిపి ప్రజలకు అందించడం ద్వారా దేశవ్యాప్తంగా ఆకట్టుకుంది. ఇది కేవలం రూ.149లో వినియోగదారులకు కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సేవలను అందించడమే కాకుండా, 17 లక్షల కనెక్షన్లు 2019లో పూర్తయ్యాయి.
Date : 30-01-2025 - 12:11 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబు గుజరాత్ మోడల్ వ్యాఖ్యల అర్థం ఇదా..?
CM Chandrababu : ఇటీవల తన ప్రసంగాల్లో సీఎం చంద్రబాబు గుజరాత్ మోడల్‌ను ప్రస్తావిస్తూ అభివృద్ధికి రాజకీయ స్థిరత్వం ఎంత ముఖ్యమో వివరించారు. ఆయన గుజరాత్ మోడల్ గురించి రెండు, మూడు సార్లు చెప్పిన సందర్భాలు ప్రజలకు చర్చనీయాంశమయ్యాయి.
Date : 28-01-2025 - 10:35 IST -
#Andhra Pradesh
Yuva Galam Padayatra : నేటికి యువగళానికి రెండేళ్లు.. అలుపెరగని యోధుడు నారా లోకేష్
Yuva Galam Padayatra : నారా లోకేష్ తన తండ్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వ పునాదులను ముందుకు తీసుకెళ్లేందుకు, ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఈ పాదయాత్ర ప్రారంభించారు. రాజధాని లేకుండా, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగింది టీడీపీనే అని ప్రజలు నమ్మినప్పటికీ, 2019 ఎన్నికల్లో వైసీపీ చేసిన ఆకర్షణీయ ప్రచార నినాదాలతో ప్రజలు ఆ పార్టీకి అధికారం అప్పగించారు.
Date : 27-01-2025 - 2:08 IST -
#Andhra Pradesh
Governor Abdul Nazeer : ఏపీ ఆర్థిక పరిస్థితిపై గరవర్నర్ కీలక వ్యాఖ్యలు
Governor Abdul Naseer : జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఏపీ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోంది.” అని పేర్కొన్నారు.
Date : 26-01-2025 - 1:56 IST